Pekatapaparao Posted October 17, 2011 Report Posted October 17, 2011 [size=3] “అర్ధరాత్రి ఎవరినీ అడగకుండా కర్ణాటక మొయిలీ,తమిళనాడు చిదంబరం , తెలంగాణా ఇస్తామంటారా !వాళ్ళెవరు ఇవ్వడానికి ?….నాకు ఆంధ్ర,తెలంగాణారెండు కళ్ళు . ఆంధ్రావాళ్ళు సమైక్యాంధ్ర అనాలి,తెలంగాణావాళ్ళు జై తెలంగాణాఅనాలి….కాదు,కాదు నేను తటస్థం.” చంద్రబాబు[/size] [size=3] “నేను సామాజిక తెలంగాణా కావాలనుకొన్నాను. కానీ ఇప్పుడు మా వాళ్ళు సమైక్యాంధ్ర అంటున్నారు, కనుక సమైక్యాంధ్ర కావాలి. … లేదు లేదు అధిష్టానం ఏదంటే అదే.” చిరంజీవి[/size] [size=3] “తెలంగాణకు ఎలాంటి అన్యాయం జరగలేదని, నేను ప్రూవ్ చేస్తాను.యాబై శాతం కంటే ఎక్కువ తెలంగాణా ప్రజలు సమైక్యాంధ్ర కోరు కొంటున్నారు. తెలంగాణా వస్తే అభివృద్ది ఆగి పోతది.” లగడపాటి[/size] [size=3] “తెలంగాణాను కానివ్వం.ఎవరడిగితే వాళ్ళకు రాష్ట్రం ఇచ్చేస్తారా? జిల్లాకో రాష్ట్ర మివ్వ మనండి.” కావూరి[/size] [size=3] “తెలంగాణా ఇవ్వడం అంత సులభం కాదు. ఆంధ్ర వాళ్ళు తలచుకుంటే తెలంగాణా వాళ్ళు ఎక్కడుంటారు.” రాయపాటి[/size] [size=3] “కాంగ్రెస్ పార్టీ తెలంగాణా ఇస్తానని ఎప్పుడూ చెప్పలేదు. తెలంగాణా ఒక వేర్పాటువాదం, రాజ్యాంగ విరుద్ధం.” గాదె వెంకటరెడ్డి[/size] [size=3] “తెలంగాణవాదం సరైంది కాదు. అసలు తెలంగాణా వాడెవడో ముందు చెప్పాలి.నేను కూడా తెలంగాణా వాడినే.మాకు రాయల – తెలంగాణా కావాలి.” జే సి దివాకర్ రెడ్డి[/size] [size=3] “తెలంగాణావాదులు దేశ ద్రోహులు. వారినందరినీ అండమాన్ దీవులలో బంధించాలి. మేం హైదరాబాద్ ను విడిచేది లేదు.” టి జి వెంకటేష్[/size] [size=3] “తెలంగాణా అంత ముఖ్యం కాదు. తెలంగాణా వచ్చినా రాక పోయినా, ఆకాశం విరిగి పడేదేమి లేదు. విద్యార్థులు ఉద్యమం పేరిట డబ్బులు వసూలు చేసుకొంటున్నారు.” జయ ప్రకాష్ నారాయణ్[/size] [size=3] “నేను కేంద్ర ప్రభుత్వంలో ఉన్నాను.తెలంగాణా కావాలని అడగడం సమంజసం కాదు.” జైపాల్ రెడ్డి[/size] [size=3] “తెలంగాణ కొరకు ఏదైనా త్యాగం చేస్తాను.కానీ ప్రజలకొరకు ప్రభుత్వంలో పని చేస్తుంటాను.మంత్రి పదవి వదలలేను” జానారెడ్డి[/size] [size=3] “తెలంగాణా పై మా వ్యూహాలు మాకున్నాయి.సి ఎం ను కాదని ఏ పని చెయ్యను. మంత్రి పదవి లో ఉండి ప్రజల సేవ చేస్తాను ” శ్రీధర్ బాబు[/size] [size=3] “తెలంగాణా కొరకు ఎటువంటి త్యాగాలకైనా మేము సిద్ధం.అందుకే మేము ప్రభుత్వంలో ఉన్నాము. తెలంగాణా కొరకు పోరాడుతూనే ఉంటాము.”. బి.సారయ్య[/size] [size=3] “ఆంధ్ర ప్రదేశ్ ఎప్పటిలాగానే ఉండాలి.రాష్ట్రం విడ దీస్తే రాయల – తెలంగాణా కావాలి.లేకపోతే బి జే పి వచ్చి సెక్యులరిజం దెబ్బ తింటుంది.” అసదుద్దీన్ ఒవైసీ[/size] [size=3] “కర్నూలు,అనంతపూరు కలిపి రాయల – తెలంగాణా ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు.” ఉత్తమకుమార్ రెడ్డి[/size] [size=3] “ఆంధ్రోల్లతోన కలిసి పని చెయ్యాలి.వాళ్ళను కాదని తెలంగాణా అడగడం మంచిది కాదు. ఎవరో, ఏందో చెప్తే ఎందుకు చేస్తాం. సి ఎం ఏది చెపితే అది చేస్తాం.” రాజనర్సింహ, నాగేందర్,ముఖేష్[/size] [size=3] “తెలంగాణావాదులు దుర్మార్గులు. వాళ్ళను జైళ్లలో పెట్టాలి.తుపాకులతో కాల్చి చంపాలి.” దేవినేని ఉమ[/size] [size=3] “కే సి ఆర్, కోదండరామ్ లు తాలిబాన్లు. వాళ్ళు బయట ఉంటె ప్రమాదం.వాళ్ళను జైళ్లలో పెట్టాలి.” అనం వివేకా[/size] [size=3] “తెలంగాణా అడగడం సరికాదు.కావాలంటే తెలంగాణా వద్దని, మేము ఆత్మాహుతులు చేస్తాము.” పయ్యావుల కేశవ్[/size] [size=3] “తెలంగాణా సమస్య జటిలమైనది. ఎవరికీ ఇబ్బంది లేకుండా వాళ్ళు సమ్మె చేసుకోవాలి. రాష్ట్ర విభజన ఎట్టి పరిస్థితిలోనూ ఒప్పుకోము.” శైలజానాథ్[/size] [size=3] “మాకు హైదరాబాద్ లో వాటా ఇవ్వాలి.కొత్త రాజధాని కట్టుకోవడానికి ఒక లక్ష కోట్ల రు.లు కావాలి.” హరి రామ జోగయ్య[/size] [size=3] “తెలంగాణా ఉద్యమం సరి కాదనడం లేదు.కానీ ప్రభుత్వానికి ఇబ్బంది లేకుండా సమ్మె చేసుకొంటే మంచిది.” బొత్స సత్యనారాయణ[/size] [size=3] “కే సి ఆర్ అడిగితే చెంగు రంగా అని తెలంగాణా ఇచ్చెయ్యాలా ! ఎవరో అడిగితే దేశాన్ని ముక్కలు చెయ్యాలా?” రేణుకా చౌదరి[/size] [size=3] “కే సి ఆర్ తెలంగాణా రావద్దని ఉద్యమం చేస్తున్నాడు. తెలంగాణా వచ్చేవరకు మేం చేస్తే తప్ప ఎవ్వరూ పోటీ చెయ్య గూడదు.మా పార్టీకి తప్ప ఏ పార్టీకి చిత్త శుద్ది లేదు.” ఎర్రబెల్లి దయాకర్ రావు[/size] [size=3] “ఏదో ఆ పూటకు తెలంగాణా అంటే ఒకే అన్నాము. అంత మాత్రానికి తెలంగాణా ఇస్తామంటే ఊరు కొంటామా? అన్ని పార్టీల ఆంధ్ర వాళ్ళమంతా కలిసి అడ్డు కుంటాము.” నన్నపనేని రాజకుమారి[/size] [size=3] “మేమెందుకు రాజీనామా చెయ్యాలె.కోదండరామ్ ను, స్వామి గౌడ్ ను చెయ్యమనండి.తెలంగాణా వస్తది.సోనియమ్మ ఇస్తే తీసుకుంటం.ఇయ్యమని ఆమెను పరేషాన్ చెయ్యం.” సర్వే సత్యనారయణ[/size] [size=3] “ఆంధ్రులు తెలంగాణా కొరకు ఎంతో చేశారు.మెజారిటీ రాష్ట్ర ప్రజలు సమైక్యాంధ్ర కోరుకుంటున్నారు.కాబట్టి తెలంగాణా ఉద్యమం అనవసరం.” కోడెల శివప్రసాద్[/size]
Recommended Posts