Jump to content

Small film wid a golden collections......


Recommended Posts

Posted

[img]http://ap7am.com/backimages/cinemaphotos/thumbnail/Tanu-Weds-Manu_9839.jpg[/img]
[size=12pt]
            బాలీవుడ్ లో పెద్ద పెద్ద స్టార్లు నటించిన సినిమాలే బాక్సాఫీసు దగ్గర కొడుతున్న తరుణంలో, ఇటీవల ఒక చిన్న సినిమా విజయదుందుభి మోగించింది. ఆ సినిమా 'తను వెడ్స్ మను'! మాధవన్, కంగనా రనౌత్ జంటగా, ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా గత నెల 25 న విడుదలైంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, నవ్వుల్లో ముంచెత్తుతోంది. కథగా చెప్పాలంటే ఏమంత పెద్ద కథ కూడా కాదు. కానీ, ట్రీట్మెంట్ కొత్తగా సాగడంతో అందులోని ఫ్రెష్ నెస్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
            తను (కంగనా) అనే అమ్మాయికి మనూ (మాధవన్) అనే అబ్బాయితో పెద్దలు పెళ్లి నిశ్చయిస్తారు. అయితే, తన మనసులో ప్రియుడు రాజ్ (జిమ్మీ షేర్ గిల్) ఉన్నాడన్న విషయాన్ని తను చెప్పలేకపోతుంది. కానీ, పెళ్లిలో ధైర్యం తెచ్చుకుని ఎవరికీ చెప్పకుండా ప్రియుడి దగ్గరకి వెళ్లిపోతుంది. ఇక్కడి నుంచీ కథ మలుపు తీసుకుంటుంది. చివరికి అసలైన పెళ్లికొడుకు మనూని ఎలా చేరుకుంటుందన్నది వినోదాత్మకంగా తెరకెక్కించారు.
          ఇప్పటికే ఈ సినిమా 30 కోట్ల షేర్ కలెక్ట్ చేసినట్టు చెబుతున్నారు. రానురాను ఈ సినిమాకు మరింతగా ఆదరణ పెరగవచ్చని బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాతో మాధవన్ కి కూడా హిందీలో మార్కెట్ పెరుగుతోంది.[/size]
Posted

!q# !q# !q# !q# endo ee movie.. characters lo clarity vundadu.... not sooo super movie.. just okay...

×
×
  • Create New...