Jump to content

Recommended Posts

Posted

దేశంలోని దట్టమైన అడవులు, కొండప్రాంతాల్లో ఉంటున్న నక్సలైట్ల స్థావరాలను కనుగొని, వారి కార్యకలాపాలను తెలుసుకుని వారిపై దాడులు చేసేందుకు కొత్తగా మానవరహిత విమానాల(యూఏవీ)ను ఉపయోగించేందుకు కేంద్ర హోంశాఖ సిద్ధమౌతోంది.

కెమెరాలు, టాటా, వీడియో లింకులతో కూడుకున్న ఈ విమానం దట్టమైన అడవులలో ఎక్కడ ఏయో నమూనాలున్నాయనే వాటిని చిత్రీకరించి, రికార్డ్ చేసే సౌకర్యం ఇందులో ఉంటుంది. దీంతో ప్రత్యేకంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోనున్న నక్సల్స్‌పై దాడులు చేసేందుకు ఉపకరిస్తాయి.

హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ద్వారా రూపొందించిన యూఏవీలను ఇటీవల హిసార్, ఢిల్లీ ప్రాంతాల్లో ప్రయోగించారు. అదే విధంగా ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ అడవుల్లో వీటిప్రయోగాలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు

Posted

vaaahhh... shabhaashh.. title kudaa telugu loo chaala rear gaa chusaa nenu...  you rock you rock you rock

×
×
  • Create New...