Jump to content

Mamatha benarjee rocks.......


Recommended Posts

Posted

[size=10pt]బెంగాల్‌లో ఏకపక్షంగా తృణమూల్ అభ్యర్థుల ప్రకటన

కోల్‌కతా: కాంగ్రెస్ పార్టీకి పశ్చిమబెంగాల్‌లో మిత్రపక్షమైన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీ భారీ షాక్ ఇచ్చారు. బెంగాల్ శాసనసభ ఎన్నికలకు ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించేసింది. 294 స్థానాలకు గాను 228 మంది అభ్యర్థులను ప్రకటించి.. కాంగ్రెస్‌కు తాను కేటాయించిన 64 సీట్లను మాత్రమే తీసుకోవాలని అల్టిమేటం జారీచేశారు. ఆ సీట్లను తీసుకుంటున్నారో లేదో సోమవారం లోగా చెప్పాలని కాంగ్రెస్‌కు గడువు కూడా విధించారు.

లేకపోతే సోమవారం నాడు ఆ 64 సీట్లకు కూడా తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని బాంబు పేల్చారు. దీదీ తీరుతో దిమ్మెరపోయిన కాంగ్రెస్.. తాము ఆ 64 సీట్లలోనే పోటీచేయాలా లేకపోతే మొత్తం 294 స్థానల్లోనూ పోటీ చేయాలా అనే విషయాన్ని నిర్ణయిస్తామని పేర్కొంది. సీట్ల పంపకం ఒప్పందాన్ని ఖరారు చేసేందుకు కొంత సమయం కావాలన్న కాంగ్రెస్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన తృణమూల్ అధినేత్రి, రైల్వేమంత్రి మమతాబెనర్జీ.. తాము ఇచ్చింది తీసుకోండి.. లేకపోతే మానేయండి అన్న రీతిలో కాంగ్రెస్‌కు ఖంగుతినిపించారు. ‘‘సీట్ల సర్దుబాటు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆ 64 స్థానాల్లో అభ్యర్థులను నిలిపితే సంతోషిస్తాం.

లేదంటే.. ఆ సీట్లకు కూడా సోమవారం మేం అభ్యర్థులను ప్రకటిస్తాం’’ అని ఆమె స్పష్టంచేశారు. శుక్రవారం కోల్‌కతాలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూ మమత మీడియాతో మాట్లాడారు. గురువారం రాత్రి వరకూ ఢిల్లీలో కాంగ్రెస్ కేంద్ర నాయకత్వంతో తాను జరిపిన చర్చల్లో ఒక అంగీకారానికి వచ్చామని, దాని ప్రకారమే 228 మంది అభ్యర్థులతో తమ పార్టీ జాబితాను విడుదల చేస్తున్నానని చెప్పారు. సీట్ల పంపకంపై ఒప్పందానికి ఇంకా సమయం కావాలని కాంగ్రెస్ కోరటాన్ని ఆమె తప్పుపట్టారు. ఇప్పటికే సమయం మించిపోతోందన్నారు. ఇంకా అఫిడవుట్లు తదితర ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన కార్యక్రమాలు మొదలుపెట్టాల్సి ఉందని, మారుమూల ప్రాంతాల్లో ఉన్న తమ అభ్యర్థులకు నామినేషన్ పత్రాలు అందేలా చూడాల్సి ఉందని పేర్కొన్నారు. తాము చాలా కాలం వేచిచూశామని, కాంగ్రెస్ అధిష్టానం కోరినప్పుడల్లా తాము స్పందించామని, చర్చలకు హాజరయ్యామని చెప్పారు.

బుద్ధదేవ్‌పై మనీష్‌గుప్తా పోటీ
కోల్‌కతా పరిధిలోని 11 స్థానాల్లో, వివాదాస్పదమైన కోల్‌కతా పోర్టు స్థానంతో సహా ఏ ఒక్క స్థానాన్నీ కాంగ్రెస్‌కు మమత కేటాయించకపోవటం విశేషం. తమ సిటింగ్ అభ్యర్థి ఉన్న కవితీర్థ నియోజకవర్గాన్ని పునర్విభజనలో భాగంగా కోల్‌కతా పోర్టు నియోజకవర్గంగా పేరు మార్చారని, కాబట్టి ఆ స్థానాన్ని తమకే కేటాయించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ కోసం కేటాయించిన 64 సీట్లలో 44 సీట్లు ఉత్తర బెంగాల్ జిల్లాలతో పాటు, ముర్షీదాబాద్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉన్న ప్రాంతాల్లోనివే. మిగతా 20 సీట్లు దక్షిణ బెంగాల్ జిల్లాల్లోనివి. జాదవ్‌పూర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్జీపై రాష్ట్ర ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి మనీష్‌గుప్తాను తృణమూల్ రంగంలోకి దింపింది. సినీ తారలు దేబశ్రీరాయ్, చరణ్‌జీత్, గాయకుడు అనూప్ ఘోశల్, నాటకరంగ ప్రముఖుడు బ్రత్యబసు, మాజీ ఐపీఎస్ అధికారులు రాచ్‌పాల్‌సింగ్, సుల్తాన్‌సింగ్ వంటి వారు తృణమూల్ జాబితాలో ఉన్నారు.

మొత్తం సీట్లకు పోటీ చేయాలా అనేది నిర్ణయిస్తాం: కాంగ్రెస్
తృణమూల్ ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించటంపై బెంగాల్ పీసీసీ ఇన్‌చార్జి, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి షకీల్ అహ్మద్ కోల్‌కతాలో స్పందిస్తూ.. మమత కేటాయించిన 64 స్థానాల్లో పోటీ చేయాలా లేక మొత్తం 294 స్థానాల్లో పోటీ చేయాలా అన్న అంశంపై తమ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. దీనిని పార్టీ ఉన్నతస్థాయి నాయకత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. అభ్యర్థుల జాబితాలను తమ పార్టీలు రెండూ ఉమ్మడిగా ప్రకటించి ఉంటే బాగుండేదని వ్యాఖ్యానించారు. ఇదిలావుంటే.. కాంగ్రెస్ అధికార ప్రతినిధి జనార్ధన్ ద్వివేది ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. బెంగాల్‌లో సీట్ల పంపకం ఒప్పందాన్ని ఖరారుచేసేందుకు తాము కొంత సమయం కోరామని చెప్పారు. ‘‘బెంగాల్‌లో తృణమూల్‌తో పొత్తు కావాలని మేం కోరుకుంటున్నాం. కానీ దీనికి ఇంకా చర్చలు అవసరం. ఇంకా చర్చలు జరపాలనుకుంటున్నాం. అందుకు ఇంకా సమయం కావాలి’’ అని ఆయన పేర్కొన్నారు.
[/size]


e congress ni atalo arati pandu laga chesinde............ @3$% @3$% @3$%

×
×
  • Create New...