Jump to content

saleem postponed


Recommended Posts

Posted

Saleem14.jpg

విష్ణు కథానాయకుడుగా వై.వి.ఎస్. చౌదరి దర్శకత్వంలో డాక్టర్ ఎం.మోహన్ బాబు నిర్మించిన 'సలీమ్' చిత్రం విడుదల పలు ఊగిసలాటల మధ్య ఎట్టకేలకు వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కావలసి ఉంది. అయితే రాష్ట్రంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ఆంధ్ర, రాయలసీమల్లో శుక్రవారంనాడు బంద్ పిలుపు నేపథ్యంలో ఈ చిత్రం విడుదలను వాయిదా వేయాలని ఫిల్మ్ మేకర్ నిర్ణయించారు.

తెలంగాణా ఏర్పాటుపై బుధవారం రాత్రి కేంద్ర మంత్రి చిదంబరం చేసిన ప్రకటన అనంతరం ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు గురువారంనాడు వరుస రాజీనామాలకు సిద్ధపడటంతో రాజకీయ వాతావరణం మరింత వెడెక్కింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని 'సలీమ్' విడుదలను చిత్ర నిర్మాతలు వాయిదా వేశారు. ఒక సినిమా సక్సెస్ లో రిలీజ్ సమయం కూడా కీలకం కావడం, ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా విడుదల చేసి రిస్క్ తీసుకోవడం ఇష్టం లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దీంతో 11న కానీ 12న కానీ ఈ చిత్రం విడుదల ఉండబోవడం లేదు. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటించున్నారు. తెలంగాణా ఉద్యమం ఊపందుకున్న తర్వాత విడుదల తేదీ, థియేటర్లు ప్రకటించి కూడా వాయిదా పడిన మొదటి భారీ బడ్జెట్ చిత్రం ఇదే అవుతుంది.

i49816_brahmi..gif

×
×
  • Create New...