Jump to content

Chiru Avedana


Recommended Posts

Posted

హైదరాబాద్ : రాజకీయ నాయకుడు ఎలా ఉండాలో తాను వైఎస్ రాజశేఖరరెడ్డిని చూసిన తరువాతే తెలుసుకున్నానని, ఆయనే తనకు ఆదర్శ నేతని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. మొదటిసారిగా అసెంబ్లీకి వచ్చిన తాను సభలో ఎలా మాట్లాడాలి, ప్రత్యర్ధులను సైతం ఎలా ఆకట్టుకోవాలి అన్న విషయాలను వైఎస్ ను చూసే నేర్చుకున్నానని, తాను ఎప్పుడూ ఆయననే గమనిస్తూ ఉండేవాడినని, చెరగని చిరునవ్వుతో, చక్కని పంచెకట్టుతో ఉండే వైఎస్ తనను ఎంతగానో ఆకర్షించారని చిరంజీవి ఆవేదనతో అన్నారు. అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున ముఖ్యమంత్రి రోశయ్య ప్రవేశపెట్టిన వైఎస్ సంతాప తీర్మానంపై చిరంజీవి మాట్లాడారు. ఇప్పుడు సభలో ఎవరిని గమనించాలో తనకు తెలియడం లేదని అన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం వైఎస్ కే చెల్లిందని, తాను సినిమా నటుడిగా ఉన్నప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్ళిన ప్రతీ సమస్యను వెనువెంటనే పరిష్కరించారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ జ్ఞాపకాలు ఎవరినీ వీడటం లేదని, అందరిలో వైఎస్ స్ఫూర్తి ఉందని చిరంజీవి అన్నారు. అసలు ఆయన మన మధ్య లేరన్న భావనే బాధ కలిగిస్తోందని చెప్పారు.

Posted

eedi paadi veedu cinema valla samasyalani theesukupoyadanta

Posted

eedi paadi veedu cinema valla samasyalani theesukupoyadanta

i15848_bramhidance.gif

×
×
  • Create New...