Jump to content

Recommended Posts

Posted

విజయవాడ, మేజర్‌న్యూస్‌ : మహిళా రాజ్యం పార్టీని జిల్లాలో నడిపించాల్సిన జిల్లా కన్వీనర్‌ వ్యవహార శైలిపై మహిళా రాజ్యం జిల్లా కమిటీ సభ్యులు, కార్యకర్తలు అసంతృప్తితో వున్నారు. జిల్లాలోని కార్యకర్తలను అందర్ని కలుపుకోని పోవటం లేదని, ప్రతి పనికి కార్యకర్తల వద్ద నుంచి నగదు వసూలు చేస్తున్నారని, ఇప్పటి వరకు జిల్లాలో నియోజకవర్గ ఇన్‌ఛార్జీలను మాత్రమే ప్రకటించారని, మండల, గ్రామ కమిటీలను ప్రకటించడంలో తాత్సరం చేస్తున్నారని మహిళా కార్యకర్తలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ప్రజారాజ్యం పార్టీ జిల్లాలోని మహిళలను జాగృతం చేయాలనే ఉద్దేశంతో సుమారు 45 రోజుల క్రితం జిల్లా మహిళా రాజ్యం కమిటీని ప్రకటించింది. నాటి నుంచి జిల్లాలో మహిళా రాజ్యం పరిస్థితి ఒక అడుగు ముందుకు.. రెండడుగుల వెనక్కి అనే స్థితిలో వుంది. సామాజిక న్యాయం పేరుతో ముందుకు వచ్చిన పిఆర్‌పి సమాజంలోని అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పించాలనే ఉద్దేశంతో మహిళా రాజ్యం జిల్లా కన్వీనర్‌గా ఎస్‌సి వర్గానికి చెందిన మట్టా ఝాన్సీని నియమించింది. ఈ మహిళా రాజ్యంలో చిరంజీవిగారి మీద అభిమానంతో పలు పార్టీలకు చెందిన మహిళలు కూడా వచ్చి చేరారు. వారు ఈ రోజు ఎందుకు చేరామా అని తలపట్టుకొని కూర్చున్నారు.

ఈ రోజు వరకు తాము పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ముగ్గులు పోటీ కానీ, గడప గడపకు ప్రజారాజ్యం కానీ, ఇతర కార్యక్రమాలకు తమ సొంత డబ్బులు సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఖర్చుపెట్టి కార్యక్రమాలు నిర్వహించామని, కానీ మమ్మల్ని ఎవరూ పట్టించుకోవడం లేదని పలువురు మహిళా రాజ్యం కార్యకర్తలు, జిల్లా నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భర్తలు వేరే పార్టీలో ఓ స్థాయిలో వున్నా, వారు వద్దంటున్నాసరే తాము మహిళా రాజ్యంలో చేరామని, తీరా ఇక్కడ చేరిన తరువాత మాపై పెత్తనం చేసే వారు ఎక్కువయ్యారని, తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వటం లేదని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా తాము ఖర్చుపెట్టిన నగదును తమకు ఇచ్చేస్తే తాము మహిళారాజ్యం వీడి వెళ్ళిపోతామని పలువురు పేర్కొంటున్నారు. మహిళా రాజ్యం పని మీద హైదరాబాద్‌లోని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని కలిసేందుకు జిల్లా కన్వీనర్‌ ఆధ్వర్యంలో ఓ ప్రైవేటు బస్సును మాట్లాడుకొని వెళ్లారు. ఈ సందర్భంలో కన్వీనర్‌ బస్సులో వెళ్ళిన వారిలో ఒక్కొక్కరి వద్ద నుంచి ఐదు వందల రూపాయల వరకు వసూలు చేశారని, అయితే ఈ రోజు వరకు కూడా ఆ బస్సుకు సంబంధించిన నగదును ఆమె చెల్లించలేదని, ఆ ప్రైవేటు బస్సు వారు తమను అడుగుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఈ విషయాన్ని నగరంలోని పిఆర్‌పి రాష్ట్ర నాయకత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి వారి బాధను వ్యక్తం చేశారు. జిల్లా కమిటీ ఏర్పడిన తరువాత జిల్లాలో మహిళా రాజ్యం పార్టీని బలోపేతం చేస్తామని ప్రగల్బాలు పలికినా, ఈ రోజు వరకు అలాగే జిల్లాలో మండల, గ్రామ కమిటీలను కూడా ఏర్పాటు చేయలేని స్థితిలో వుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గాలుగా ఇన్‌చార్జీలుగా వేసిన వారు వారిష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు మహిళారాజ్యం విషయంలో నగరంలో సెంట్రల్‌ నియెజకవర్గ యాస్పరెంట్లు జోక్యం చేసుకుంటున్నారు. వారు తమ నియెజకవర్గంలో మీరు ఎందుకు తిరుగుతున్నారు, మీరు తిరిగితే ఊరుకునేది లేదని ఆ నియెజకవర్గానికి బాధ్యత అప్పగించిన మహిళా రాజ్యం కార్యకర్తలపై చిందులు వేశారు. దీంతో ఆ మహిళా కార్యకర్తలు ఆ నియోజకవర్గంలో పని చేయటమే మానేశారు.

జనవరి 26 సంఘటనతో నగరం, జిల్లాలో ప్రజారాజ్యం పార్టీ స్తబ్ధతగా వుండటంతో మహిళా రాజ్యం కూడా అదే పంథాలో కొనసాగింది. దీంతో మహిళా రాజ్యంలో అగాదాలు మరింత ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో పిఆర్‌పి జిల్లా కన్వీనర్‌గా కొత్తగా వచ్చిన ఆరేపల్లి నాగ రమేష్‌ విజయవాడ వచ్చినప్పుడు మహిళా రాజ్యం కన్వీనర్‌ మహిళా రాజ్యంలో వున్న లోటుపాట్లను సరిదిద్దాలని కోరారు. కానీ ఈ రోజు వరకు కూడా ఆయన పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో మహిళా రాజ్యంలో ఎవరి పని వారు చేసుకుపోతున్నారే తప్పితేదాని గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో జిల్లాలో మహిళా రాజ్యం పరిస్థితి ఒక అడుగు ముందుకు, రెండడుగుల వెనక్కి అన్న చందంగా తయారైంది.

  • 2 years later...
Posted

LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q LoL.1q

×
×
  • Create New...