Jump to content

Airtel rocks........


Recommended Posts

Posted

[size=10pt]న్యూఢిల్లీ: నెలకు రూ.99 అద్దెకే ‘ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ టీవీ’ ప్లాన్‌ను అందిస్తున్నట్లు భారతీ ఎయిర్‌టెల్ సోమవారం ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా కంప్యూటర్‌లో 28 టీవీ చానెల్స్ లైవ్ ప్రసారాలను వీక్షించవచ్చని కంపెనీ తెలిపింది. సాక్షి టీవీ,యూటీవీ బిందాస్, యూటీవీ మూవీస్, బ్లూమ్‌బర్గ్ యూటీవీ, టీఎల్‌సీ, ఎనిమల్ ప్లానెట్, అన్ని డిస్కవరీ చానెల్స్, లైవ్ ఇండియా, తరంగ్ మ్యూజిక్‌లను సైతం చూడొచ్చని భారతీ ఎయిర్‌టెల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్(టెలీ మీడియా సేవలు) గిరీష్ మెహతా చెప్పారు. కస్టమర్లకు న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్, ఇతరత్రా విభాగాల్లో విస్తృతస్థాయిలో కంటెంట్‌ను అందిస్తామని ఆయన వెల్లడించారు.

19 వీడియో ఆన్ డిమాండ్(వీఓడీ) చానెల్స్, 12 మూవీస్ చానెల్స్ ప్లాన్‌లను తెచ్చే ఆలోచన ఉందన్నారు. వై-ఫై నెట్‌వర్క్ మీద ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని ఆయన స్పష్టంచేశారు. లైవ్, వీఓడీ చానెల్స్, మూవీస్‌తో కలిపి రూ.99 ప్లాన్, అన్ని చానెల్స్, మూవీస్(రాత్రి 9 గం. నుంచి ఉదయం 9 గం. వరకు)తో రూ.49 ప్లాన్, ఏవైనా ఎంచుకున్న 3 చానెల్స్‌తో రూ.49 ప్లాన్‌లను త్వరలో మార్కెట్లోకి తెస్తామని ఆయన ప్రకటించారు. డాటా వాడుకున్నందుకు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది.
[/size]
[img]http://sakshi.com/newsimages/contentimages/15032011/airtel15-3-11-39812.jpg[/img]

×
×
  • Create New...