Jump to content

Rk Sawal To Jagan


Recommended Posts

Posted

[b] [size=6] జగన్.. జీరో నుంచి ప్రారంభిద్దామా![/size][/b]
[size=6][b] వి. రాధాకృష్ణ[/b][/size]


[size=5][b][font=arial,helvetica,sans-serif]సహనం, సంస్కారం అందరికీ అర్థం కావు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శిబిరానికి కూడా నా సహనం అర్థం కాలేదు. మూడు రోజులుగా జగన్ మనుషులు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నా, రోత మీడియాగా పేరొందిన సాక్షి పత్రిక, ఛానెల్ ఆ కారుకూతల్నే పరమ సత్యాలుగా ప్రచారం చేస్తున్నా, ఊరుకున్నది... తిరిగి సమాధానం చెప్పలేక కాదు. [color=#b22222]ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణగా ఇప్పుడు చెబుతున్నాను. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డీ, నీ చెంచాలను పక్కనపెట్టి నాతో చర్చకు రా! నీలో ఏ మాత్రం నీతీ నిజాయితీ ఉన్నా, నా సవాలును స్వీకరించు.[/color][/font][/b][/size]

[size=5][b]నాపై నువ్వు చేయించిన ఆరోపణలన్నింటికీ నేను సమాధానం చెబుతాను. నీపై వచ్చిన ఆరోపణలకు నువ్వు సమాధానం చెప్పుకో. ప్రజలు నిర్ణయించుకుంటారు ఎవరు ఏమిటో. జర్నలిస్టుగా నా ఎదుగుదల వెనుక ఏదో క్షమించరాని నేరమున్నట్టు నీ శిబిరం గోబెల్స్ ప్రచారం చేస్తోంది. నీ తండ్రి వైఎస్ హయాంలో మొదలైన ఈ ఎదురు దాడి సంస్కృతిని నీవు మరింత పరాకాష్ఠకు తీసుకుపోయావు. ఆనాడు నీ తండ్రికి చెప్పాను, 'నేను-నా అక్షరం' ఎంత నికార్సయినవో. చర్విత చరణమైనా ఈరోజు నీకు, నీ వందిమాగధులకు విడమరచి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను.[/b][/size]

[size=5][b]మూడు దశాబ్దాల నా జర్నలిస్టు కెరీర్‌లో, నేను తప్పు చేసినట్టు, తప్పుడు రాతలు రాసినట్టు, అవినీతికి పాల్పడినట్టు నువ్వు రుజువు చేయగలిగితే ఆంధ్రజ్యోతి పత్రికలో నా వాటాను ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టుల సంఘానికి విరాళంగా ఇస్తాను. జర్నలిస్టుల సంఘమే పత్రికను నిర్వహించుకోవచ్చు. 2004 నుంచి నువ్వు ఎంత ఎదిగావో, ప్రజల సొమ్ము ఎన్ని కోట్లు కొల్లగొట్టావో, ఎన్ని ఆస్తులు మూటగట్టుకున్నావో... అవన్నీ లెక్కకట్టి ప్రజలకు పంచడానికి నువ్వు సిద్ధమేనా? సీబీఐ నీ ఇంటికొచ్చిన వార్త రాసినందుకు, నా ఇంటి ప్రస్తావన కూడా తీసుకొచ్చావు కాబట్టి చెబుతున్నా... ఇంద్ర భవనాన్ని తలపిస్తున్న నీ ఇల్లు,[/b][/size]

[color=#ff0000][size=5][b]నా ఇల్లు రెండూ ఒకటే అయితే... నా ఇల్లు కూడా అమ్మేసి ఆ సొమ్ము నీకే ఇస్తా. రేపు సీబీఐ నీ ఇంటికి కట్టబోయే విలువలో, నాకు నాలుగోవంతు ఇవ్వు చాలు; నా ఇంటిని వదులుకుంటాను. నేను ఉంటున్న ఇల్లు నాదేనని నేను సగర్వంగా చెప్పుకోగలను. అందుకు అవసరమైన అన్ని ఆధారాలూ చూపగలను. నువ్వా స్థితిలో ఉన్నావా? నీ పెంపుడు జంతువులు పదే పదే ప్రకటిస్తున్నట్టు, అది నీ ఇల్లేనని డాక్యుమెంట్స్ చూపించగలవా? ఇంటి స్థలంలో సగం వాటాదారు యూనస్ సుల్తాన్ నీ మాయలో ఎలా పడ్డారో, నీకెలా ఆ స్థలం సమర్పించుకున్నారో వివరించగలవా?[/b][/size][/color]

[color=#ff0000][size=5][b]నేను సైకిల్‌పై తిరిగిన జీరోనన్నారు కదూ, తిరిగి జీరో నుంచి జీవితం ప్రారంభించడానికి నేను రెడీ... నీ అవినీతి సామ్రాజ్యాన్ని కాలదన్నుకొని నువ్వొస్తావా ఆ జీరో దగ్గరకు? అయినా నాకూ నీకూ పోలిక ఏంటి! నీ బాబు ముఖ్యమంత్రి. ఆ బాబును అడ్డం పెట్టుకొని అవినీతికి పాల్పడగలిగిన అవకాశం నీకే ఉంది. నాకేముందని ఈ పిచ్చి కూతలు? నీకో పార్టీ ఉందని, ఆ పార్టీకో పత్రిక, టీవీ ఉన్నాయని, ఇష్టమొచ్చిన రాతలు రాసి, ఇష్టమొచ్చిన కూతలు కూస్తూ పోతే ఇవతలి వాళ్లు చేతులు కట్టుకు కూర్చోరు. మొత్తం మీడియానే భ్రష్టు పట్టించే ప్రయత్నాలను ప్రతిఘటించకుండా ఊరుకోరు.[/b][/size][/color]

[size=5][b]అందుకే నేరుగా నీకే సవాలు విసురుతున్నాను జగన్‌మోహన్‌రెడ్డీ రా.. నాతో బహిరంగ చర్చకు రా! 2004 ముందు నీ తండ్రి వై.ఎస్. రాజశేఖర్‌రెడ్డి బంజారాహిల్స్ రోడ్ నెంబర్ టూలో ఉన్న ఇంటిని అమ్ముకుంటేగానీ తనకు మనుగడ ఉండదని భావించడం నిజం కాదా? ఆ స్థలాన్ని రెగ్యులరైజ్ చేయాలంటూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబును రిక్వెస్ట్ చేయడం నిజం కాదా? "వైఎస్ ఇంటికి బాబు గొళ్లెం'' అని 'ఆంధ్రజ్యోతి' పతాక శీర్షికన ప్రచురించలేదా? అలాంటి స్థితి నుంచి మీ నాన్న ఎలా ఎదిగాడు? ఆ నాన్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఈ ఆరేళ్లలో నీవెలా ఎదిగావు? ఇవన్నీ బహిరంగ రహస్యాలు కావా?[/b][/size]

[size=5][b]నీ తండ్రి మరణానంతరం ఒక్కొక్క వాస్తవం వెలుగు చూడడం నడుస్తున్న చరిత్ర కాదా! మీడియాను, రాజకీయ ప్రత్యర్థుల్ని సహించలేక మీ నాన్న ఎదురుదాడికి దిగితే, నువ్వా దుర్మార్గపు విద్యను మరింత ముందుకు తీసుకుపోవాలనే నిర్ణయించావా! సీబీఐ ముప్పేట దాడితో ఊపిరాడని నువ్వు, పీకల లోతు కష్టాల్లో కూరుకుపోయిన నువ్వు, అసహనంతో వేస్తున్న పెడబొబ్బలకు మీడియా ఎందుకు టార్గెట్ కావాలి? నువ్వు బురదలో కూరుకుపోయావని ఆ బురద అందరికీ అంటిస్తే ఊరుకుంటామా?[/b][/size]

[size=5][b]ఇవాళ సెజ్‌ల గురించి నీ మనుషులు ధర్మ పన్నాలు వల్లిస్తున్నారు. ఈ రాష్ట్రంలో సెజ్‌ల బాగోతం తెలియందెవరికి? వైఎస్ హయాంలో మంజూరైన సెజ్‌లన్నీ పర్సెంటేజీల రూపంలో జగన్‌మోహన్‌రెడ్డికి కప్పం కట్టిన వైనం నిజం కాదా? తెలంగాణకు చెందిన ఓ ప్రముఖుడి సిమెంట్ కంపెనీపైనా ఇదే అస్త్రం ప్రయోగించలేదా! కొందరు నీ పర్సెంటేజీల దందా భరించలేక నీ తండ్రికే మొరపెట్టుకున్న దాఖలాలు ఎన్నిలేవు? ఎంత మంది నీ దాష్టీీకానికి జడిసి నోరుమూసుకొని ఉండిపోలేదు! అసలు నీ అవినీతి సామ్రాజ్య విస్తరణకు కేంద్ర బిందువైన సండూర్ పవర్‌కు మార్జిన్ మనీ కూడా లేని స్థితిలో ఎవరెవరి దగ్గర చేయిచాపావో, ఎంతెంత సొమ్ము తెచ్చుకున్నావో మరచిపోయావా![/b][/size]

[size=5][b]నీ చరిత్ర ఇంత ఘనంగా ఉంటే, వర్తమానంలో నిన్ను కేసులు చుట్టుముట్టి ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, నీ భవిష్యత్తు అంధకారంగా కనిపిస్తుంటే ఇంకా ఏ ధైర్యంతో ఎదురుదాడిని కొనసాగిస్తున్నావో నీ విజ్ఞతకే వదిలేస్తున్నా. హైదరాబాద్‌లో నువ్వు కట్టుకున్నది ఇంద్ర భవనమో కాదో త్వరలోనే తేలిపోతుంది. కొల్లగొట్టిన కోట్లలో ఎన్ని కోట్లు పోసి ఆ భవనాన్ని ముస్తాబు చేశావో త్వరలోనే లెక్క తేలుతుంది. ఇంత మంది అధికారులు, అంత మంది సిబ్బంది, ఇన్నేసి రోజులు నీ ఇంటి చుట్టూ తిరుగుతూ లెక్కలేస్తున్నారంటేనే అది మయసభను తలపించే మాయదారి ఇల్లని తెలియడం లేదా![/b][/size]

[size=5][b]సీబీఐ సోదాలు చేసి చెబుతున్న సమాచారం ప్రచురించడమే పత్రికల పాపమైందా! ఆ వార్తలను ప్రసారం చేయడమే టీవీ ఛానళ్ల నేరమైందా! [color=#ff0000]అందుకేగా నీ పెంపుడు జంతువుల్ని ఉసిగొల్పి విషం కక్కిస్తున్నావు. ఆరేళ్లు అధికారంలో ఉన్న నీ తండ్రే నన్నేమీ చేయలేకపోయాడు. నేను అవినీతికి పాల్పడినట్టు ఒక్కటంటే ఒక్క రుజువూ చూపలేకపోయాడు.[/color] మార్గదర్శిని అడ్డంపెట్టుకొని ఈనాడుతో ఆడుకోగలిగాడు కానీ ఆంధ్రజ్యోతి జోలికి రాలేకపోయాడు. నా దగ్గర దోషమే ఉంటే, నేను అక్షరాన్ని అమ్ముకొనే ఎల్లో జర్నలిస్టునే అయివుంటే నీ తండ్రి నన్నెందుకు ఏమీ చేయలేక ఊరుకున్నాడో తెలిస్తే సమాధానం చెప్పు.[/b][/size]

[size=5][b]తండ్రికి తెలియని సంగతులు నీకేమన్నా తెలిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి చెబుదువురా! మందబుద్ధుల కోసం మళ్లీ మళ్లీ చెబుతున్నాను... ఆంధ్రజ్యోతి రాసిన రాతలు అక్షర సత్యాలు. 'ఆంధ్రజ్యోతి' ఎండీగా నా విశ్వసనీయత, నిజాయితీలపై ఎలాంటి చర్చకైనా నేను సిద్ధం. పెంపుడు జంతువుల్ని పక్కనబెట్టి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాతో చర్చకు రావాలని సవాలు చేస్తున్నాను. ఆస్తులు వదులుకోవడానికి నేను విసురుతున్న ఈ సవాల్‌కు స్పందించే దమ్ము, ధైర్యం నీకు లేకపోతే, నోరు మూసుకోవలసిందిగా నీ పెంపుడు జంతువులను ఆదేశించు. లేదా నీ అక్రమ సంపాదనను ప్రజల పరం చేయడానికి సిద్ధం కా![/b][/size]

Posted

mari mari tom garu... inta old news aaa.... RK saval vesadu danki YSR congress party vallu reply kuda icharu....

Posted

[quote name='KINGMAKERS' timestamp='1319466096' post='3025221']
mari mari tom garu... inta old news aaa.... RK saval vesadu danki YSR congress party vallu reply kuda icharu....
[/quote]

Avunnaaaa.... Nenu sat and sunday full ga nidra poya anduke
idi flash news anukunaaaa...

[img] http://i41.tinypic.com/4izu4m.gif[/img]

Posted

[quote name='Tom Sawyer' timestamp='1319466211' post='3025229']

Avunnaaaa.... Nenu sat and sunday full ga nidra poya anduke
idi flash news anukunaaaa...

[img]%20http://i41.tinypic.com/4izu4m.gif[/img]
[/quote]

:5_2_108: :5_2_108: :5_2_108:

Posted

[quote name='KINGMAKERS' timestamp='1319466096' post='3025221']
mari mari tom garu... inta old news aaa.... RK saval vesadu danki YSR congress party vallu reply kuda icharu....
[/quote]
emani reply ichaaro koncahm ikkada veyyi ba

×
×
  • Create New...