Jump to content

Hostels were closed in Telangana


Recommended Posts

Posted

హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతంలోని అన్ని కళాశాలల హాస్టళ్ళనూ మూసివేయాలని ఆదేశిస్తూ రాష్ట్రప్రభుత్వం గురువారం సాయంత్రం జీఓ నెంబర్ 856 జారీచేసింది. ఈ జీఓ కారణంగా విద్యార్థులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకల్లా విద్యార్థులు హాస్టళ్ళు ఖాళీచేసి వెళ్ళాల్సి ఉంటుంది.

ఈ నేపథ్యంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలోని హాస్టళ్ళను గురువారం అర్ధరాత్రి నుంచి మూసివేస్తున్నట్లు వర్శిటీ వైస్ చాన్స్ లర్ తిరుపతిరావు ప్రకటించారు. ఉస్మానియా వర్శిటీ పరిధిలో నడుస్తున్న వసతిగృహాల్లోని విద్యార్థులు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలలోగా హాస్టళ్ళను ఖాళీచేసి వెళ్ళాలని ఆయన ఆదేశించారు. తెలంగాణ ప్రాంతంలోని విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సాయంత్రం 15 రోజుల పాటు సెలవులు ప్రకటించిన నేపథ్యంలో విద్యార్థులు హాస్టళ్ళను ఖాళీచేయాలని తెలిపారు. కాగా, హాస్టళ్ళను మూసివేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి సంఘాల సంయుక్త కార్యాచరణ సమితి (జెఎసి) హెచ్చరించింది.

మరో పక్కన జెఎన్ టియు వైస్ చాన్స్ లర్ ఒక ప్రకటన చేస్తూ తమ వర్శిటీ పరిధిలో నిర్వహిస్తున్న అన్ని పరీక్షలనూ వాయిదా వేసినట్లు తెలిపారు. ఆయా పరీక్షలను తదుపరి ఎప్పుడు నిర్వహించేదీ తాజాగా షెడ్యూల్ ప్రకటిస్తామన్నారు.

×
×
  • Create New...