Jump to content

**********Ananandam****************


Recommended Posts

Posted

~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"! ~"!

[b][color=red][size=14pt]రాహుల్ సమక్షంలో సభ్యత్వం తీసుకోవడం ఆనందం : చిరు [/size][/color][/b]

[b][color=black][size=12pt]న్యూఢిల్లీ, ఆగష్టు 19 : ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన చేతుల మీదుగా కాంగ్రెస్ సభ్యత్వం తీసుకోవడం ఆనందంగా ఉందని ప్రజారాజ్యం అధ్యక్షుడు చిరంజీవి పేర్కొన్నారు. ఇందు కోసం ఢిల్లీకి వచ్చిన ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ త్వరగా కోరుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆమె ఎక్కడున్నా ఆశీస్సులు తనకు ఉంటాయని అన్నారు.

మరోవైపు దివంగత రాజీవ్ గాంధీ జయంతి రోజున కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకోవడం సంతోషంగా ఉందని చిరంజీవి పేర్కొన్నారు. విలీనం ఉబయతారకంగా ఉంటుందని చెప్పారు. తన లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేస్తున్నానని అన్నారు. విలీనం జరగక ముందే పదవులు ఆశించడం సరికాదన్నారు. పదవులు అప్పుడే ఎలా ఆశిస్తామని చెప్పారు. సభ్యత్వం పూర్తయ్యాక తమ పార్టీ వారికి న్యాయం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
[/size][/color][/b]

×
×
  • Create New...