psycopk Posted March 4, 2009 Report Posted March 4, 2009 హైదరాబాద్: చిరంజీవి హిపోక్రసీపై విమర్శలు చెలరేగుతున్నాయి. తన జీవితం తెల్ల కాగితమని ఆయన అనేక సందర్భాల్లో చెప్పారు. తన ఆదాయపు పన్ను వివరాలు క్లియర్ గా ఉన్నాయని ఆయన కొన్ని నెలల క్రితం విశాఖపట్నంలో చెప్పారు. కానీ ఒకరు సమాచార హక్కు చట్టం కింద ఆయన ఆదాయ వివరాలు అడగ్గా సాంకేతిక కారణాల వల్ల ఆ దరఖాస్తుని చిరంజీవికి పంపారు. చిరంజీవి తన ఆదాయ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ఈ విషయంలో చిరంజీవిని నిలదీయడంలో మీడియా ప్రతినిధులు విఫలమవుతున్నారు. సినిమాకు పది కోట్లు తీసుకునే చిరంజీవి ఆ డబ్బును వద్దనుకుని రాజకీయాల్లోకి వచ్చారని అల్లు అరవింద్ చెప్పారు. మరో వైపు చిరంజీవి తాను నిర్మాతల నుంచి పెద్దగా పారితోషికం తీసుకోకుండా నటించానని చెప్పుకున్నారు. ఒక "రాజకీయ సినిమా"లో ఇన్ని వైరుధ్యాలు ఉంటే ఆ సినిమా ఎలా హిట్ అవుతుంది? మొదట్లో పాజిటివ్ ప్రసంగాలు చేసిన చిరంజీవి ఇప్పుడు వైఎస్, చంద్రబాబు అవినీతి మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈరోజు కర్నూలులో విలేకరుల సమావేశంలో ప్రసంగించిన చిరంజీవి కొన్ని ప్రశ్నలకు నేరుగా సమాధానమివ్వలేకపోయారు. ఆయన ఇబ్బందిని గ్రహించిన ప్రజారాజ్యం నాయకురాలు ోభా నాగిరెడ్డి రోడ్ షో లకు సమయం ఆసన్నమైందంటూ చిరంజీవిని తొందరపెట్టి మీడియా సమావేశాన్ని ముగించారు. చిరంజీవి ఆదాయపు పన్ను వివరాల మీద ప్రశ్నలు ఎక్కడ పడతాయోనని శోభా నాగిరెడ్డి మీడియా సమావేశాన్ని ముగించినట్టు కనిపిస్తోంది.
Recommended Posts