akhil79 Posted November 13, 2011 Report Posted November 13, 2011 మాస్ మహరాజా రవితేజ హీరోగా డైనమిక్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో డేరింగ్ ప్రొడ్యూసర్ వైవిఎస్ చౌదరి బొమ్మరిల్లు వారి పతాకంపై నిర్మిస్తున్న భారీ చిత్రం ‘నిప్పు’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఆడియోను డిసెంబర్ 13న విడుదల చేయడానికి ప్లాన్ చేశారు. ఈ సందర్భంగా నిర్మాత వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ‘చూడాలనివుంది, ఒక్కడు సినిమాల ద్వారా మణిశర్మ కాంబినేషన్లో మ్యూజిక్‌పరంగా ఓ కొత్త ట్రెండ్‌ని క్రియేట్ చేసి మ్యూజిక్ పట్ల తనదొక డిఫరెంట్ టేస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు మా దర్శకులు గుణశేఖర్. నాకు కూడా సంగీతం పట్ల మంచి అభిరుచి ఉంది. ఇద్దరం కలిసి అవగాహనతో చేస్తున్న ‘నిప్పు’ సినిమా సంగీతంపై మార్కెట్లో, శ్రోతల్లో అంచనాలు భారీగా ఉండటం సహజం. ఈ మధ్య సినీ సంగీత ప్రపంచంలో చిచ్చరపిడుగులా ప్రవేశించిన థమన్‌ని సంగీత దర్శకుడిగా ఎన్నుకోవడంతో మా సినిమా మ్యూజిక్ మీద అంచనాలు మరింత పెరిగాయి. థమన్ కూడా రవితేజ ‘కిక్’ నుండి హీరో రవితేజకు మంచి సంగీతం అందిస్తూ వస్తున్నాడు. అందుకని ఈ చిత్రాన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని చాలా మంచి మ్యూజిక్ అందించాడు. అలాగే ముందుగా ప్రకటించినట్లుగానే ఈ చిత్రాన్ని జనవరి 13న సంక్రాంతి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం’ అన్నారు. రవితేజ సరసన దీక్షాసేథ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్, ప్రదీప్‌రావత్, బ్రహ్మానందం, కృష్ణుడు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ముకుల్‌దేవ్, బ్రహ్మాజీ, సుప్రీత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: థమన్, సినిమాటోగ్రఫీ:సర్వేష్ మురారి, ఆర్ట్: ఆనంద్‌సాయి, ఎడిటింగ్: గౌతంరాజు, ఫైట్స్: కనల్‌కణ్ణన్, డ్యాన్స్: రాజు సుందరం, బృంద, గణేష్ తరుపాయ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.ఆర్.కిషోర్, కో-ప్రొడ్యూసర్స్: యలమంచిలి యుక్త, యలమంచిలి ఏక్తా, సమర్పణ: యలమంచిలి గీత, నిర్మాత: వై.వి.ఎస్.చౌదరి, కథ-స్క్రీన్‌ప్లే-దర్శకత్వం: గుణశేఖర్.
Rambob Posted November 13, 2011 Report Posted November 13, 2011 మాస్ మహరాజా రవితేజ మాస్ మహరాజా రవితేజ
Recommended Posts