Jump to content

******* IDHI NAA PERSONAL THREAD *******************************


Recommended Posts

Posted

[size=12pt]పాండవ వనవాసం

ఓరోరీ మాయాజూదవిజయమధమధోన్మత్త ! దుర్యోధనా !
నీ దురహంకారానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటాను
ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమ్ముననున్దగబిల్చిన,
ఇద్దురాత్ము దుర్వార మదీయ భాహుపరివర్తిత చ్చండగధావిఘాత భగ్నోరుతరోరు జేయుదు
సుయోధనున్ ఉగ్ర రణాన్తరంబునన్

ఓరోరీ కురుకుల దార్తా దుశ్శాసనా!
కురువృద్ధుల్ వృద్ధభాన్ధవులనేకుల్ జూచుచుండ ద్రౌపదినిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకరలీలన్ వధియిన్చి, తద్విపులవక్షస్తలరక్తౌగ నిర్ఝరి ఉర్వీపతుల్ జూచుచుండ అని
ఆస్వాదిన్తును ఉగ్రాకృతిన్

మాయలతో జనియించి మటుమాయల వృత్తిగానెంచు నీవు,
అహొ ! మాయలనిందసేతువే ?
అమాయకులైన పృధాకుమారులన్ మాయలుపన్ని నాడు అవమానము చేయగలేదే?
ఆ గతిన్ మాయలతోనే నీ దురభిమానము మాపెదన్ సుయోధనా ! [/size]

  • Replies 65
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • kingmakers

    43

  • sombarey

    2

  • polikeka

    2

  • mediahater

    2

Top Posters In This Topic

Posted

సీతారామ కల్యాణం
లక్షీదేవి స్తోత్రం
పద్మాసనే, పద్మినిపద్మహస్తే, పద్మాలయే, పద్మదళాతాక్షే
విశ్వప్రియే, విష్ణుమనోనుకూలె త్వా పాదపద్మౌ మైసన్నిదశ్యా .

(లంకానగరం ఇలా ఉంటుందని చెప్పే పద్యం)
సష్టిర్యోజన విస్తీర్ణం, శతయోజన ఉన్నతం
అష్ట ద్వారపురే లంక సప్త ప్రాకార శోభితం
త్రికోణ సంఘసంసేవా నవకోటి శివాలయం
చాతుర్లక్ష్యంచరీ దీవినా రావణేన సురక్షితం

(విష్ణు భక్తులను వేదించమని చెప్తూ రావణుడు)
దానవకులవైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని చదువరాదు
సురపక్షపాతి విస్పురణకై గావించు యాగమ్ములేమియు సాగారాదు
అమరుల వేడుకై ఆచరించేది యజ్ఞ గుండంబులందగ్ని మండరాదు
హర నామమేగాని హరి నామ గేయమ్ము త్రిజగాలనెవ్వారు స్మరించరాదు
అమరలోక విజేత లంకాధినేత హహ... హహా..
అమరలోక విజేత లంకాధినేత రావణుని శాసనములు నిరాకరించు
విష్ణు దాసుల బట్టి కేల్ విరచికట్టి చెరనుబెట్టుడు దానవశ్రేష్టులారా.

(రావణుడు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకునే ముందు)
పరమశైవాచారపరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు
తల్లికోరిక తీర్పతలచినేరక ఆత్మలింగమ్ము చేతనోసంగినావు
మును కుభేరుని కోరికై లంకాపురి విభవమ్ము మరల ఇప్పించినావు
తలచుటేతడవుగ దర్శనభాగ్యమ్ము కరుణించి నీదరి కాచినావు
స్వామీ భవదీయ దర్శనోత్సాహినగుచు తరియ ఈవేళా ఈ విశేషంబులేలా
వైరమేలయ్య మరచి నా నేరములను కరుణగలవయ్య కైలాసగిరినివాసా కైలాసగిరినివాసా


(రావణుడు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని)
హే! పార్వతీనాధ కైలాస శైలాగ్రవాసా శశాంకాగ్రమౌళి ఉమాదేవతోల్లాసి సవ్యాంగభాగా
స్మితానందదాయిత్రి శ్రితాపాందా భస్మీకృతానంద గంగాధరా సర్వసంతాపహరా హరా

Posted

నర్తనశాల
(అర్జునుడు ఊర్వశికి ద్రౌపది పాండవుల బంధం వివరిస్తూ)
ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన
పడతికి ఈశ్వరు డొసగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా

(బృహన్నల ద్రౌపది కి ధర్మరాజు గొప్పతనాన్ని వివిరిస్తూ)
ఎవ్వని వాకిట ఇహపర పంఖంబు రాజభూషణ రజోరాజినడగు
ఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు ఒజ్జయై వినయంబు నొరపుగరపు
ఎవ్వాని కడకంట నిర్వచుల్లెడిచూవె మానిటసంపదలీనుచుండు
ఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు
అతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరివీర కోటీర
మనిగ్రుని వేష్టితాంగితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు

(అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనలోని వీరులను చూపిస్తూ )
అదిగో
కాంచనమయవేదికా కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనమువాడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
లలిత కంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు రాధాత్మజుండు
మణిమయోరథ రుతిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి
మహొగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు ఎర్పడజూచికొనుము.

(అర్జునుడు సుయోధనుడితో యుద్ధం చేసేముందు)

ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల జాలగలరే
మణిమయంబైన భూషణజాలములనొప్పి యెడ్దోల గంబున నుండగలరే
కర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార భోగింపగలరే
అతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు సలుపగలరే
కయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి ఈ తనువు విడచి
సుగతివడయుము తొల్లింట చూరగలరే, జూదమిచ్చటనాడంగరాదు సుమ్ము

Posted

భూకైలాస్


(నారదుడు రావణ బ్రహ్మ తో తనను చంపవచ్చినప్పుడు)
సైకత లింగమ్ము జలధిపాడౌనాడు తల్లికిచిన మాట తప్పినావు
కరుణించవచ్చిన కైలాసనాధుని అడుగరాని వరములడగినావు
అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పలుకుల మది గెలచినావు
పాపములు పండి నరకగర్బమ్ములో కూరుచున్న నీపై జాలిబూని
కావగావచ్చిన నాదు ఉపకారమునకు నీవొసంగు ఉపాయనంబిదియే కూరా

Posted

శ్రీకృష్ణ విజయము

పద్యాలు
(నారదుడు కృష్ణుని అష్ట భార్యలతో చూచి)
రత్నములవంటి అష్ట భార్యలకు తోడు శోయగముగల్గు ఇంకొక్క సుదతి యున్న
ఆహా ! నవరత్న హారమే అమరు నీకు కాంచి తరించు భాగ్యమ్ము కలుగు నాకు

(కృష్ణుడు పౌండ్రకుడి తో ఆయుధవిసర్జనకు వచ్చినపుడు)
పనివడి నీవు కోరినటు హహ..హహ హ పనివడి నీవు కోరినటు
భట్టులలో పెను భట్టులైన నీ జనముల బ్రోల ఆయుధ విసర్జన
చేయగనెంచి వచ్చితిన్
అనువుగా దేనినిన్ విడువమందువో ముందుగ నీవే దెల్పుము
ఘనతర చక్రరాజమున, ఖడ్గమున, గదనా, ధనస్సునా దేనినిన్ విడువ మందువో నీవే దెల్పుమా

Posted

లవకుశ

(వాల్మీకి సీతను తన ఆశ్రమములో ఉండమని చెబుతూ )
ఇదెమన ఆశ్రమంబు ఇచ్చటనీవు వశింపుము లోకపావని
సదమలవృత్తి నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్
ముదముగా రామనామము ముదముగా రామనామము
తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములు సోకి మా యునికి
పావనమై చెలువొందు నమ్మరో

(వశిష్టుడు శ్రీరామచంద్రుని పట్టాభిషేకం సమయంలో)
నవరత్నోజ్వల కాంతివంతమిది ధన్యంబైన సూర్యాన్మయోద్భవ రాజన్యులుమున్ను దాల్చి గరిమన్ పాలించిరీభూమి కౌస్తవనీయంబగు ఈ కిరీటము శిరోదార్యంబు నీకీయెడన్ భువి పాలించు ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా

(లవకుశులు శ్రీరామున్ని మొదటి సారి చూసి )
శ్రీరాఘవం ధశరాదాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచరవినాశకరం నమామీ

Posted

పాండురంగ మహత్యం

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్తలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంస కలయం కంటేశ ముక్తావళి
గోపత్నీ పరివేస్తితోం విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి

Posted

దాన వీర శూర కర్ణ పద్యాలు


(కృష్ణుడు భీముడితో రాయభారానికి వెళ్లేముందు )
నిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో! కాక తొల్లింటి భీమసేనుడవే కావో,
అవ్వ! ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే, నిదురవో చుంటివో !
కురుపతి పెందొడల్ విరుగగొట్టెద, రొమ్ము పగల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలి
దుర్మద దుష్టుని దుస్ససేనును భీకర గధచేత యని ప్రగల్భము లాడితివి అల్ల కొల్వులో
మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్టభోజనా
నిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో ! కాక నీవు తొల్లింటి భీమసేనుడవే కావో !

(అర్జునుడు కృష్ణునితో రాయభారానికి వెళ్లేముందు )
పాలడుగంగ కౌరవ పాలికింబోవ పాలు తెరంగెరింగింపుము
భీమ భూపాలుని పాలు తాను, తన పాలిటి రాజ్యము అన్నపాలు
భూపాల కుమారవర్గమది ఒక పాలది మా అభిమన్యుపాలు
నా పాలు సమస్త సైన్యమని తెల్పుము పంకజనాభ అచటన్

(కృష్ణుడు పాండవులతో రాయభారానికి వెళ్లేముందు )
ఐనను పోయిలావలయు హస్తినకు, అచట సంధి మాట ఎట్లైనను
శత్రురాజుల బలాబల సంపద చూడగవచ్చు , మీ విధానము, తత్సమాధానమును
తాతయు, ఒజ్జయు విందు రెల్లరున్. ఐనను పోయిలావలయు హస్తినకు.

(కృష్ణుడు కురు సభలో రాయభారానికి వచ్చి )

తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్ట పడవరేని ఐదూళ్లిమనిరి ఐదుగురకు
ధర్మంబుగా నీతోచినట్లనుపుము వారిన్

తనయుల వినిచెదవో లేక ఈ తనయులతో యేమియని స్వతంత్రించెదవో
చనుమొక దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాధా

(ఒకవేళ మీకీ సంధి ఆమోదయోగ్యం కానియెడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు కూడా తెలియజెప్పెదను వినుము)
చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్, తొల్లి గతించె, నేడు నను దూతగా బంపిరి సంధిసేయ, మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింప పొందుచేసెదో యెల్లి రణంబె కూర్చెదవో ఏర్పడజెప్పుము కౌరవేశ్వరా.

(అటుల సంధికొడంబడని యేని )
అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడు
సాగారములన్నియు ఏకము గాకపోవు హ! ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకుల గావుమెల్లరున్

జెండాపై కపిరాజు ముందు శ్రితవాజిశ్రేణియున్ పూన్చి నే దండంబుంగొని తోలు శ్యందనముమీదన్ నారిసారించుచును గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మీ మూకన్ చ్చెండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము ఒక్కండును ఒక్కండును నీమొర ఆలకింపడు కురుక్ష్మానాధ సంధింపగన్

సంతోషమ్మున సంధి సేయుదురే ! వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ కాంతన్ జూచి చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ ద్రావునాడైన సంతోషమ్మున సంధి సేయుదురే ! నిశ్చిన్తన్ తద్గధయున్ ద్వదూరుయుగమున్ చ్చేధించు నాడేనియున్, హహహ.. సంతోషమ్మున సంధి సేయుదురే !

(కృష్ణుని రాయభారానికి సుయోధనుని ప్రత్యుత్తరం )
(ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్లిమ్మని ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !)
సమరము సేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము పెరవారిచే
కటకటంబడ చూచుచు ఊరకుందురే ! మమతయు , గొంకు, మానమవమానమును
సిగ్గును లేనివారి నెయ్యం తగునయ్యా , అవ్వ ! భూమిపతులందరూ నవ్వర టయ్యా సంధిచేసినన్.
(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన అర్జునిడిని చూసి )

అర్జున నీవా ...)
ఎక్కడనుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులేకదా ? యశోభాక్కులు నీదు అన్నలును ,
భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే ? భుజశాలి వృకోడరుడగ్రజాజ్ఞకు దక్కగనిల్చి శాంతిగతి తాను చరింతునే తెల్పుమర్జునా .

(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన సుయోధనుడిని చూసి )
బావా ఎప్పుడు వచితివీవు ? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ ? నీ వాల్లభ్యము పట్టు కర్ణుడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్

(దుర్యోధనుడు కృష్ణుడి తో )
కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే మాకును అవ్వారికిని ఎక్కుడగు
బంధుసముద్రుడ వీవుగాన సాయముగోరగా యేగుదెంచితిని గోపకులైకశిరోవిభూషణ
కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే .

(కృష్ణుడు సుయోధనుడితో )
ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జుని నేను జూచితిని
బందుగులన్న అంశమది పాయకనిల్చె , సహాయమిర్వురున్ చెందుట పాడి
మీకునైజేసెద సైన్య విభాగంబు అందు మీకున్ మీకున్ తగు దాని గైకొనుడు
బావా, కోరుట బాలుని కొప్పు ముందుగన్

ఆయుధమున్ ధరింప అని ఖగ్గముగా ఒకపట్ల ఊరకే సాయముచేయువాడ
పెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్ దోయిలియొగ్గుదున్ నిజము దొల్త వచించితి కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ యీతనిపాలగు పాండునందనా.

(అర్జునుడు కృష్ణుడి తో)
నందకుమార యుద్ధమున నా రధమందు వసింపుమయ్య
మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి నా స్యందనమొప్పుదుగాక
రిపు సంతతి తేజము తప్పుదుగాక నీ వెందును ఆయుధమ్ము దరికేగమికొప్పుదుగాక కేశవా

(కృష్ణుడు కర్ణుడిని పాండవుల పక్షం చేరమని ప్రలోభపెట్టే సన్నివేశంలో )
అంచితులయిన బంధుగుల అందరిముందు చెప్పి నిన్ను మెచ్చించెద
కుంతిచేత రవిచేత ఇది నిజంబు నిజంబని నీకు సాక్ష్యమిప్పించెద
ఫల్గుణ ప్రముఖ వీరులు గొల్వగా ఎల్లభూమి యేలించెద అచ్చకీర్తివిమలీకృత సర్వదిగంతంబునన్

(బావా ! నీవిక సూతపుత్రుడివిగా సుయోధన దయాలబ్ధమైన అంగ రాజ్యధినేతవుగా
మనవలసిన అవసరములేదు. పవిత్ర చంద్రవంశోద్భవుడవై చతుసముద్రముద్రిక ధరావలయాన్ని పరిపాలించావలిసిన సమయం ఆసన్నమైనది )

యే సతి వహ్నిలోన జనియించెనో జన్న మొనర్చు వేళ
మున్నేసతి పెండ్లినాడు నృపులెల్ల పరాజితులైరి కిరీటిచే
యే సతి మీది మొహమున ఇంతలు జేసిరి రాజు నీవు
నిన్నాసతి పెండ్లియాడగలదు ఆరవ భర్తగా సూర్యనందన

(కర్ణుడు కృష్ణుడితో )
(శ్రీకృష్ణ పరమాత్ముడవైన నీకీ చేతలు సాద్యం కావచ్చు కాని మానవమాత్రుడనైన
నాకు అవుననే సాహసం లేదు )
సూతుని చేతికిన్ దొరికి ఆసూతకళత్రము పాలుద్రావి
సూతుని అన్నమున్గుడిచి సూత కులాంగన యందు నందనంవ్రాతము గాంచి
నేటికొక రాజకుమారుడనంచు దెల్ప నా చేతము సమ్మతించునే ఇస్సీ ఎవ్వరేగతి సిన్గ్గుమాలినన్

(అతి పవిత్రమైన నడవడిక తో మానవోచిత ధర్మకర్మబద్ధుడనై ఇంతవరకు మనుగడ సాగించాను ఈ వయస్సులో సామాన్య మానవ ప్రలోభాలకు లోనై ధర్మ ద్వంసం చేయలేను. పతివ్రతను మాతృ సమానురాలైన మానవతిని నా మరదలిని, కృష్ణా ! ఆలిగా అంగీకరించలేను )
కామము చేతను గాని భయ కంపిత చిత్తము చేతగాని
ఈ భూమి సమస్తము నేలుకొను పూనిక చేతనెగాని
నేను నా సేమమెగోరి చుట్టముల, స్నేహితులన్ విడనాడి
మత్స్వామి సుయోధనున్ విడచి వత్తునే హహః వచ్చిన మెత్తురే జనుల్

Posted

[img]https://lh4.googleusercontent.com/_6pVnXMI24GU/TXpe6-Me7SI/AAAAAAAACAQ/C3gWm05RE4Y/s640/Untitled.jpg[/img]

Posted

శ్రీకృష్ణావతారం
(శ్రీకృష్ణ స్తోత్రం )
శృంగారరస సర్వస్వం సిఖిపింఛ విభూషణం
అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం
ఆశ్రయే భువనాశ్రయం

(శ్రీకృష్ణుడు అర్జునిడి తో)
ఊరక చూచుచుండమనుట ఒప్పుదుగాని భవత్గ్రహస్తు నన్
బారగాజూచి నీరిపులు ఫక్కున నవ్వి అనాదరింతురు
ఆశూరకులంబు మెచ్చ రిపుసూధన తాబరమూను నీకు నే సారధినై
విజయసారధి నామంబునన్ చరించెదన్.. విజయసారధి నామంబునన్ చరించెదన్


(శ్రీకృష్ణుడు ఆశ్వత్హామ తో కర్ణుడి గురించి )
సేవా ధర్మము సూత ధర్మము రాశీభూతమైవొప్ప
వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేల
రాజేవేళన్ మిముగోరునో అనికి నాడే పొండు పోరాడ
లేదా.. వర్జింపుడు కర్ణు చావువరకో ఆధ్యంతమో యుద్ధమున్
వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు

(భగవత్గీత తెలుగు లో క్లుప్తంగా )
తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణిలో గలియు
తనువనిత్యము నిత్యమ్ము ఆత్మ ఒకటే.
చినికి జీర్ణములైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికొన్నట్టి రీతి
కర్మానుగతి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించు నాత్మ
ఆత్మకు ఆదియు అంతమ్ము లేదు అది గాలికెండదు, అంబుతో తెగదు,
నీట నానదు అగ్ని నీరైపోదు

కరుణా విషాదాలు కలిగించునట్టి అహమ్మును మమకారమావలనెట్టి
మోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమా

ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చుననుమాట పొరపాటు, ఆ భ్రాంతి విడువుము
పురుషుల ఉత్తమపురుషుండ నేనే కనులకు దోచు జగమ్ము నేనే జగదాత్మను నేనే
జగము సృజియించి పోషించి లయమును గావింతు నేనే

స్వార్ధమ్మునకు ధర్మమాహుతిజేసి మదమత్సులై పేరు మానవకోటి నాసంము జేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞమ్ము నెవ్వరు ఆపలేరు మృత్యు ముఖమ్ములో మెదగుచున్న రాజలోకమును రక్షింపలేరు
నాచేత హతులైన నరనాయకులను వందింప నిమిత్త మాత్రుండ వీవు భీష్మాది కౌరవ వీరలోకంబు నా గర్భమున మహానలకీనలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయా

Posted

నర్తనశాల
(అర్జునుడి ఊర్వశికి ద్రౌపది పాండవుల బంధాన్ని వివిరిస్తూ)
ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన
పడతికి ఈశ్వరు డొసగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా

(బృహన్నాల ద్రౌపది కి ధర్మరాజు గొప్పతనాన్ని వివరిస్తూ )
ఎవ్వని వాకిట ఇహపర పంఖంబు రాజభూషణ రజోరాజినడగు
ఎవ్వాని చారిత్రమెల్ల లోకములకు ఒజ్జయై వినయంబు నొరపుగరపు
ఎవ్వాని కడకంట నిర్వచుల్లెడిచూవె మానిటసంపదలీనుచుండు
ఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు
అతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరివీర కోటీర
మనిగ్రుని వేష్టితాంగితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు

(అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనలోని వీరులను చూపిస్తూ )
అదిగో
కాంచనమయవేదికా కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనమువాడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
లలిత కంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు రాధాత్మజుండు
మణిమయోరథ రుతిజాలమహితమైన పడగవాడు కురుక్షితిపతి
మహొగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు ఎర్పడజూచికొనుము

(అర్జునుడు సుయోధనుడితో యుద్ధం చేసేముందు)

ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా పురవీధుల జాలగలరే
మణిమయంబైన భూషణజాలములనొప్పి యెడ్దోల గంబున నుండగలరే
కర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార భోగింపగలరే
అతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు సలుపగలరే
కయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి ఈ తనువు విడచి
సుగతివడయుము తొల్లింట చూరగలరే, జూదమిచ్చటనాడంగరాదు సుమ్ము

Posted

[img]http://i51.tinypic.com/vngeox.png[/img]

Posted

eeyy eeyy ..... BROTHERRRRR [img]http://lh4.ggpht.com/_KVkPY2XIbRQ/TVx7TncJgtI/AAAAAAAAA-U/miLGdmKawcM/Sr.NTR-1.gif[/img]

×
×
  • Create New...