Jump to content

Mind Blowing Surprising Pre Climax Panjaa


Recommended Posts

Posted

తమిళంలో ‘బిల్లా’తో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విష్ణువర్థన్ తెలుగులో తొలిసారి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘పంజా’. పవన్ కళ్యాణ్ ని ఇప్పటి వరకు చూపించని విధంగా సరికొత్త గెటప్ లో చూపిస్తున్న విష్ణువర్థన్ సినిమాని చాలా స్టైలిష్ గా చేస్తున్నాడట. రిలీజ్ అయిన 'పంజా' రెండు టీజర్స్ లో పవన్ కళ్యాణ్ గెటప్, డైరక్టర్ స్టైలిష్ టేకింగ్ తప్ప ఏమి అంచనా వేయలేకపోతున్నాము. పోలిస్ ఆఫీసర్ పాత్రలో బ్రహ్మానందం కామెడీ బాగా పండించాడని వివిధ న్యూస్లు చెపుతున్నాయి. ప్రత్యేకంగా ఒక సాంగ్ కూడా వున్నట్టు ప్రచారం జరుగుతుంది. మెగా ఫ్యాన్స్, సన్నిహితుల నుండి అందిన సమాచారం ప్రకారం 'మనీ' సినిమాలో ‘వారెవ్వా ఏమీ ఫేసు’ సాంగ్ పవన్ కల్యాణే స్వయంగా పాడగా రీమిక్స్ చేసారని, ఆడియో రిలీజ్ రోజున తెలిసిపోతుందని అంటున్నాడు.
కాగా యాక్షన్, ఎంటర్ టైన్మెంట్ సమపాళ్ళలో మిక్స్ చేసి ‘పంజా’ని తీస్తున్నాడు. ప్రీ క్లైమాక్స్ లో రివీల్ అయ్యే ట్విస్ట్ సినిమాకి చాలా కీలకమైందట. ఒక ప్రాబ్లమాటిక్ ఇష్యూతో ఈ ప్రీక్లైమాక్స్ వుంటుండట. దీనికి ఆడియన్స్ నుంచి వచ్చే రెస్సాన్స్ ని బట్టే సినిమా రిజల్ట్ వుంటుందని తెలుస్తోంది. ‘పోకిరి’లో ప్రీ క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ ని ఎంత థ్రిల్ చేసిందో ఈ సినిమాలోని ట్విస్ట్ ని కూడా ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారని డైరెక్టర్ చెప్తున్నాడు. మరి ఆ ట్విస్ట్ ని ‘పోకిరి’లా బ్లాస్ట్ అవుతుందో లేక ‘కొమరం పులి’లా మిస్ ఫైర్ అవుతుందో వేచి చూడాల్సిందే..

×
×
  • Create New...