Jump to content

Born for Telagana


Recommended Posts

Posted

హైదరాబాద్: తెలంగాణ  కోసం తాను అవిశ్రాంత పోరాటం చేస్తానని మెదక్ పార్లమెంటు సభ్యురాలు, సినీ నటి విజయశాంతి  హామీ ఇచ్చారు. తెలంగాణ కోసం పోరాటం చేయడానికి ముందుకు రావాలని తెలంగాణ విద్యార్థులు గురువారం విజయశాంతి ఇంటి ముందు ధర్నా చేశారు. విద్యార్థుల వద్దకు వచ్చిన ఆమె వారితో కలిసి జై తెలంగాణ నినాదాలు చేశారు. తాను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేస్తానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బిల్లు ప్రతిపాదించడానికి కృషి చేయాలని విద్యార్థులు ఆమెను కోరారు. తాను తెలంగాణ కోసమే పుట్టానని, తెలంగాణ కోసం పోరాటం చేస్తానని ఆమె చెప్పారు. విద్యార్థుల విషయంలో పోలీసులు జోక్యం తగదని ఆమె చెప్పారు.

×
×
  • Create New...