Jump to content

Etv Suman Kamedy


Recommended Posts

Posted

[size=5]పి[/size]చ్చెక్కిన ప్రజలారా..! సుమన్ అభిమాన పిశాచులారా..! రండో..రారండో... సుమనుడి తాజా పైత్యం "మమత" [b]కెవ్యూ [/b]( రివ్యూ కాదు ) చదివి తరించి హరించబడండీ.
పేరుకొత్తగా ఉందేంటీ? లేడీ ఓరియంటెడ్ స్టోరీనా? అనుకుంటూన్నారా?? హహహహ్.. "ఐ లవ్యూ డాడీ" కి ఇంకో వెర్షన్ ఇదీ.. (సుమన్ క్యారెక్టర్, అమాయకత్వ్యం ,మంచితనం, గొప్పతనం అలాగే ఉన్నాయ్, మిగిలిన క్యారెక్టర్లూ, వాటి పేర్లూ మారాయి అంతే..) ఎప్పటి లాగానే.. చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్పీ మన చెప్పెట్టుకొనీ మనల్నే కొట్టుకోవలనిపీంచే వందల పేజీల డవిలాగులూ..జీడిపాకం సాగినట్టూ సాగే సీన్లూ డిస్కషన్లతో అబ్బో.. అద్భుతం గా సాగిందీ... మొత్తమ్ రాయాలంటే నా నెక్స్ట్ బర్త్ ఉండదు నాకు.. వీలయినంత టూకీగా చెప్తాను వినుకోండీ..

ఈ టెలీఫిల్మ్ చూస్తాను అనగానే మా ఫ్రెండ్ "రివ్యూ రాయడానికి ఇంతకి దిగజారతావా? ఈ దారుణాన్ని ఎలాగయినా ఆపుతాను మోనిటర్ బద్దలుగొట్టయినా సరే" అని ఆవేశం గా అరవటం తో వాడిని రూమ్ లో పెట్టీ, బయట గెడపెట్టీ, హాల్ లోకొచ్చీ వాల్యూమ్ ఫుల్ గా పెట్టీ కూర్చున్నా..


ఈ సారి ప్రార్ధనా గీతాన్ని మిస్సయ్యాను. కాబట్టీ గుర్తున్న వాళ్ళంతా లేచి నించొని పాడెయ్యండి.

మమత మొదలయ్యింది ఇలా..!
[center][url="http://1.bp.blogspot.com/-aYnG98ReZsE/TgeS72JP8ZI/AAAAAAAAAE8/_UR-UIN6i9Q/s1600/20110626a_010101002.jpg"][img]http://1.bp.blogspot.com/-aYnG98ReZsE/TgeS72JP8ZI/AAAAAAAAAE8/_UR-UIN6i9Q/s400/20110626a_010101002.jpg[/img][/url][/center]



అనగా అనగా క్లాస్ లు జరగని, ఒకే ఒక లేడీ లెక్చరర్ గల ఒక కాలేజ్ లో కలర్ తక్కువ, కళ ఎక్కువ ఉన్న హీరోయిన్ మమత ని "[b]ఆపరేషన్ దుశ్శాసన[/b]" సినిమాకి వెళదాం అని వారం రోజుల నుండీ వాయించేస్తూ ఉంటాది.
మమతేమో.. "లేదూ.. నాకు తెలుగు లో మార్కులు సరిగా రావటం లేదు.. మన భారతీ మ్యాడమ్ దగ్గరకెళ్ళి స్పెషల్ క్లాసులు చెప్పించుకుంటానూ..నువ్ లైబ్రరీ లో లేతగా కనిపించిన కుఱోళ్లకి లైనేస్కో" అని సమ్మగా సలహా ఇచ్చేసెళ్ళి పోతుందీ.

కేమేరా.. తెరచి ఉంచబడిన ఒక తెలుగు పుస్తకమ్ మీదకి ఫోకస్ అవుతుందీ. పేజీలు స్లోమోషన్లో తిప్పబడుతూ ఉంటాయి. ఎరువు తెచ్చిన అరువు కళ్లద్దాలు పెట్టుకొనీ ఒకనాటి మేటి టీవీతార "కృష్ణశ్రీ" ఊఊఊ చదివేస్తూ ఉంటాది.

[b]మమతః[/b] మ్యాడమ్.. నాకు అన్ని సబ్జెక్ట్స్ లోనూ అరవైకి పైన వస్తుంటే, తెలుగు లో థర్టీకి తక్కువ వస్తున్నాయ్. మీరే నాకు ఎక్స్ప్లైన్ చెయ్యాలి. అయినా ఈ పద్యాలూ, ప్రతిపదార్ధాలూ, వ్యాకరణాలు, గ్రామకరణాలు, చెకోడీలూ చందస్సులూ ఈ రోజుల్లో ఏం ఉపయోగపడతాయ్?
[b]భారతీ మ్యాడమ్ః [/b] వాటి గొప్పదనం తెలుసుకోకుండా మాట్లాడుతున్నావ్. సుమన్గారు రాసిన సుమనోహరాలు విని కూడా నువ్వీమాట ఎలా అనగలుగుతున్నావ్? పద్యాలూ, ప్రతిపదార్ధాలూ పానకం చేసి నీ చేత తాగించేసీ, చందస్సు చెవిలో ఊదేసే బాధ్యత నాదీ..
ఏదీ నిన్నటి పద్యం అప్పజెప్పూ..!
[b]మమతః "అంతరంగాలూ......(టిరడిర...టిరడిర) అనంత మానస చదరంగాలూ...ఆ..ఆ...ఆ"[/b]
[b] "అంతే తెలియని ఆలోచనలా సాగరాలు..."[/b]

[b]భారతీ మ్యాడమ్ః[/b] వావ్.... అరుపు..పరుపు..కురుపు.. సూపరు.. సుమనూ...!
[b]మమతః[/b] అలాగా..! అయితే ఈ సంగతి ఇప్పుడే మా డాడీ కి చెప్తాను.. you know one thing madam..? i love my daddy very much. he is my best friend.he is great, greater, greatest.Worst..
(తెలుగు సీరియల్ లో ఇంత ఇంగ్లీషా? అనుకుంటున్నారా? హిహిహి సుమన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ లకి వెళుతున్నాడటా.. ఫలితంగా ఇంగ్లీష్ ఏరులై పారిందీ)
[b]భారతీ మ్యాడమ్ః [/b]నీ సోది సిల్క్ గుడ్డలో కుక్కీ శీకాకుళం పార్శిల్ చెయ్యా.. ఎప్పుడూ నీ బాబు గురించి చెప్తూ బాదేస్తూ ఉంటావ్.! మీ అమ్మగారి గురీంచి చెప్పవేమిటీ?

[b]ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో బాంబులు పేలినట్టూ మ్యూజిక్ దద్దరిల్లి పోతుందీ.[/b].

మమత నల్లులు కుట్టినట్టూ లేచి నించొనీ " plz Dont ask about her. ఆవిడ గురించి అడగొద్దూ..i hate her. నాకు అసహ్యం... వస్తాను" అని లైబ్రరీకి పోతుందీ.
అక్కడ ఫ్రెండేమో బీటెయ్యడానికీ, బిల్లు కట్టడానికీ బకరాలెవ్వరూ దొరకలేదని బాధ పడుతూ..లేటయ్యినందుకూ
గేదె గొంతేసుకొనీ కాసేపు మమతని తిడుతుందీ. మమత "[b][size=4]మా నాన్న సుమన్[/size][/b]" అని మొదలెట్టడంతో " మీ నాన్న చాలా గొప్పల గోవిందయ్యంట కదా.. పిచ్చెక్కిన సైకియాట్రిస్ట్ అంట కదా.. పేషెంట్లని ఇంట్లో పెట్టుకొని మరీ
బలవంతంగా ట్రీట్మెంట్ పేరుతో పీడిస్తాడట కదా.." అని రివెర్స్ గేర్ లో తగులుకొనీ మధ్యలో వాళ్లమ్మ టాపిక్ తీసుకొస్తుందీ. వెంటనే మమతకి B.P బాగా పెరిగిపోయీ ఇందాక భారతీ మ్యాడమ్ దగ్గర వేసిన క్యాసెట్ మళ్ళీ వేసీ "ఆ రాక్షసి గురించీ నా దగ్గర మాట్లాడకు. నా చిన్నప్పుడే
నన్నూ, మా నాన్న ని అనాధల్ని చేసీ తన సుఖం కోసం వేరే వాడితో లేచిపోయిందీ... %&#$%$#& మార్తాం (*(*$#శర్మ=సిగ్గు)@#$ " అని చెప్తూ ఉండటంతో ఆ దరిద్రాన్ని వినలేకా మళ్ళీ మీ నాన్న చాలా గొప్పోడూ అని సోపేసీ ఇంటిదగ్గర కార్లో డ్రాప్ చెయ్యమంటుందీ.

[b]మమతః[/b] పద.. కార్లో కూర్చొ..
[b]ఫ్రెండ్ః[/b] కార్లో కూర్చోకుండా నించుంటారా? మార్తాండ కధలు మీ నాన్న చేత సినిమా తీయించా..!

******************************************************
[b]......హీరో ఇంట్రడక్షన్....[/b]
[b]తలకాయకి తీసిన ఎక్స్రే మీద తల వెంట్రుకలు లెక్కపెడుతూ ఒక చెయ్యి కనిపిస్తుందీ... ఆ చెయ్యి నల్ల చొక్కాకప్పబడిన వీపు చూపిస్తున్న వింత మనిషిది. [/b]నెమ్మదిగా కెమేరా వెనక నుండీ ముందుకు రోలవుతూ సగంలో ఆగిపోతుందీ.. హఠాత్తుగా.. (నేపధ్య సంగీతం హోరెత్తి పోతూ ఉంటాది)
ముఖం నిలువు కోత కి కలర్ పోటో....ఎడమకన్ను... కన్ను కవర్ చేస్తూ సగం కళ్ళజోడూ.. మెరుగులుగల నల్లటీ మీసం నెత్తిన దట్టమయిన విగ్గు. కుడికన్ను క్లోజప్ లో..
ము.ని.కో. కలర్ పోటో.. కుడీ కన్నూ... ఎక్స్రే మీద కుడీచెయ్యి... ము.ని.కో. కలర్ పోటో.. కుడీ కన్నూ... ! ఎనకాల బ్యాక్ గ్రౌడ్ అదిరిపోతూ ఉంటాది.. [b]మండుటేండ లో పిడుగు పడ్డట్టూ[/b] అరివీర భయంకరం గా సుమనోహరుడి దివ్య మంగళ స్వరూపం..
సుమన్ వెనకాల స్క్రీన్ మొత్తం నల్లగా మారిపోతుంది... కళా విహీన, కళా కర్కశ, కళా మర్కట.. నటనా వైకల్య్త, గార్ధభ వాచస్పతి [size=4][b]"సుమన్"... "SUMAN".. "सुमन"...![/b][/size]

******************************************************

ఎదురుగా విధి సీరియల్ అయిపోవటం తో నమ్మలేకా, తట్టుకోలేక కోమాలోకి పోయిన ఒక పేషేంట్, తండ్రిగా పక్కనే పదిపైసలకి రూపాయ్ ముప్పావలా యాక్షన్ చేస్తూ సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.
[b]పేషెంట్ తండ్రిః[/b] సార్.. మీరు మనిషా? చిన్నిక్రిష్ణా? పేషేంట్లదగ్గర అన్నిరకాల టెస్ట్లకీ డబ్బులు లాగే బుద్ధున్న డాక్టర్ లని చూశాను గానీ.. తిరిగి డబ్బ్లు పెట్టీ, మనిషిని ఇంట్లో పెట్టి వైద్యం చేసే బుద్ధి లేని సైకో డాక్టర్ ని మిమ్మల్నే చూశాను. మీరు నిజంగా దేవుడూ బాబుగోరూ..దేవుడూ..!
[b]సుమన్ః [/b] ట్రేడ్ మార్క్ చిరునవ్వు.. ఇందులో నేనేం చేశాను? i love my proffession. పైగా నా దగ్గరకి పేషెంట్స్ ఎవరొస్తారు చెప్పండీ? వచ్చినోళ్ళకి నేను రాసిన కధలు విన్పించీ, తీసిన సీరియళ్ళు చూపించీ పీడించాలంటే ఇదొక్కటే మార్గం.
[b]పేషెంట్ తండ్రిః[/b] మీరు అంతకు తెగించిన అసాధ్యులే దేవరా..! నాకు తెలిసిన ఒక వ్యక్తి మీలాగే లేడీ ఓరియెంటేడ్ కధలు రాస్తూ ఉంటాడు. మీ నెక్స్ట్ సీరియల్ టైటిల్ సాంగ్ కి అతను మొన్న గ్రహణం నాడు పాడిన పాటని పెట్టుకుంటారా?
[b]సుమన్ః [/b] హహహ... అలాగే తప్పకుండా.. కావలిస్తే నేనూ గొంతు కలుపుతాను. అది సరే గానీ ఇదిగో నేను ప్రిస్క్రైబ్ చేసిన మందులు స్నేహ సీరియల్ టైటిల్ సాంగ్ వింటూ ప్రియా పచ్చడి తో కలిపి పూటకి పావుకిలో చొప్పున జుట్టుకు రాస్తూ ఉండండీ. పిచ్చి పెరగకుండా ఉంటాది. పెద్ద కాస్ట్లీ కాదు.
కుదరకపోతే చెప్పండీ నేనే పంపిస్తాను. అవసరమయితే అర్ధరాత్రయినా కాల్ చేయండీ నాకేమన్నా పనా పాటా?

[b]పేషెంట్ తండ్రిః[/b] అమ్మమ్మా.. మీరు మరీ అంతకి బరితెగించొద్దు.. మా మందులు మేమే కొనుక్కుంటాం. ఏది ఏమయినా మీరు ఈటీవీ దేవుడు సార్. [b]ఆ దరిద్రుడు ఓంకార్ గాడు మీముందు అప్పుడే గోకిన గుండు తో సమానం[/b]..
[b]సుమన్ః [/b] పళ్ళు కన్పించకుండా బూరెల్ల్లాంటి బుగ్గలు పొంగడాల్లా పొంగేలా చిరునవ్వు.

వాళ్ళు వెళ్ళిపోయాకా....!
సుమన్ ఏకపాత్రాభినయం... బిగిన్స్...

"ఏమిటీ రోజూ.. మమత ఇంకా రాలేదూ.. సాయత్రం ఆరున్నర అయిపోతుందీ... ఏమ్ చెయ్యాలి ? " అని కాసేపు అటూ ఇటూ తిరిగీ పోన్ వైపు స్లోమోషన్ లో చూసీ కాలేజ్కి ట్రై చేస్తాడు.(పాపం కూతురుకి కార్ కొనిచ్చీ, సెల్ ఫోన్ కొన్నివ్వలేని కటిక దారిద్ర్యం)
"చ్చీ.. చీ.. ఎదవ ఫోనూ.. వెధవ కాలేజూ.. ఎప్పుడూ రింగవ్వదూ.. అయ్యినా ఎవ్వరొ తియ్యరూ...ప్రభాకర్ ఉంటే ఇలా జరిగేదా?" అని కుర్చీ లో కూర్చొని కళ్ళు మూసుకొని బాధ పడుతున్నట్టూ నటీస్తున్నాను అనుకుంటాడు.
ఇంతలో మన చిలిపి మమత మెల్లిగా అడుగులో అడుగేసుకుంటూ వెనకనుండీ వచ్చీ కళ్ళు మూస్తుందీ.. (వెనకాల ఆనందభైరవి రాగమ్ లో వీణ వాయించబడుతూ ఉంటుందీ)

[b]సుమన్ః[/b] ఏమిటమ్మా ఈ ఆటలూ.. నీ గురించి ఎంత కంగారు పడ్డానో తెల్సా?
[b]మమతః[/b] కంగారు దేముంది డాడీ.. ఖాళీ గా ఉన్నప్పుడు పడుదువు గానీ. అయినా నీకిదేం రోగం? నీలాగా కాకుండా నాకు బుఱ లో బ్రెయిన్ అనే పదార్ధం ఉండటం వల్లా తలనొప్పి వస్తుందీ.. నువ్ కలిపిన కాఫీ తాగితే తలనొప్పి ఎగిరిపోతుందీ.. వెళ్ళిపట్రా..
[b]సుమన్ః[/b] ఇది నయమయ్యే రోగం కాదులే ఎప్పటికీ ఇలాగే ఉంటుంది (ఎయిడ్స్ లక్షణాల్లో ఇది కూడా ఉందా? ). అయినా నేను కలిపిన కాఫీ తాగితే లేని తలనొప్పి వస్తుందీ తెలుసా? (కాఫీలో ముల్తానా మట్టి ఏమన్నా కలుపుతాడేమో?)

కాసేపు సీన్ ని బాఆఆఆఆఆఆఆగా సాగదీశాకా(ఓ నాలుగు పేజీల డవిలాగులు) .. కాఫీపెట్టడానికి వెళతాడు.

**********************************************************
కట్.. చేస్తే....

సుమన్ ఈ ఎండాకాలం లో దళసరి దుప్పటి కప్పుకొనీ కడుపుతో ఉన్న దున్నపోతులాగా నిద్రపోతూ ఉంటాడు. "ఒక సినిమాని ముప్పైగంటల నిడివి తో తీసినందుకు గానూ గిన్నీస్ బుక్ లో తన పేరు రాస్తున్నప్పుడూ పెన్ లో ఇంకయిపోయినట్టూ" పీడకలొచ్చినట్టూ
ఏ ఎక్స్ప్రెషనూ లేని ఆ మొద్దుమందారం లాంటి మొహం చిత్ర విచిత్రమయిన సంకోచ వ్యాకోచాలకి లోనవుతుందీ.. ఎవరో అరికాలు మీద అట్లకాడతో వాత పెట్టినట్టూ లేచీ "నా సీరియల్ నా ఇష్టం నేను ఏడుస్తా.." అని ఏడవటం మొదలెడతాడు.

జరగబోయే ఈ సెంటి"[b]మెంటల్[/b]" సీను ని సున్నిత మనస్కులు చూడకూడదని తెలియజేయడానికి సిగ్గుపడుతున్నాను.

[b]మమతః[/b] what happend daddy? why r u crying?
[b]సుమన్ః [/b]నీకు పెళ్లయ్యి, అత్తవారింటికి వెళ్ళిపోయినట్టూ కలొచ్చిందీ. అప్పుడు నేను ఇంతపెద్దింట్లో ఈగలు తోలుకుంటూ ఉండాలి. అందుకే ఇల్లరికం వచ్చే అల్లుడినే వెతుకుతా నీకోసం.
[b]మమతః [/b]కూతురు పెళ్ళయ్యిందని కలొస్తే కళ్ళెమ్మట నీళ్ళు పెట్టుకునే శాల్తీని నిన్నే చూస్తున్నా. నాకు పెళ్ళీ వద్దూ పెనాయిలూ వద్దూ...
[b]సుమన్ః[/b] (విషాద వదనంతో.. గద్గద గాడిద స్వరంతొ..) నువ్ లేకుండా నేను ఉండలేనమ్మా.. నాకు నువ్వూ.. నీకు నేనూ.. అంతే.. (అదేమిటో గానీ శిలావిగ్రహానికి డబ్బింగ్ చెప్తున్నట్టూ సుమను వారి నోరు మాత్రమే కదులుతుందీ)
[b]సుమన్ + మమతః వాఆఆఆఅఆఆఆఆ...... వాఆఆఆఆఆఆఆఆఆఆఆఆఅ.....[/b][left][మా ఫ్రెండ్ : దబ దబా తలుపు బాదేస్తూ.. ఒరేయ్.. ఆపరా.... తలుపులు తియ్యి.. ఆ డవిలాగులు భరించ లేక పోతున్నా.. ఆపకపోతే నీ లాప్టాప్ని మడతెట్టీ కిటికీ లోనుండీ పారేస్తా.. ][/left]




**********************************************************

కాలేజ్ లో... భారతీ మ్యాడమ్ మమత కి అర్ధ రాత్రి రెండింటివరకూ నిద్రపొకుండా రాసిన తెలుగు మెటీరియల్ ఇస్తుందీ. తను ఒంటరి దాన్ననీ ఎవరూ లేరనీ చెప్పటంతో మమత ఆనంద భాష్పాలు + కన్నీళ్ళు మిక్స్ చేసి డ్రాప్ చేసి థాంక్స్ చెప్తుందీ.

**********************************************************
ఇక్కడ నుండీ ప్రజలారా సీన్ లో కనిపించిన ప్రతీ క్యారెక్టర్ అయితే అరుస్తూనో లేకుంటే వికారంగా ఏడుస్తూనో ఉంటాది.[center][url="http://1.bp.blogspot.com/-PB9bcsLLG-c/Tgf0eBG1yHI/AAAAAAAAAFA/wEBf4NYT-F8/s1600/CRY.png"][img]http://1.bp.blogspot.com/-PB9bcsLLG-c/Tgf0eBG1yHI/AAAAAAAAAFA/wEBf4NYT-F8/s400/CRY.png[/img][/url][/center]


ఇంటీకొచ్చేసరికీ.. సుమన్ తన సైజుకి తగ్గ కుర్చీలో కూర్చొని మళ్ళీ ఏడుపు మొహం పెట్టీ వికారంగా ఏడుపు నా జన్మ హక్కూ అన్నట్టూ అరవై ఏళ్ళొచ్చిన అముల్ బేబీ లాగా ఏడుస్తూ ఉంటాడు.

[b]మమతః[/b] మళ్ళీ ఎందుకు డాడీ ఏడుస్తున్నావ్.. నువ్ అలా ఏడుస్తుంటే... I am feeling like crying.
[b]సుమన్ః[/b] ఈ రోజు నవంబరు 5. నాకు బ్లాక్ డే.. ఇందా.. ఈ ఉల్లిపాయ ముక్కలు తీస్కో.. కళ్ళమీద పెట్టుకో.. నా లాగా..
[b]మమతః[/b] నా ఏడుపు తర్వాత .. ముందు నీ ఏడుపు ఎందుకో ఏడు.
[b]సుమన్ః[/b] [b]నా గతం నన్ను పీడిస్తుందీ[/b]. ఈరోజు మీ మమ్మీ నన్నొదిలేసిన రోజు. ఇంకోటీ కూడా ఉందీ. మీ అమ్మ రెండో పెళ్ళి జరిగిన రోజు కూడా ఇదే. సాంప్రదాయాల్నీ, సమాజ కట్టుబాట్లనీ తుంగలో తొక్కీ ([b]నిన్ను తొక్కాల్రా ముందూ[/b]) రెండో పెళ్ళీ చేస్కుందీ. నీ చిన్నప్పుడూ ఇదే రోజు నీ ఆరోగ్యం బాగోలేదూ.. వచ్చి చూడమని బతిమాలితే వాళ్ళాయన ఇంటికొచ్చే టైమ్ లో వచ్చి మూడ్ చెడగొట్టోద్దనీ మొహం మీద తలుపేసేసిందీ. అది మనిషి కాదు పశువు [b](మరే.. అందుకే వీడిని చేస్కుందీ[/b]). i loose control over myself. atleast i can share with you now.
([b]మొహానికి మసి పూసుకొనీ మూగగా రోదించే వాడిలాగా ఫేస్ పెట్టీ[/b]).

[b]మమతః [/b]అసలిదంతా ఎలా జరిగిందీ?
[b]సుమనుః[/b] నేను 24 గంటలూ మీ అమ్మని మోడల్ గా పెట్టీ అందమయిన బొమ్మలేసీ ఆమెకే చూపించేవాడిని. కానీ నా బొమ్మలని అసహ్యించుకొనీ, ఎవరో [b] ఇస్త్రీ వాత పైత్యకధారచయిత[/b] కి అట్రాక్ట్ అయి, తర్వాత అడీక్ట్ అయ్యీ, ఫైనల్ గా ఎలోప్ అయ్యిందీ.
దానికి మన మమత " Life is precious Dad.. అంటే తెలుసు కదా.. నిజంగా She should feel shame about herself & U should celebrate.
[b]"Life is a flow"- జీవితం ఒక ప్రవాహం [/b]" (ఇది కేక డవిలాగ్) అని ఊఊఊ స్పీచ్ దంచేసీ.. రూం లో కెళ్ళీ ఒక లేడీ బొమ్మ గీసీ దానిమీద "[size=4][b]నా తల్లి రాక్షసి"[/b][/size] అని రాసి (ఐ లవ్యూ డాడీ గుర్తొచ్చిందా???)
"You.. Dirty bitch.. donkey.. monkey.. animal.. you will bare for it" అని నానా బూతులూ తిట్టేసీ, దాని మీద క్రాస్ చేసీ, కాలికిందేసి తొక్కీ, ముక్కలు ముక్కలు గా చించేసీ.. అగ్గిపుల్ల రంగదీసి కాల్చేస్తుందీ.. (అబ్బో..ఇలా బూతులు తిట్టే సీన్లు రెండు మూడున్నాయ్.)

*********************************************************
మమతకి తెలుగులో మంచి మార్క్స్ వచ్చేసీ అందుకు గురుదక్షణ గా గిఫ్ట్ ఇవ్వడానికి భారతీమాడమ్ ఇంటికెళుతుందీ.. (ఇక్కడేం జరిగిందీ అన్నదే ట్విస్ట్ అన్నమాట)
*********************************************************


సుమన్ ఒక "బాల గజినీ" ని వీల్ చైర్ లో ఇంటీకి తీస్కొచ్చీ మమత కి పరిచయం చేస్తాడు. ఆ గజినీకి ఎవరూ లేరనీ, ట్రీట్మెంట్ అయ్యేదాకా ఇక్కడే ఉంటాడనీ అంటాడు. వాడేమో ఏదడిగినా తల అడ్డంగా ఊపుతాడు. వీడు అడిగిందే మళ్ళీ మళ్ళీ అడిగి చికాకు పెడతాడు వాణ్ణి కాదు మనల్ని. మూడు నెలలకి గజినీ రజినీ లాగా అవుతాడు. తన కొడుకు గా ఇంట్లోనే ఉంచేసుకుందామ్ అనుకునేంత లో పిల్లాడి తల్లి సుమన్ దగ్గరకి వస్తుందీ తీస్కెళ్ళిపోడానికి.

ఇదే ట్విస్ట్.. ఆ తల్లి ఎవరో కాదు.. మమత వాళ్ల భారతీ మ్యాడమ్..... మరియూ [b]సైకో డాక్టర్ [/b]శరత్ చంద్ర (మన సుమనే..) మాజీ భార్య. (వీడి ట్విస్ట్ తగలడా.. మనకి ఫస్ట్ సీన్ లోనే అర్ధం అయిపోతుందీ.)[left]మాజీ భార్య ని చూడగానే సుమన్ లోని ఎమోషనల్ దెయ్యం నిద్ర లేస్తుందీ.. గొ[b]లుసు తెగిన కుక్క లాగ కేకలేస్తూ, నిగ్రహాన్ని కోల్పోయి, ఆగ్రహం తో ఊగిపోతూ తోక తెగిన డైనోసార్ లాగా అరుస్తూ.[/b].. "నువ్వెందుకొచ్చావ్ ఇక్కడికీ? I dont want to see ur dirty face. just getout"[/left]


ఆపకుండా ఆయాసపడుతూ తిడతాడు. [రౌద్ర రసాన్ని ఏమాత్రం కరుణ లేకుండా కురిపించాడు ] చిత్రం గా భారతీ మ్యాడమ్ నన్ను కాదు అన్నట్టూ అక్కడె నిలుచుంటాది.


[b]సుమన్ః[/b] మమతా.. ఎలా చెప్పాలి నీకూ? ఈ మహా తల్లే నీతల్లి. నాకు [b]"భయంకరమయిన అసహ్యం"[/b] (కొత్త రకం ఫీలింగ్ కదూ..!), ఈ పిశాచి వల్లే "[b] జీవచ్చవం లా జీవనం కొనసాగిస్తున్నాను[/b]" (ఇదెలా సాధ్యం??). ఈ పిశాచి అంటే నాకు చాలా కోపం తో కూడిన మంటా.. ( [b]దొంగకోడి ని వండుకు తినేసీ, ఈకలెక్కడ దాయాలో తెలీని వాడిలాగా ఫేస్ పెట్టీ[/b] )
అదోరకమయిన డవిలాగులు చెప్తాడు.

ఇక్కడ నుండీ ట్విస్ట్ లే ట్విస్ట్ లూ... (కొన్ని వందల పేజీల రిపీటేడ్ డవిలాగులుంటాయ్..అన్నీ రాస్తూ కూర్చుంటే ... యుగాంతం అయ్యే టైమొచ్చేస్తుందీ ;) )

భారతి మ్యాడమ్ తన తల్లే అని ముందే తెలుసనీ, వాళ్ళింట్లో ఉన్న బాల గజిని వాళ్ళబ్బాయే అని, అసలు సుమన్ ద్వారా కి తెలియకుండా ఆ పిల్లాడిని ఇంట్లో పెట్టించింది తనే అని చెప్తుందీ మమత.
[b]సుమన్ః[/b] "నేను కధా, మాటలూ, పాటలూ రాసీ, బొమ్మలేసీ, నిర్మించి, నా దర్శకత్వ పర్యవేక్షణ లో నేనే హీరోగా చేసిన సీరియల్ లో నాకు తెలీకుండా ఇన్ని ట్విస్ట్ లా?" ( నేను ఇంత వెఱి పీనుగ నా? అన్నట్టూ ఫేస్ పెట్టీ )
[b]మమతః[/b] "భారతీ మ్యాడమ్ ఇప్పటికే "[b]పశ్చాత్తాపంతో రగిలి పోతుందీ"(కొత్తగా ఉంది కదా? సుమన్ కలానికి పదునెక్కువ)[/b] ఆవిడ భర్త అప్పుడే చనిపోయాడూ.. నువ్ నీలో ఉన్న ప్రేమికుణ్ణి నిద్రలేపూ.. సుమన్ లా కాకుండా మనిషిలా ఆలోచించూ.. ప్రేమ కు ఎంతో శక్తి ఉందీ.. అన్నిటికన్నా గొప్పది ప్రేమ. దానితో ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కూడా గెలవచ్చు. "
[b] FYI.. నేను మా కాలేజ్ లో ఒకడిని గోకుతున్నాను. వాడిని ఇల్లరికం రమ్మంటే ఎల్లెహే అంటాడూ. వాడితో ఎత్తెయ్యడానికి జెండా కూడా సిద్దం చేస్కుంటున్నా.. "ఈ వయసులో నీకు, అమ్మకీ తోడు అవసరం. మీ కన్న కొడుకు కి మీ ప్రేమ అవసరం (*$#%&*($ &%$# (*%&()విమోచన $&రమణీయ% (*$&#*%&$ (* &%$. నవ (*$#@మందార)౫చెరశాల పైత్య౧౨౭౪౦వితంతు($@+రెల్లివీ($/ " అని చెప్పీ డబ్బాడు జండూబామ్ గ్లాసుడూ నీట్లో కలిపీ సుమన్ చేత తాగిస్తుందీ[/b].
బామ్ ఒక్కటే అయినా పనులు మూడు కాబట్టీ. సుమన్ మూడ్ మారిపోయీ...

[b]సుమన్ః[/b] అవునమ్మా... నేనెంత ఎదవనో నాకిప్పుడే తెలిసిందీ.. మమతని పంచీ సార్ధక నామధేయురాలివి అనిపిమ్చుకున్నావ్. ఎంత గొప్పగా ఆలోచించావ్? I am proud of u.
([b]మనసులోః[/b] దీనెంకమ్మా జీవితం... దీని పెళ్లి కోసం మా ఆవిడకి మూడో పెళ్ళి నాతో చేస్తుందా? పైగా దాని రెండో పెళ్ళయ్యాక పుట్టినోడీని నాకు కన్నకొడుకు అంటుందా? వాఆఅ.. అహ్హాహ్హ్హా....వాఆఆఆఆఆ అహ్హాహాఅ...)

కూతురు దిద్దిన కాపురం తో కధ సుఖాంతం (మన [b]సుఖం అంతమవుతుందీ[/b]) అవుతుందీ[center][url="http://4.bp.blogspot.com/-A8G00ugZirQ/Tgf8awKtbNI/AAAAAAAAAFE/8WTl6-EB8P4/s1600/wp-4100percentlove800.jpg"][img]http://4.bp.blogspot.com/-A8G00ugZirQ/Tgf8awKtbNI/AAAAAAAAAFE/8WTl6-EB8P4/s400/wp-4100percentlove800.jpg[/img][/url][/center]



LOVE IS UNCONDITIONAL & UNIVERSAL

ఎండ్ టైటిల్స్...


source:http://rajkumarneelam2.blogspot.com/2011/06/blog-post_27.html

Posted

vayyamo oka serial ki review enti raa ayya,, kanai intha naa,,

Posted

navva lekha sacha nee reveiw ..writeup super [img]http://i42.tinypic.com/10dik2v.gif[/img][img]http://i42.tinypic.com/10dik2v.gif[/img][img]http://i42.tinypic.com/10dik2v.gif[/img]

Posted

description rachaaaa lepaadu writer ...

×
×
  • Create New...