Jump to content

Jagan Double damaka against Rosayya?


Recommended Posts

Posted

హైదరాబాద్: రాష్ట్రంలో కెసిఆర్ నిరాహార దీక్ష వల్ల నెలకొన్న అశాంతిని వైఎస్ జగన్ తనకు అనుకూలంగా ఉపయోగించుకోబోతున్నారా? కొన్ని ఉదంతాలు అవుననే చెబుతున్నాయి. కెసీఅర్ ఉద్యమం తీవ్రతరమై, రోశయ్య శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమయ్యారని అధిష్టానవర్గం అనుకునేలా చూడాలని జగన్ శ్రేయోభిలాషులు ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. రోశయ్యను గద్దె దింపడానికి ఇంతకంటే మంచి అవకాశం దొరకదని జగన్ శిబిరం ఒక నిర్ధారణకు వచ్చినట్టు చెబుతున్నారు.

గతంలో చెన్నారెడ్డిని ముఖ్యమంత్రి పీఠం నుంచి తప్పించడానికి రాయలసీమకు ముఖ్యంగా పులివెందులకు చెందిన ముఠాలు పాత బస్తీలో గొడవలు సృష్టించిన విషయం చాలా మందికి తెలుసు. ఇప్పుడు అలా కాకుండా, ముఖ్యమంత్రికి ఏ మాత్రం సహకరించకుండా ఉండడం జగన్ వ్యూహంలా కన్పిస్తోంది. వ్యూహానికి వ్యాల్యూ ఎడిషన్ ఏమిటంటే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమంలోకి జగన్ సేనను ప్రవేశపెట్టడం.

గుంటూరులో జరిగిన ఒక సంఘటనే ఈ వాదనకు ఆధారం. జిల్లాలో జగన్‌ యువసేనగా పేరొందిన నాయకులు 'జై ఆంధ్రా' అంటూ ఉద్యమాన్ని చేపట్టడం కాంగ్రెస్‌ పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నిన్నటి వరకు జగన్‌ యువ సేన రాష్ట్ర అధ్యక్షుడిగా తనకు తానుగా ప్రకటించుకొని జిల్లాలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తెరపైకి వచ్చిన సత్యారెడ్డి ఆదివారం కొత్త అవతారం ఎత్తారు. ప్రత్యేక ఆం«ధ కావాలనే నినాదంతో 'ఆంధ్ర రాష్ట్ర సాధనా సమితి' పేరుతో ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. గుంటూరు రాజీవ్‌గాంధీ భవన్‌లో జరిగిన అంబేద్కర్‌ వర్ధంతిలో పాల్గొని వస్తున్న తూర్పు ఎమ్మెల్యే షేక్‌ మస్తాన్‌ వలిని సత్యారెడ్డి, ఆయన అనుచరులు ఘెరావ్‌ చేశారు.

Posted

jagan ga tatagurinchi neeku sariga telitala tatha mafia king ninnu lepichestadu jagrathai11279_brahmi02.gif

×
×
  • Create New...