Jump to content

Recommended Posts

Posted

పాకిస్ధాన్ వాయువ్య ప్రాంత పట్టణమైన పెషావర్‌లో గాలి పటం ఎగురవేసే విషయంలో ఏర్పడిన వివాదంలో ఒక హిందూ మతస్ధుడు తన పొరుగింటిలో నివశించే క్రైస్తవుని చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. గాలిపటాలను ఎగుర వేయడంలో ఏర్పడిన వివాదంలో ఇది చోటు చేసుకుంది. పెషావర్‌లోని కలిబాడి వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇక్కడ వారిద్దరు కొంత సేపు వాదించుకున్న తర్వాత పూల్ అస్లామ్‌ను సలీమ్ మాసిస్ హత్యచేశాడు.

మాసిస్ అతని కుమారుడు సికిందర్ గాలి పటాలు ఎగురవేస్తున్నపుడు అస్లామ్‌ ఇంటిలో గాలిపటం పడింది. దానిని తీయటానికి ప్రయత్నించాడు. అస్లామ్ వారిపై పిర్యాదు చేయగా మాసిస్ తీవ్రపదజాలంతో విరుచుకుపడ్డాడు.

తర్వాత మాసిస్ అస్లామ్‌ను పిస్టల్‌తో కాల్చి చంపాడు. తీవ్రంగా గాయపడిన అతనిని హాస్పటల్‌కు తీసుకెళ్ళగా అక్కడ మరణించాడు. పరారిలో ఉన్న మాసిస్‌ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Posted

RIP to him but ee situation edo variety ga undi... MUSLIM country lo HINDU killed by CHRISTIAN  sSc_hiding2 sSc_hiding2

×
×
  • Create New...