Jump to content

Recommended Posts

Posted

“బాబూ.. మొహం కడుక్కుని రా. తల దువ్వుతాను. నాన్నగారు నిన్ను వెంకాయమ్మ గారింటికి తీసుకెళ్తారుట…” తల దువ్వించుకోవడం నాకు చాలా చిరాకైనా పనైనా, ఆ చివరి మాటలు వినగానే మంత్రించినట్టుగా నూతి దగ్గరకి పరిగెత్తే వాడిని చిన్నప్పుడు, మొహం కడుక్కోడం కోసం. వెంకాయమ్మ గారింటికి వెళ్ళడం అంటే ఒక చిన్న సైజు పండుగ అప్పట్లో.

బెల్లం పాకం తో చుట్టిన జీడిపప్పు ఉండలు, బెల్లం పూతరేకులు, గోర్మిటీలు, మడత కాజాలు.. వీటిలో కనీసం రెండు రకాల మిఠాయిలని ఇత్తడి పళ్ళెంలో పెట్టి అందిస్తారా.. అవి తినడం పూర్తి కాకుండానే ఓ పేద్ద ఇత్తడి గ్లాసు నిండా నురుగులు నురుగులుగా బెల్లంటీ ఇచ్చేస్తారు. మనం ఇంకేమీ అనడానికి ఉండదు. బుద్ధిగా తాగేయ్యడమే.. పైగా నాన్న కూడా ‘వద్దు’ అనరు.

రెండు చేతులతోనూ గ్లాసుని గట్టిగా పట్టుకుని, ఊదుకుంటూ తాగుతుంటే బెల్లంటీ ఎంత బాగుంటుందంటే.. ఆ రుచి వర్ణించడానికి రాదు. తియ్యగా, వగరుగా, అదోలాంటి వాసనతో.. అంత పేద్ద గ్లాసు చూడగానే అస్సలు తాగ గలమా? అనుకుంటాం.. కానీ తాగుతుంటే ఇంకా తాగాలని అనిపిస్తుంది.. మన ఇంట్లో పాలు తాగినట్టు బెల్లంటీ చివరి చుక్కవరకూ తాగ కూడదు.. ఎందుకంటే గ్లాసు అడుగున నలకలు ఉంటాయి.. అందుకని కొంచం వదిలెయ్యాలి.

వెంకాయమ్మ గారు.. మా ఊళ్ళో పరిచయం అక్కర్లేని పేరు. ఆవిడ మామూలుగా మాట్లాడిందంటే నాలుగు వీధులు వినిపిస్తుంది.. ఇంక కోపం వచ్చిందంటే ఊరంతటికీ వినిపించాల్సిందే. యాభయ్యేళ్లు పైబడ్డ  మనిషైనా అంత వయసులా కనిపించేది కాదు. నల్లని నలుపు, చెయ్యెత్తు మనిషి. జరీ నేత చీర, ఐదు రాళ్ళ ముక్కు పుడక, బేసరి, చెవులకి రాళ్ళ దిద్దులు, మెడలో నాంతాడు, చంద్రహారాలు, కంటె, కాసుల పేరు, చేతులకి అరవంకీలు, కాళ్ళకి వెండి కడియాలు, పట్టీలు.. ఆవిడ పేరంటానికి వచ్చిందంటే సాక్షాత్తూ లక్ష్మీదేవి నడిచొచ్చినట్టు ఉందని అనేది అమ్మ. వీటిలో సగం నగలు నిత్యం ఆవిడ వంటిమీద ఉండాల్సిందే..  మా ఊరి గుళ్ళో అమ్మవారి మెడలో మంగళ సూత్రాల తర్వాత, మళ్ళీ అంత పెద్ద సూత్రాలు ఆవిడ మెడ లోనే చూశాను నేను.

వాళ్ళ ఇల్లు చూస్తే కోనసీమ మొత్తాన్ని చూసేసినట్టే. వీధివైపు కొబ్బరి చెట్లు. మల్లె పొదలు, జాజితీగలు,  బంతి, కనకాంబరం మొక్కలు. దాటి లోపలి వెళ్తే పేద్ద పెంకుటిల్లు. పెరటి వైపున వంటకి ఇంకో చిన్న వంటిల్లు. ఓ పక్కగా కోళ్ళ గూడు, మరో పక్క వంట చెరకు. కాస్త దూరంలో నుయ్యి. నూతి గట్టుని ఆనుకుని వాళ్ళ కొబ్బరి తోట, కొంచం ముందుకెళ్తే వాళ్ళదే వరి చేను. ఈవిడ  వంటగదిలో నుంచి కేకేసిందంటే పొలంలో కూలీలు ఉలిక్కి పడి, మాటలు ఆపి పని మొదలు పెట్టాల్సిందే.

నేనూ, నాన్నా ఎప్పుడు వెళ్ళినా వాళ్ళ పెరటి అరుగు మీద కూర్చునే వాళ్ళం. ఆవిడ వంట ఇంట్లో పని చేసుకుంటూనే, ఓ పక్క నాన్నతో మాట్లాడుతూ మరో పక్క పొలంలో పనిచేసే కూలీల మీద అజమాయిషీ చేసేది. చిన్నప్పుడు నన్ను ‘మనవడా’ అనీ, నేను కొంచం పెద్దయ్యాక ‘మనవడ గారా..’ అనీ పిలిచేది. నేనేమో ఆవిణ్ణి మరీ పసితనంలో ‘వెంకాయమ్మా..’ అనీ కొంచం జ్ఞానం వచ్చాక ‘నానమ్మ గారూ..’ అనీ పిల్చేవాడిని. నాన్నని ‘అబ్బాయి’ అనీ అమ్మని ‘కోడలు గారు’ అనీ అనేది. నేనంటే భలే ముద్దు ఆవిడకి.

మా ఊరివాడైన నరసింహ మూర్తి గారిని పెళ్లి చేసుకుని తన పన్నెండో ఏట మా ఊరికి కాపురానికి వచ్చిందట వెంకాయమ్మ గారు. ఆవిడ పుట్టిల్లు మా ఊరికి నాలుగైదు ఊళ్ళు అవతల ఉన్న మరో పల్లెటూరు. జీడి తోటలకీ, మావిడి తోటలకీ ప్రసిద్ధి. కలిగినింటి ఆడపడుచు కావడంతో భూమి, బంగారం బాగానే తెచ్చుకుందని మా ఇంట్లో అనుకునే వాళ్ళు. ఆవిడ వచ్చాకే నరసింహ మూర్తి గారికి దశ తిరిగిందిట. ఆయన స్వతహాగా అమాయకుడు. కష్టపడతాడు కానీ, వ్యవహారం బొత్తిగా తెలీదు.

నలుగురు పిల్లలు బయలుదేరగానే ఇంటి పెత్తనం మొత్తం వెంకాయమ్మగారు తన చేతుల్లోకి తీసుకుందిట. వాళ్లకి ఆరుగురు ఆడపిల్లలు, ఒక్కడే మగపిల్లాడు. మొదటి నుంచీ ఆవిడకి ఆడపిల్లలంటే చిన్నచూపు, ఆస్తి పట్టుకుపోతారని. కొడుకంటే విపరీతమైన ప్రేమ. ఆవిడ పెత్తనం తీసుకున్నాక అప్పటివరకు ఖాళీగా పడున్న పోరంబోకు భూమిని మెరక చేసి కొబ్బరితోట గా మార్చింది. ఉన్న పొలానికి తోడు, మరికొంత పొలం కౌలుకి తీసుకుని వరి, అపరాలు పండించడం మొదలు పెట్టింది. పాడికి పశువులు, గుడ్లకి కోళ్ళు సర్వకాలాల్లోనూ ఇంట్లో ఉండాల్సిందే.

చివరి సంతానానికి నీళ్ళూ, పాలూ చూడడం అయ్యేసరికి పెద్ద కూతురి పిల్లలు పెళ్ళికి  ఎదిగొచ్చారు. అంత సంసారాన్నీ ఈదుతూనే ఊరందరికన్నా ముందుగా తన ఇల్లంతా గచ్చు చేయించింది వెంకాయమ్మ గారు. “ఎదవ కోళ్ళు.. కొంపంతా నాసినం చేసి పెడతన్నాయి..వందలు తగలేసి గచ్చులు సేయించినా సుకం లేదు” అని విసుక్కుందోసారి. “మరెందుకు కోళ్ళని పెంచడం? తీసేయొచ్చు కదా?” అని నేను జ్ఞానిలా సలహా ఇచ్చాను, ఆవిడ పెట్టిన లడ్డూ కొరుక్కుంటూ.

“మీ మావలొచ్చినప్పుడు కోడి గుడ్డట్టు కంచంలో ఎయ్యకపోతే మీ అత్తలు ముకం మాడ్సరా నాయినా? ఈటిని తీసేత్తే గుడ్లెక్కడినుంచి అట్రాను?” అని అడిగిందావిడ. “మా ఆడపడుచుల చేత ఇల్లలికించారు.. మా తోటికోడలు కష్ట పడకూడదని గచ్చులు చేయించేశారు అత్తగారు” అని వేళాకోళం చేసింది అమ్మ. ఊళ్ళో వాళ్ళు ఆవిడ నోటికి జడిసినా, ఏదైనా అవసరం వచ్చినప్పుడు మొదట తొక్కేది ఆవిడ గడపే. ఇంటికి వచ్చిన వాళ్ళని వట్టి చేతులతో పంపదని పేరు. “అవసరం రాబట్టే కదా మన్ని ఎతుక్కుంటా వచ్చారు.. మనకి మాత్తరం రావా అవసరాలు?” అనేది ఆవిడ.

పొలం పనుల రోజుల్లో వాళ్ళిల్లు పెళ్ళివారిల్లులా ఉండేది. పెరట్లో గాడి పొయ్యి తవ్వించి పెద్ద పెద్ద గంగాళాల్లో ఉప్మా వండించేది.. ఓ పెద్ద ఇత్తడి బిందెలో బెల్లం టీ మరుగుతూ ఉండేది. “కడుపు నిండా ఎడతాది.. మారాత్తల్లి” అనుకునే వాళ్ళు కూలీలు. పని కూడా అలాగే చేయించేది. గట్టున నిలబడి అజమాయిషీ చేయడమే కాదు, అవసరమైతే చీరని గోచీ దోపి పొలంలోకి దిగిపోయేది. సాయంత్రానికి కూలీ డబ్బులు చేతిలో పెట్టి పంపించేది. “ఆళ్ళని తిప్పుకుంటే మనకేవన్నా కలిసొత్తాదా” అంటూ.

వెంకాయమ్మ గారికి భక్తి ఎక్కువే. కార్తీక స్నానాలకీ, మాఘ స్నానాలకీ సవారీ బండి కట్టించుకుని గోదారికి బయలుదేరేది. ఎప్పుడైనా సినిమా చూస్తే అది భక్తి సినిమానే అయ్యుండేది. ఆవిడ సవారీబండి కట్టించిందంటే అది మా ఇంటి ముందు ఆగాల్సిందే. మేము బండిలో కూర్చోవాల్సిందే. నాన్నని నోరెత్తనిచ్చేది కాదు. “ఆయమ్మని నువ్వూ ఎక్కడికీ తీస్కెల్లక, నన్నూ తీసుకెళ్ళనివ్వక.. ఎట్టా నాయినా?”  అని గదమాయించేది.

ఎప్పుడైనా నాన్న ఊరికి వెళ్ళాల్సి వచ్చి, ఇంట్లో మేము ఒక్కళ్ళమే ఉండాల్సి వస్తే రాత్రులు మాకు సాయం పడుకోడానికి వచ్చేది ఆవిడ. పనులన్నీ ముగించుకుని ఏ పదింటికో తలుపు తట్టేది. “ఉడుకు నీల్లతో తానం చేసొచ్చాను కోడలగారా.. మా మనవడు సెవటోసన అనకుండా” అనేది. అది మొదలు అమ్మా, ఆవిడా అర్ధ రాత్రివరకూ కష్టసుఖాలు కలబోసుకునే వాళ్ళు. నేను నిద్రపోయానని నిశ్చయం చేసుకున్నాక, ఆవిడ బయటికి వెళ్లి అడ్డ పొగ పీల్చుకుని వచ్చేది. నాకు తెలిస్తే నవ్వుతానని ఆవిడ భయం. నాకు తెలిసినా తెలీనట్టు నటించే వాడిని. ఆవిడ సాయానికి వచ్చినప్పుడు అమ్మ నిద్రపోయేది కాదు. దొంగాడెవడైనా వెంకాయమ్మ గారి నగల మీద కన్నేసి, ఆవిడ మా ఇంట్లో ఉండగా పట్టుకుపోతే ఆ పేరు ఎప్పటికీ ఉండిపోతుందని అమ్మ భయం.

నాకు జ్వరం వస్తే టీ కాఫీలు తరచూ ఇమ్మని చెప్పేవారు డాక్టరు గారు. నేనేమో బామ్మ తాగే కాఫీ అయినా, వెంకాయమ్మ బెల్లం టీ అయినా కావాలని గొడవ చేసేవాడిని. అమ్మకేమో అంతబాగా చేయడం వచ్చేది కాదు. ఒక్కోసారి వారం పదిరోజుల వరకూ జ్వరం తగ్గేది కాదు. అలాంటప్పుడు ఖాళీ చేసుకుని నన్ను చూడ్డానికి వచ్చేది వెంకాయమ్మ గారు. “వెంకాయమ్మ ఇచ్చే టీ లాంటిది కావాలని గొడవ చేస్తున్నాడు మనవడు. నాయనమ్మగారు ఏం మందు కలిపి ఇస్తారో మరి” అనేది అమ్మ.

“అదేవన్నా బాగ్గెవా బంగారవా నాయినా.. మీ సిన్నత్త సేత అంపుతానుండు..” అనడమే కాదు, మర్చిపోకుండా వాళ్ళ చిన్నమ్మాయికిచ్చి పంపేది. ఎప్పుడు జ్వరం వచ్చినా “వెంకాయమ్మ బెల్లం టీ తాగితే కానీ నీ జ్వరం తగ్గదురా” అని ఏడిపించేది అమ్మ. టీ ఒక్కటేనా? పత్యం పెట్టే రోజున వాళ్ళ పెరట్లో బీరకాయలో, ఆనపకాయో ఎవరో ఒకరికి ఇచ్చి పంపేది.

“టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. “నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,” అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది.ఆడపిల్లలకి పెళ్ళిళ్ళు కాగానే వాళ్ళ అబ్బాయికి సంబంధాలు చూడడం మొదలు పెట్టింది  వెంకాయమ్మ  గారు. అతనికి పెద్దగా చదువు అబ్బలేదు. వ్యవసాయం పనులు గట్టు మీద నిలబడి అజమాయిషీ చేయడం కూడా అంతంత మాత్రం. వెంకాయమ్మ గారు బలపరిచిన ఆస్తి పుణ్యమా అని సంబంధాలు బాగానే వచ్చాయి. ఆవిడ అన్నలే పిల్లనిస్తామని ముందుకొచ్చారు. ఇద్దరు ముగ్గురు ఆడపిల్లలున్న ఇంటి నుంచి కోడల్ని తెచ్చుకుంటే కొడుక్కి ముచ్చట్లు జరగవని తన తమ్ముడి ఏకైక కూతురితో కొడుకు పెళ్ళికి ముహూర్తం పెట్టించింది.

ఆవిడ పుట్టిన ఊళ్ళో, పుట్టింట్లోనే కొడుకు పెళ్లి. మా ఊరి నుంచి ఎడ్ల బళ్ళు బారులు తీరాయి. కేవలం మాకోసమే ఒక సవారీ బండి ఏర్పాటు చేసింది వెంకాయమ్మ గారు. పెళ్లింట్లో మాకు ప్రత్యేకమైన విడిది.. మాకు కావలసినవి కనుక్కోడానికి ప్రత్యేకంగా ఒక మనిషి. అంత సందట్లోనూ ఆవిడ మమ్మల్ని. మర్చిపోలేదు. మధ్యలో తనే స్వయంగా వచ్చి ఏం కావాలో కనుక్కుంది. పుట్టి బుద్దెరిగిన ఆ పదేళ్ళ లోనూ అంతటి పెళ్లి నేను చూడలేదు. పెళ్లి కాగానే ముత్యాల పల్లకీలో ఊరేగింపు. పల్లకీ మా ఊళ్లోకి రాగానే కొడుకునీ, కోడలినీ మా ఇంటికి తీసుకొచ్చింది ఆవిడ.

ఆవిడ కోరుకున్నట్టే అల్లుడిని బంగారంతో ముంచెత్తడమే కాక, కొత్త మోటారు సైకిల్ కొనిచ్చాడు మావగారు. మా ఊళ్ళో కొత్త మోటర్ సైకిల్ నడిపిన మొదటి వ్యక్తి వెంకాయమ్మ గారి అబ్బాయే. మూడు బళ్ళ మీద సామాను వేసుకుని కాపురానికి వచ్చింది కొత్త కోడలు. పందిరి మంచం, అద్దం బల్లా, బీరువా.. ఇలా..  అందరిలా ఊరికే ఒక లడ్డూ, మైసూరు పాక్, అరటిపండూ కాకుండా సారె కూడా ఘనంగా తెచ్చుకుంది. మొత్తం తొమ్మిది రకాల మిఠాయిలు. ఊరందరూ చాలా గొప్పగా చెప్పుకున్నారు. పుట్టింటికి వెళ్ళినప్పుడల్లా అన్ని మిఠాయిలు సారె తెచ్చుకునే అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని అమ్మకి కచ్చితంగా చెప్పేశాను.

నేను పొరుగూరు హైస్కూలు చదువులో పడడంతో వాళ్ళింటికి పెత్తనాలు తగ్గాయి. అదీ కాక ఆ కొత్త కోడలంటే తెలీని బెరుకు. పాపం ఆవిడా బాగానే మాట్లాడేది. అయినా మునుపటి స్వేచ్చ ఉండేది కాదు. కాలం తెలియకుండానే గడిచిపోతోంది.

ఒకరి తర్వాత ఒకరు వెంకాయమ్మ గారికి ఇద్దరు మనవరాళ్ళు బయలుదేరారు. ‘మగ పిల్లలు కావాల్సిందే’ అని పంతం పట్టడమే కాక, ఆ పంతం నెగ్గించుకుంది ఆవిడ. తర్వాత వరుసగా ఇద్దరు మనవలు. “సొంత మనవలు వచ్చేశారు.. నానమ్మగారికి ఇంక ఈ మనవడు ఏం గుర్తుంటాడు లెండి” వాళ్ళ చిన్న మనవడిని చూడ్డానికి వెళ్ళినప్పుడు అన్నాను. “ఎంత మాట నాయినా.. నీ తరవాతోల్లే నీ తమ్ముల్లు” అందావిడ ఆప్యాయంగా.

నేను కాలేజీలో చదవడం ఆవిడకి ఎంత సంతోషమో. “మీరూ అన్నయ్య గారిలా సదుంకోవాలి” అనేది తన మనవల్ని ఒళ్లో కూర్చోబెట్టుకుని. వయసు పెరగడం, ఆవిడకి ఓపిక తగ్గడం తో వ్యవహారాల్లో కొడుకు జోక్యం పెరిగింది.. ఆవిడ జోక్యం క్రమంగా తగ్గింది. చేతినిండా డబ్బు ఆడుతుండడంతో అతను వ్యసనాలకి అలవాటు పడ్డాడు. ఒకటీ రెండూ కాదు, వ్యసనాల జాబితాలో ఉండే వ్యసనాలన్నీ అతనికి అలవడి పోయాయి. విపరీతమైన ప్రేమ కొద్దీ కొడుకు మీద ఈగని కూడా వాలనిచ్చేది కాదు వెంకాయమ్మ గారు. ఎక్కువరోజులు పుట్టింట్లోనే ఉండడం మొదలు పెట్టింది ఆవిడ కోడలు.

ఉద్యోగం వెతుక్కుంటూ నేను ఇల్లు విడిచిపెట్టాను. ఇంటికి రాసే ఉత్తరాల్లో మర్చిపోకుండా వెంకాయమ్మ గారి క్షేమం అడిగేవాడిని. జవాబులో ముక్తసరిగా ఒకటి రెండు వాక్యాలు రాసేది అమ్మ. దొరికిన ఉద్యోగం చేస్తూ, మంచి ఉద్యోగం వెతుక్కునే రోజుల్లో ఇంటికి రాకపోకలే కాదు, ఉత్తర ప్రత్యుత్తరాలూ తగ్గాయి. ఫలితంగా కొన్నాళ్ళ పాటు ఆవిడ విషయాలేవీ తెలియలేదు నాకు. కొంచం కుదురుకున్నాక ఊరికి వెళ్లాను, రెండు రోజులు సెలవు దొరికితే. వెళ్ళినరోజు సాయంత్రం ఇంటికి వచ్చిందావిడ. “మనవడు గారికి ఈ నానమ్మ గుర్తుందో లేదో అని ఒచ్చాను నాయినా..” అనగానే నాకు సిగ్గనిపించింది. “రేపు నేనే వద్దామనుకుంటున్నానండీ,” అన్నాను.

ఆవిడెందుకో ఇబ్బంది పడుతోంది అనిపించింది కానీ, విషయం పూర్తిగా అర్ధం కాలేదు. “పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయేమో చూసిరా బాబూ,” అంది అమ్మ. నేనక్కడ ఉండకూడదని అర్ధమై, అక్కడి నుంచి మాయమయ్యాను. ఆవిడ వెళ్ళిపోయాక కూడా అమ్మెందుకో ఆ విషయం మాట్లాడడానికి పెద్దగా ఇష్ట పడలేదు.. “వాళ్ళ పరిస్థితి ఇదివరకట్లా లేదు” అంది అంతే.. మళ్ళీ ఏడాది వరకూ ఊరికి వెళ్ళడానికి కుదరలేదు నాకు. ఊళ్లోకి అడుగు పెట్టగానే చిన్నప్పటి జ్ఞాపకాలతో పాటు నానమ్మగారి బెల్లం టీ కూడా గుర్తొచ్చింది. ఈసారి మిస్సవ్వకూడదు అనుకున్నాను.

మర్నాడు మధ్యాహ్నం ప్రయాణమయ్యాను వెంకాయమ్మగారింటికి. “టీ తాగి వెళ్ళు బాబూ..” అంది అమ్మ. ”నీ టీ ఎవరిక్కావాలి.. నేను బెల్లం టీ తాగుతాను,”  అని అమ్మ చెప్పేది వినిపించుకోకుండా వాళ్ళింటికి బయలుదేరాను. “రండి మనవడ గారా.. రండి” ఆవిడ ఎప్పటిలాగే ఆహ్వానించింది. ఆవిడలోనే కాదు, వాళ్ళింట్లో కూడా చాలా మార్పు కనిపిస్తోంది. పాత చీరలో, మెళ్ళో పసుపు తాడుతో ఉందావిడ. నేను చూడడం గమనించి కొంగు భుజం చుట్టూ కప్పుకుంది. మనిషి బాగా వంగిపోయినా మాటలో కరుకుదనం తగ్గలేదు. నరసింహ మూర్తిగారు మంచంలో ఉన్నారు. కొంచం ఇబ్బందిగా అనిపించిది నాకు ఆ వాతావరణం.

“ఉజ్జోగం సేత్తన్నారంటగా.. అబ్బాయి సెప్పేడు. జాగర్త నాయినా.. అమ్మా, నాయినా జాగర్త.. ఆళ్ళ పĺ

×
×
  • Create New...