Jump to content

most awaited... releasing todayy yayy


Recommended Posts

Posted

రెండేళ్ళ క్రితం.. మే ఇరవై ఎనిమిదో తారీఖున, తెలుగు వాళ్ళంతా ఒకప్పుడు వెండితెరనేలిన నందమూరి తారకరాముడి జయంతి జరుపుకుంటూ ఉండగా 'అభినవ మాయాబజార్' గా బహుళ ప్రచారం జరుపుకున్న చలన చిత్రరాజమొకటి ఆంధ్ర రాష్ట్రం నలుమూలలా థియేటర్లలో విడుదలయ్యింది. మరీ రిలీజ్ షో కాదు కానీ, రిలీజ్ రోజున రెండో ఆట చూశాను, కష్టార్జితం ఓ వందరూపాయలు ఖర్చు పెట్టీ, ఆమాత్రం విలువైనా చేస్తుందో చెయ్యదో అని అప్పుడప్పుడూ వైరాగ్యంగా అనుకునే నా ప్రాణాన్ని పణంగా పెట్టీ.. ఆ సినిమాకి కథ, మాటలు, పాటలు, పద్యాలు, స్క్రీన్ ప్లే, బొమ్మలు, సంగీతం, నేపధ్య గానం, ఆభరణాల డిజైనింగ్, నిర్మాత, దర్శకుడు మరియు కథానాయకుడు శ్రీ సుమన్. సినిమా పేరు 'ఉషా పరిణయం.'

ఇదే సినిమా రేపు అనగా, శ్రావణ బహుళ అష్టమి ఆదివారం ('సఖులారా చేరరే.. శ్రావణ బహుళాష్టమి...' అని గోపికలు భక్తిగా పాడుకునే రోజు) సాయంత్రం ఐదుగంటలకి ఈటీవీలో ప్రసారం కాబోతోంది. పౌరాణికాలు, అందునా.. ఆద్యంతమూ హాస్యరసంతో నిండిన భక్తి, జ్ఞాన, వైరాగ్య చిత్రాలు బొత్తిగా నల్లపూసలై పోతున్న ఈ రోజుల్లో రాబోతున్న ఈ సినిమాలో వింతలూ విశేషాలని సుమనాభిమానులతో పంచుకోడానికే ఈ టపా. ఈ సినిమా మీకు ఈటీవీలో తప్ప ఎక్కడా రాదు కనకా, ఎప్పుడు పడితే అప్పుడు దొరకదు కనకా, పనులన్నీ పక్కన పెట్టి ముందుగానే టైం కేటాయించుకుని చూడాల్సిందే.

ముందుగా మీదగ్గర అలనాటి విజయావారి 'మాయాబజార్' జ్ఞాపకాలేవైనా ఉంటే వాటిని సమూలంగా తుడిచేసి, అప్పుడు ఈ సినిమా చూడడానికి సిద్ధం అవ్వండి. 'ఈతరం మాయాబజార్' గా అనేకమంది ప్రముఖుల ప్రశంశలు అందుకున్న ఈ సినిమా (నిజంగా నిజం.. ఈటీవీలోనే చెప్పారు దర్శకుడు యస్వీ - యశస్వి అని కూడా అభిమానులు అంటూ ఉంటారు - కృష్ణారెడ్డి తదితరులు) చూస్తున్నప్పుడు ఆ సినిమా గుర్తు రావడం అంత బాగోదు. అలాగే, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పిన "చేసెడి వాడనూ, చేయించెడి వాడనూ అంతా నేనే" అనే గీతాసారాన్ని వంటబట్టించుకోండి. ఎందుకంటే ఈ సినిమాలో కూడా చేసే వాడూ, చేయించే వాడూ ఒక్క శ్రీకృష్ణుడే. అనగా అవసరానికి మించి కుంచం ఎక్కువ నీలిరంగు పూసుకున్న శ్రీ సుమన్ బాబే.


ప్రారంభ సన్నివేశంలో బారెడు పొద్దెక్కినా బంగారు శేష పాన్పుమీద, పట్టు బట్టలు మరియు నిలువెల్లా ఆభరణాలతో నిద్ర నటించే శ్రీకృష్ణుడి అర్ధ నిమీలిత నేత్రాలతో మొదలు పెడితే చివర్లో బాణాసురుడితో యుద్ధం సన్నివేశంలో అదే కళ్ళతో కృత్యదవస్థ మీద కురిపించిన క్రోధం వరకూ ఆసాంతమూ ఎన్నెన్ని భావాలో. ఎన్టీఆర్ కిరీటం బరువు రికార్డుని బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకుని డిజైన్ చేసుకున్నారో ఏమో తెలియదు కానీ, శ్రీకృష్ణుడు ధరించే కిరీటం బరువుని ప్రేక్షకులు కూడా అంచనా వేసేయగలరు. ఆ కిరీటం జారిపోకుండా బ్యాలన్స్ చేసుకుంటూనే, సందర్భానుసారంగా అభినయించగలిగినన్ని కళలు అభినయించారు సుమన్ బాబు. ముఖ్యంగా నునుసిగ్గు, చిలిపిదనం, అమాయకత్వం లాంటివి అభినయించడాన్ని చూడాలంతే.

శ్రీకృష్ణుడికి పదహారువేలమంది గోపికలున్నా, ఈ సినిమాలో శ్రీ సుమన్ కి ఒక్క నాయికా లేదు. అయితేనేం? చెలికాడు వసంతకుడితో జరిపే సంభాషణని చూసినప్పుడు, సదరు వసంతకుడు మారురూపంలో ఉన్న అష్టవిధ నాయికల్లో ఒకరేమో అనిపించక మానదు. కృష్ణ పాత్రలో అంతగా లీనమై నటించారు సుమన్. మామూలుగా పౌరాణిక సినిమా అంటే సంభాషణలు గ్రాంధికంలో ఉంటాయి. ఫలితంగా ఈతరం ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు ఇంకా ఇంగ్లిష్ మీడియంలో చదివిన వాళ్ళూ వాటిని అర్ధం చేసుకోలేరు. స్వయంగా రచయిత అయిన సుమన్, కొంచం గ్రాంధికంలో కొంచం వ్యావహారికం కలిపిన రచించిన సంభాషణలనీ, మరీముఖ్యంగా ఆయన స్వయంగా వాటిని పలికిన తీరునీ వినాలే తప్ప చెప్పలేం.

మళ్ళీ ఓసారి నందమూరిని తల్చుకుందాం. 'మాయాబజార్' లో కృష్ణుడిగానూ, 'నర్తనశాల' లో బృహన్నలగానూ కనిపించాడు. మహాభారతం ప్రకారం బృహన్నలగా మారింది అర్జునుడు. కానీ, శ్రీ సుమన్ స్వయంగా ఎన్నో పాత్రలకి సృష్టికర్త కాబట్టి, ఈ సినిమాలో శ్రీకృష్ణుడే బృహన్నలగా కనిపిస్తాడు కొన్ని సన్నివేశాలలో. బృహన్నలగా సుమన్ బాబు నటన (?) చూడాలంటే సినిమా రెండో సగం వరకూ ఓపిక పట్టాలి. ఈ సినిమాలో మాయలూ, మంత్రాలకి లోటే లేదు. సుదీర్ఘంగా సాగే వసంతకుడి పెళ్ళి చూపుల ప్రహసనంలో ఎవరికి వారు చక్కిలిగిలి పెట్టుకుని నవ్వుకోవాలి కానీ, శ్రీకృష్ణుడే అన్నీ అయిన సన్నివేశాల్లో నవ్వులకి లోటుండదు. అలాగే ఘటోత్కచుడి మీద ఓ కార్య భారం మోపినా, దానిని అతగాడు సరిగా నిర్వహించగలడో లేదో అని పరిశీలనకి తనే సాయంగా వెంట వెళ్తారు స్వామి.

ఇతర నటీనటులు మరీ ముఖ్యంగా బలరాముడిగా ఈశ్వరరావు, రేవతిగా నాగమణి శక్తికి మించి నటించడానికి చేసిన ప్రయత్నాలని గమనించవచ్చు. ప్రతిపాత్రా కృష్ణుడి యెడల భయం కనబరచడం అన్నది తప్పక గమనించాల్సిన మరో విషయం. కథ ప్రకారం అనిరుద్ధుడు అందగాడే అయినప్పటికీ, శ్రీకృష్ణుడిని మించి అందంగా ఉండని విధంగా తీసుకున్న శ్రద్ధ, అలాగే ఉష-చిత్రరేఖ మధ్యనా, బాణాసురుడికీ, కృష్ణుడికీ మధ్యన జరిగిన సంభాషణలు ఇవేవీ మిస్సవ్వాల్సినవి కాదు. అప్పట్లో నాకు తెల్సిన ఓ అమ్మాయి -అప్పటికి అమ్మ అయ్యింది- "'ఉషా పరిణయం' డీవీడీ దొరికితే బాగుండును, వెయ్యి రూపాయలైనా కొనేస్తాను" అంది నాతో. వాళ్ళబ్బాయి, రెండేళ్ళ వాడు, అన్నం తినడానికి పూటా మారాం చేస్తున్నాట్ట. "ఓ డీవీడీ ఇంట్లో పెట్టుకుంటే, తింటావా? సినిమా పెట్టనా? అని వాడిని బెదిరించడానికి బాగుంటుంది కదా" అని తనే రహస్యం విప్పింది. కాబట్టి, కావాల్సిన వాళ్ళు రికార్డు చేసుకోండి బహుళార్ధ సాధకమైన ఈ నిరుపమాన పౌరాణిక చిత్ర రాజాన్ని

  • Replies 32
  • Created
  • Last Reply

Top Posters In This Topic

  • katharnak

    7

  • ammulu

    5

  • wolverine

    3

  • pillabachapk

    2

Top Posters In This Topic

Posted

[quote author=katharnak link=topic=227080.msg2806885#msg2806885 date=1313933678]
ledhu... suman ki kuda anr.. nag lanti spoon feeding baabu unte eepatiki mee lanti fans undevallu @3$% @3$%
[/quote]
Dramoji Rao unnadu kada.. brst feeding cheyamanu..  CITI_c$y CITI_c$y CITI_c$y

×
×
  • Create New...