Jump to content

Cheeli You Rock......


Recommended Posts

Posted

[size=6]చిలీ.. చించేసింది..: ప్రస్తుతం పోలీసుల నోట వినిపిస్తున్న మాట ఇదే.. ఎందుకంటే అంబాలాలో 5 కిలోల పేలుడు పదార్థాలను కనుగొన్న జాగిలం పేరు చిలీ.. 18 నెలల వయసున్న నల్లటి లాబ్రడార్ జాతి శునకం పేలుడు పదార్థాలున్న ఇండికా కారును కచ్చితంగా కనుగొని.. తన వెంట ఉన్న పోలీసును అప్రమత్తం చేసింది. కారు బానెట్ మీద కాలు ఉంచి.. ఇక్కడే బాంబులున్నాయన్న సంకేతాన్నిచ్చింది. చిలీకి ప్రత్యేక అవార్డు ఇవ్వాలంటూ హర్యానా పోలీసులు సిఫార్సు చేశారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు శునక శిక్షణ కేంద్రంలో పేలుడు పదార్థాలను గుర్తించడంలో చిలీ 24 వారాల పాటు శిక్షణను తీసుకుంది.[/size]

×
×
  • Create New...