satish12 Posted December 8, 2009 Report Posted December 8, 2009 అదుర్స్’ సినిమా ఆడియోలో బాబాయ్ బాలకృష్ణ పెంచిన మీసాలతో అందరి దృష్టినీ ఆకర్షించాడు. ముఖ్యంగా దర్శకధీరుడు రాజమౌళికి బాలయ్య మీసాలు తెగ నచ్చేశాయి.బాలకృష్ణ మీసాలు పెంచితే...అబ్బాయ్ ఎన్టీఆర్ ట్రిమ్ చేసిన మీసాలతో కనబడ్డాడు. ఇంతకీ ఈ మీసాల కథలోకి వెళితే ..‘సింహా’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో బాలకృష్ణ పెంచిన మీసాలతో డిఫరెంట్ గా కనిపించనున్నాడు. ఈ ఎపిసోడ్ లోనే నయనతార పాత్ర వస్తుందని సమాచారం! ఇక అబ్బాయ్ విషయానికొస్తే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘బృందావనం’ చిత్రంలో నటిస్తున్నాడు. అందులోని గెటఫ్ ఇది. మీసాలను లైట్ గా ట్రిమ్ చేయించాడు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం పొలచ్చిలో నడుస్తోంది. ఎన్టీఆర్, కాజల్ పై ఓ పాటను తెరకెక్కిస్తారు. 10 రోజులపాటు ఈ పాటను షూట్ చేస్తారు. మున్నా చిత్ర వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
Recommended Posts