Jump to content

Recommended Posts

Posted

అనుకున్న పని అవ్వాలంటే.. అది అవుతుందో లేదో.. వస్తుందో.. రాదో.. ఇలాంటి ధర్మసందేహాలున్నప్పుడు, అయితే అటు లేదంటే ఇటు అనే వాడుతాం. తాజాగా దర్శకుడు తేజ కూడా అదే బాటలో వస్తున్నాడు. సురేష్ బాబుతో కలిసి సంయుక్తంగా ఎక్కువ శాతం కొత్తవారితో చిత్రాన్ని నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.

"కేక" చిత్రం తర్వాత తను దర్శకత్వం చేయనని చెప్పాడు. దానికే కట్టుబడి ఉన్నానంటూ.. తనకంటే బాగా తీసేవారుంటే మధ్యలోనే మరో దర్శకుడు మారతాడని కూడా స్పష్టం చేస్తున్నాడు. ప్రస్తుతం తను రూపొందిస్తున్న చిత్రం పేరు "అటు ఇటు". ఈ కథాంశం కూడా కాంట్రవర్సీగా ఉంటుందని తెలిసింది.

గతంలో "చిత్రం" కథ కూడా అలానే అయింది. అందులో 16 ఏళ్లకే పిల్లలు పుట్టవచ్చు... కానీ సమాజపరంగా అలా పుట్టకూడదనీ, యువత ఆలోచనలు తప్పని ఆ చిత్రంలో చెప్పానని తేజ అంటున్నారు. కానీ "అటు ఇటు" చిత్రంలోని పాయింట్‌కూడా దగ్గరగా ఉంటుందనీ, నేటి సమాజంలో ఉండే పరిస్థితులను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుని రూపొందిస్తున్నామని చెపుతూ... ఇందులో కడుపులు రావడంలాంటివి ఉండవని చెబుతున్నాడు.

అంటే... నేటితరం విదేశీ పోకడలతో పబ్‌ల చుట్టూ తిరుగుతూ కడుపు తెచ్చుకోకుండా పలురకాల మార్గాలను అనుసరించే ప్రవర్తనల వంటివి చూపిస్తూ.. చివర్లో ఇది తప్పనే సందేశం ఇవ్వనున్నట్లు సమాచారం.

×
×
  • Create New...