Jump to content

rosaiah back to home....


Recommended Posts

Posted

రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిణాల పట్ల ముఖ్యమంత్రి కె. రోశయ్య తీవ్ర మనస్తాపం చెందారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆయన పాల్గొనవలసిన అధికారిక కార్యక్రమాలను కూడా అర్ధంతరంగా రద్దు చేసుకొని హుటాహుటిన తన నివాసానికి వెళ్ళిపోయారు. మధ్యాహ్నం అసెంబ్లీ కమిటీ హాలులో తాను నిర్వహించిన మీడియా సమావేశంలో జర్నలిస్టుల నుంచి పదే పదే వచ్చిన అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు తడబడడమే కాకుండా, తీవ్ర అసహనాన్ని కూడా వ్యక్తం చేశారు. కోస్తా, రాయలసీమ ప్రాంతాల ఎమ్మెల్యేల రాజీనామాలపై మీడియా ప్రతినిధులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పకుండా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాకు గల కారణాలు ఏమి చెప్పారని జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు ఆయన 'వారినే అడగండి', 'నన్నడిగితే ఏం సమాధానం చెబుతాను' అంటూ రుసరుసలాడారు.

ప్రత్యేక తెలంగాణపై కేంద్రం నిర్ణయం మీకు తెలియకుండానే తీసుకున్నదా తదితర ప్రశ్నలతో జర్నలిస్టులు ఆయనను పదే పదే నిలదీయడంతో కాస్త ఉద్రేకానికి లోనయ్యారు. మీడియా సమావేశం అయిన వెంటనే ఆయన హఠాత్తుగా తన కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకొని నివాసానికి వెళ్ళిపోయారు. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అవాంఛనీయ పరిస్థితులతో ఆయన తీవ్రంగా మనస్తాపం చెందారని, దానితో ఆరోగ్యం సరిగా లేకపోవడంతో రోశయ్య నివాసానికి వెళ్ళారని ఆయన సన్నిహితులు తెలిపారు.

rosai300.jpg

×
×
  • Create New...