Jump to content

Prem Viswanathan Rocks...........A True Humanitarian


Recommended Posts

Posted

[img]http://sakshi.com/newsimages/contentimages/11032011/Alls10-3-11-51984.jpg[/img]

[size=10pt]అమ్మ పాదాల చెంత స్వర్గం ఉంటుంది అన్నారు పెద్దలు.
నాన్న కూడా దేవుడే అంటారు విజ్ఞులు. జన్మనిచ్చిన తల్లిదండ్రులను మాతృదేవోభవ, పితృదేవోభవ అని పూజించే దేశం మనది.
కాని ఇవాళ ఆ దేవుళ్లకు ఇళ్లల్లో చోటు లేదు. వృద్ధాశ్రమాల్లో తప్ప.
కడుపున పుట్టిన పిల్లలే తమ హృదయాలను కురచ చేసుకొని తల్లిదండ్రులను బయటకు పంపించేస్తున్నారు. అలాంటి సమయంలో వృద్ధల కోసమే ఓ ఆలయం నిర్మించిందామె.
వృద్ధులనే దేవుళ్లలా చూసుకుంటూ దానినో వృద్ధాలయంగా చేసింది.
వారి సమక్షంలో ఆమె ఓ పూజారి.
వారి సేవే మాధవ సేవ.

- రామ్, ఎడిటర్ - ఫ్యామిలీ


‘‘మా తాతయ్య ఎక్కడున్నారో... అసలున్నారో లేదో ఇప్పటికీ తెలీదయ్యా’’ అన్నారు ప్రేమా విశ్వనాథన్. అప్పుడు ఆ 60 ఏళ్ల మహిళ కళ్లలో ఒక కన్నీటి జ్ఞాపకం కనపడింది. నిండైన చీరకట్టులో పేరుకు తగ్గట్టు స్వచ్ఛంగా మెరిసిపోతున్న ప్రేమమ్మ... హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌లో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌లో వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం కల్పిస్తూ... జాడ కనుక్కోలేకపోయిన తన తాతయ్య సమక్షాన్ని, ఆప్యాయతని ఈ రకంగా పొందుతున్నారు. తొలిసారి కలిసినప్పుడు ప్రేమా విశ్వనాథన్ కాస్త హడావిడిగా ఉన్నారు. తన ఇంట్లో ఉన్న బోసినవ్వుల బామ్మల్ని, తాతయ్యల్ని ఆమె తీర్థయాత్రలకు తీసికెళ్లనున్నారు. రిజర్వేషన్లు, దుస్తులు, అవసరమైన వస్తువులు సిద్ధం చేయడం... వంటి పనులతో బిజీగా ఉన్నారు.

‘‘అమ్మా, నాన్న పోయాక ఫొటోలు పెట్టి దండలు వేసేవాళ్లే తప్ప ఉన్నప్పుడు వారికి కావల్సింది చూసేవాళ్లు ఎందరున్నారయ్యా’’ అంటూ ప్రశ్నిస్తారు ప్రేమ. ఇంట్లో ఉన్న అమ్మమ్మనో, తాతయ్యను ఇంటీరియర్‌కు అడ్డంగా వున్న పాత సామానుగా చూసి వదిలించుకోడానికి వెనుకాడని వారసులు ఉన్న ఈ రోజులలో అనాథ వృద్ధులకు ఆమె చేస్తున్న సేవకు నేపథ్యం ఏమిటంటే...

కనపడని తాతయ్యే కారణం...
కాలేజీ సెలవుల్లో ఇంటికి వచ్చిన ప్రేమ ‘తాతయ్య ఏడీ?’ అని తన కన్నవాళ్ళను ప్రశ్నించినపుడు వచ్చిన సమాధానం వృద్ధాశ్రమంలో పెట్టామని. తాతయ్యను చూడాలని ఎంతో హడావిడిగా వచ్చిన ప్రేమ ఆ సమాధానం విని తట్టుకోలేకపోయారు. చిన్నప్పటి నుంచీ తనను గుండెల మీద ఆడించి పెంచిన తాతయ్యను తొంభై ఏళ్ల వయసులో ఒంటరిని చేసిన పెద్దవాళ్లను అదేమని ప్రశ్నించే ధైర్యం లేక... కుమిలి కుమిలి ఏడ్చి ఊరుకున్న రోజుల్ని ఆమె ఇప్పటికీ మర్చిపోలేరు. ఆమెకు తాతయ్య మళ్లీ కనపడలేదు. ఆయనను ఏ ఆశ్రమంలో వేశారో, ఆయనసలు బతికున్నారో లేదో కూడా ఇప్పటికీ తెలీదు.

తమిళనాడులోని తిరుచనాపల్లికి చెందిన ప్రేమ... మద్రాసులో చదువు పూర్తయిన అనంతరం పెళ్లి చేసుకుని భర్త ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు వచ్చారు. తనకో బ్యాంకు ఉద్యోగం, ఛార్టెడ్ ఎకౌంటెంట్‌గా స్థిరపడిన భర్త, కొడుకు, కూతురుతో హాయిగా సాగిపోతున్న సంసారం... ఆమె జీవితాన్ని సుఖమయం చేశాయేమో కాని తాతయ్యను మాత్రం మరిచిపోయేలా చేయలేకపోయాయి. నిలువనీడలేని వృద్ధుల్ని చూసినపుడు ఆమెకు వారిలో తన తాతయ్యే కనపడేవారట. అంతేకాదు... ఆమెకు ఎదురైన చాలా అనుభవాలు సమాజంలో వృద్ధుల అవస్థలను కళ్లకు కట్టాయి.

ఈ ఆలోచనలతో ఉద్యోగం చేయలేక 44 ఏళ్ల వయసులో బంగారం లాంటి బ్యాంకు ఉద్యోగం నుంచి విఆర్‌ఎస్ తీసుకుని, ఆ డబ్బుతో మచ్చబొల్లారంలో ఒక వృద్ధ్దాశ్రమాన్ని నెలకొల్పారు. ‘‘ఉద్యోగం వదులుకుని ఇలా వృద్ధుల సేవకు సిద్ధమవడాన్ని చూసి చాలా మంది పిచ్చెక్కిందా అనడిగారు. నేనవేవీ పట్టించుకోలేదు’’ అన్నారామె. వైద్య సౌకర్యాలకు నగరానికి రావాలంటే రాకపోకలకు ఇబ్బందిగా ఉండడంతో... ఉంటున్న ఇంటిని ఖాళీ చేసి ఖర్చు అయితే అయిందని ఒక అపార్ట్‌మెంట్‌లో పక్క పక్కనే రెండు ఫ్లాట్స్ అద్దెకు తీసుకున్నారు. ఆనందాశ్రమం పేరుతో వాటిని నడుపుతున్నారు. ‘‘ప్రస్తుతం 30 మంది వరకు వృద్ధులు ఇక్కడ ఉంటున్నారు. ఇందులో ఆరోగ్య సమస్యల కారణంగా కొంత మందిని ఆసుపత్రుల్లో చేర్పించా’’అని చెప్పారు ప్రేమ. కాచి చల్లార్చిన నీళ్లు దగ్గర్నుంచి కరెంట్ సమస్య ఎదుర్కోవడానికి ఇన్వర్టర్‌ను ఏర్పాటు చేయడం దాకా తన పరిధిలో ఆశ్రమంలోవారికి ఏ లోటూ లేకుండా చూసుకుంటున్నానన్నారు.

మానవత్వానికి భరోసా...
‘‘నా కుమార్తె, కుమారుడు ఆర్థికంగా స్థిరపడ్డారు. ఆశ్రమం నిర్వహణకు వారు చేయగలిగింది చేస్తున్నారు. మిత్రులు డాక్టర్ ఎ.కె. చారి తరచుగా వచ్చి వైద్య పరీక్షలు నిర్వహిస్తుంటారు. అపోలో వాళ్లు ఉచితంగా మందులు ఇస్తుంటారు. నెలనెలా గోధుమపిండి, బియ్యం... ఇలా పంపేవారు కూడా ఉన్నారు’’ అంటూ తను చేస్తున్న పనికి నలుగురూ తోడవుతున్న వైనాన్ని వివరిస్తారామె. అయితే ఎక్కడెక్కడి వృద్ధులనో చేరదీసి అక్కడ ఉంచడం కొందరు ఆధునికులకు నచ్చలేదు. అపార్ట్‌మెంట్‌లో ఈ ఆశ్రమం ఉండడానికి వీల్లేదంటూ కొత్త రూల్స్ తెచ్చారు. అయితే ప్రేమావిశ్వనాధన్ వీటికి జంకలేదు.‘‘అరవై ఏళ్లు దాటిన వారెవరికీ అపార్ట్‌మెంట్‌లో నివసించేందుకు అనుమతి లేదు అని బహిరంగంగా ప్రకటించండి. అప్పుడు నేను ఖాళీ చేస్తా’’ అని ప్రేమ విసిరిన సవాలుకు ఆశ్రమాన్ని తొలగించాలని చూసిన స్వార్ధం తోకముడిచింది.

ఆశ్రమం పనులన్నీ దగ్గరుండి చూసుకోవడం, అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆసుపత్రులకు తిరిగాల్సి రావడం... వంటివి ఆమె ఆరోగ్యాన్ని దెబ్బతీసి హార్ట్ పేషెంట్‌గానూ మార్చాయి. అయితే తన ఆరోగ్యం గురించి తనకేమీ బెంగలేదంటున్న ప్రేమ...‘‘నేను లేకపోయినా ఏ ఆటంకం లేకుండా ఈ ఆశ్రమం నడిస్తే చాలు’’ అంటారు.

ప్రస్తుతం తన దగ్గరున్న పెద్దల్ని తీసుకుని మార్చి 14న ఆమె కాశీకి బయలుదేరుతున్నారు. ‘‘పెద్ద వయసు వారు అని చెప్తే... రిజర్వేషన్లలో ప్రయారిటీ ఇవ్వడమే కాకుండా లోయర్‌బెర్త్‌లు అలాట్ అయ్యాలా చూడడంలో కొందరు రైల్వే అధికారులు కూడా బాగా సాయం చేసారయ్యా’’ అంటూ సంతోషంగా చెప్పారామె. అనాథ వృద్ధుల తోడుగా సాగుతున్న ఈ ‘ప్రేమ’ప్రయాణం సవ్యంగా సాగిపోవాలని కోరుకుందాం.

వృద్ధాప్యానికి ఊరడింపు
గత 15సంవత్సరాలుగా ప్రేమావిశ్వనాధన్ ఆధ్వర్యంలోని ఆనందాశ్రమం పలువురు వృధ్ధులకు ఆశ్రయం ఇస్తోంది. తన ఆశ్రమంలో ఉంటూ కన్నుమూసిన వృద్ధుల ఆత్మశాంతికి ఆమె ఏటేటా శ్రాద్ధకర్మలు సైతం జరిపిస్తారు. ఆశ్రమంలో వృద్ధులను వీలున్నప్పుడల్లా తీర్థయాత్రలకు తీసుకువెళతారు. వీరిలో గుజరాత్, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల వారు, మతిస్థిమితం లేనివారు, అంధులు కూడా ఉన్నారు. ఉదయం, సాయంత్రం యోగా, ప్రార్థన చేయించడం, సమయానికి బలవర్ధకమైన ఆహారం, అవసరమైన మందులు... అందివ్వడం అంతా ఆమె స్వయంగా దగ్గరుండి చూసుకుంటారు. ‘‘మనం ఎన్ని చేసినా... రక్త సంబంధీకులు ఒక్కరైనా వచ్చి గ్లాసుడు మంచినీళ్లిస్తే కలిగే ఆనందంతో సాటిరాదు కదా’’అనే ప్రేమ మాటల్లో తానెంత చేసినా అయినవారిని మరిపించలేననే ఆవేదన వినిపిస్తుంది.

- ఎస్.సత్యబాబు, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి
ఫొటోలు: అమరశ్రీనివాసరావు[/size]
[img width=177 height=200]http://sakshi.com/newsimages/contentimages/11032011/AMR_031410-3-11-52437.jpg[/img]

Posted

[quote author=chotu gadu link=topic=165805.msg1997269#msg1997269 date=1299795101]
*=: *=: *=: *=: *=: *=: *=:
[/quote]

I like u chotu baa....especially ur attitude......ila manchi posts paduthe definite ga encourage chesthav....... sHa_fr1ends sHa_fr1ends

Posted

[quote author=AutoNagarSurya link=topic=165805.msg1998126#msg1998126 date=1299805117]
*=: *=: you rock you rock
[/quote]

emaye poyav inne rojulu........asalu db ki ravadam ledhu anukunta kada

Posted

[img]http://pictures.picasion.com/pic15/0a65229f4c6cee21de43daffd10417a8.gif[/img]


nice thread nice thread nice thread

Posted

sHa_clap4 nice thread nice thread nice thread you rock

×
×
  • Create New...