Jump to content

..... snake killed 2 kids........


Recommended Posts

Posted

[size=12pt]వీపనగండ్ల, న్యూస్‌లైన్: తల్లిదండ్రుల కంటి వెలుగుల్ని ఓ కాలసర్పం ఆర్పేసింది. తమకున్న ఇద్దరు పిల్లల్నీ కళ్లెదుటే కోల్పోయిన వా రి శోకం తీరనిది. ఈ విషాదకర సంఘటన వీపనగండ్ల మండలం సంగినేనిపల్లిలో బుధవారం తెల్లవారుజామున జరిగింది. మృ తి చెందిన చిన్నారుల తల్లిదండ్రుల కథనం మేరకు వివరాలు.. సం గి నేనిపల్లికి చెందిన రాముడు, చెన్నమ్మ దంపతులకు కవిత (06), శి వ (04)లు సంతానం. తల్లిదండ్రులతోపాటే ఇంట్లో నిద్రిస్తున్న ఆ చిన్నారుల్ని ఓ పాము కాటేసింది. దీంతో నిద్ర లేచిన కూతురు కవి త రోదిస్తూ తనకు గొంతు పట్టేసిందని, కడుపులో ఇబ్బందిగా ఉం దని, ఏదో కరిచి వెళ్లిందని తల్లిదండ్రులకు చెప్పింది.

దీంతో వారు ఆ బాలిక కాళ్లను చూడగా పాము కాటేసిన ఆనవాళ్లు కనిపిం చాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే శివ కూడా తన అక్క మాదిరే ప్రవర్తించగా వారిద్దరినీ వెంటనే స్థానికంగా ఉన్న ఓ నాటువైద్యుని వద్దకు తీసుకెళ్లారు. అక్కడికి చేరుకోగానే చి న్నారి శివ మరణించాడు. కవిత పరిస్థితి విషమించడంతో ఆమెను వెంటనే వనపర్తి ఏరి యా ఆస్పత్రిలో చేర్పించాల్సిందిగా ఆ నాటు వైద్యుడు వారికి సూచించాడు. దాంతో వారు ఆ ఆస్పత్రి లో చేర్పించిన కొద్దిసేపటికే కవిత మృతి చెందింది. బుధవారం మధ్యాహ్నం ఆ చిన్నారుల మృతదేహాలను స్వగ్రామానికి తీ సుకువచ్చారు.

దాంతో వారి బంధువుల రోధనలతో ఆ ప్రాంతంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఉన్న ఇద్దరు పిల్లల్నీ కోల్పోయాం.. ఇక బతికేదెట్లా అంటూ చిన్నారుల తల్లి రోదన.. స్థానికులను కలిచివేసింది. కాం గ్రెస్, టీడీపీకి చెందిన స్థానిక నాయకులు సుదర్శన్‌రెడ్డి, చిన్నారె డ్డి, సత్యనారాయణగౌడ్‌లు ఆ చిన్నారుల తల్లిదండ్రులను పరామర్శించారు.[/size]


sFun_duh sFun_duh sFun_duh sFun_duh

×
×
  • Create New...