Jump to content

New Disease for KCR


Recommended Posts

Posted

హైదరాబాద్ : తెలంగాణ కోసం ఆమరణ దీక్ష చేస్తున్న తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖరరావులో కొత్త రుగ్మత బయటపడింది. ఇప్పటి వరకూ లో బీబీ, మధుమేహం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్సన్ తో ఇబ్బందులు పడుతున్న కేసీఆర్ కు 'లివర్ సిరోసిస్' వ్యాధి ఉన్నట్లు నిమ్స్ వైద్యుల పరీక్షల్లో నిర్ధారణ అయింది. ఈ వ్యాధిని కొన్ని జాగ్రత్తలు పాటించడం ద్వారా అదుపులోనే ఉంచుకోవచ్చని నిమ్స్ వైద్యులు తెలిపారు. శాశ్వతంగా వ్యాధి నుంచి బయటపడాలంటే లివర్ మార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. ఆస్పత్రి డైరెక్టర్ ప్రసాదరావు ఆద్వర్యంలో 30 మంది వైద్యుల పర్యవేక్షణలో నిమ్స్ లో చికిత్స పొందుతున్న కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు గురువారం మధ్యాహ్నం ప్రకటించారు. దీర్ఘకాలంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల గాని, కొన్ని మందుల వాడకం వల్ల గాని, కొవ్వు వల్ల గానీ లివర్ సిరోసిస్ వ్యాధి సంక్రమించే అవకాశాలున్నాయని వైద్యులు స్పష్టం చేశారు.

ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి నుంచి బుధవారం అర్ధరాత్రి కేసీఆర్ ను హైదరాబాద్ నిమ్స్ కు తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. కేసీఆర్ లో లివర్ సిరోసిస్ వ్యాధిని గుర్తించిన వైద్యులు సంబంధిత చికిత్సను ప్రారంభించినట్లు ఆయనకు వైద్యసేవలు అందిస్తున్న 30 మంది వైద్యుల బృందం తెలిపింది. తెలంగాణ సాధన కోసం గత ఐదు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్, ఆయన బంధువులు, తెరాస నేతలు ఆయనను ఖమ్మం ఆస్పత్రి నుంచి హైదరాబాద్ లేదా వరంగల్ తరలించాలని చేసిన విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం నిమ్స్ కు తరలించింది.

Posted

eediki hospital bathike chance ledhu bayata ledhu.. gyarantee ga repo maapo.. 11vmglf.gif

Posted

idi media ki konchem kasatame............ monkeydanceds monkeydanceds monkeydanceds monkeydanceds

×
×
  • Create New...