akhil79 Posted November 16, 2011 Report Posted November 16, 2011 నాగార్జున తాజాగా వీరభద్రం చౌదరి చిత్రం ఓకే చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పూలరంగడులో బిజీగా ఉన్న వీరభధ్రం చౌదరి తన తదుపరి చిత్రానికి సంబంధించి స్క్రిప్ట్ రైట ర్స్‌ని కూర్చొపెట్టుకుని రెడీ చేసుకుంటున్నాడు. ‘అహనా పెళ్లంట’ చిత్రంతో విజయం సాధించిన వీరభద్రంకి నాగార్జున డేట్స్ ఇవ్వటానికి కారణం అతను చెప్పిన టైటిల్ ‘భాయ్’ అని తెలుస్తోంది. ఈ టైటిల్‌ని ఫిలిం ఛాంబర్‌లో వీరభద్రమ్ రిజిస్ట్టర్ చేసారు. కామెడీతో కలగలసిన యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుందని తెలుస్తోంది. మాస్, బాస్, కింగ్, డాన్ తరహాలో ఈ టైటిల్‌ని పెట్టడం జరిగింది. ఇక ప్రస్తుతం నాగార్జున ‘డమురకం’ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. శ్రీనివాస రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనూష్క చేస్తున్న విషయం విదితమే. షూటింగ్ పూర్తయిన ‘రాజన్న’ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయనున్నారు.
Recommended Posts