Jump to content

vaade kavali success meet


Recommended Posts

Posted

సినిమాకు సక్సెస్ మీట్ పెట్టారంటే ఈ రోజుల్లో సాధారణ ప్రేక్షకుడు అది ప్లాఫ్ సినిమా అని ఉట్టినే గుర్తు పట్టేస్తున్నాడు. తాజాగా మొన్న శుక్రవారం రిలీజైన వాడే కావాలి కి రిలీజైన మర్నాడే ఈ చిత్రం హిట్ అనే ప్రమోషన్ నిర్మాతలు మొదలెట్టారు. ఈ సందర్భంగా ఆ చిత్రం నిర్మించిన ఎస్‌.వి.ఆర్‌. మీడియా సంస్థ సి.ఇ.ఓ శోభారాణి మీడియాతో మాట్లాడుతూ.. 30 ప్రింట్లతో సినిమాను రిలీజ్‌ చేశామని, విడుదయిన మరుసటి రోజున మరో 5 ప్రింట్లు పెంచామని, సినిమాకు మంచి ఆదరణ లభిస్తోందనడానికి ఇంతకుమించి నిదర్శనమేముంటుందని ఆ సంస్థ సి.ఇ.ఓ.శోభారాణి అన్నారు.

అలాగే చాలా బాగుంది. ఎక్కడా బోర్‌ కొట్టలేదని, సినిమా నీట్‌గా ఉందని, ఎంజాయ్‌ చేశామని చూసినవారు చెబుతున్నారు. క్లైమాక్స్‌ ముందు వచ్చే సాంగ్‌కి కూడా స్పందన బాగుంది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొని ఉన్న పరిస్థితుల దృష్ట్యా సినిమాను విడుదల చేస్తే ఇబ్బంది పడతామేమోనని కొందరు అన్నప్పటికీ సినిమా మీద నమ్మకంతో విడుదల చేశాం. మా సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు అని చెప్తున్నారు.

13-vaade-kavali-art.jpg

×
×
  • Create New...