Jump to content

It is legal to download 3Idiots after...


Recommended Posts

Posted

సినిమా విడుదలయీ అవగానే ఇంటర్ నెట్ లోని వెబ్ సైట్స్ లో ఆ చిత్రానికి సంబంధించిన పైరేటెడ్ కాపీలు ఫ్రీ డౌన్ లోడ్ కి లభిస్తున్న సంగతితెలిసిందే. ఈ ఆన్ లైన్ పైరసీని అదుచేయటమనేది దాదాపు అసంభవంగా కనిపిస్తున్న నేపథ్యంలో తన చిత్రాన్ని యూ టూబ్ సైట్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకొని చూడండి అని ఒక నిర్మాత చెప్పటం చూస్తే ఆశ్చర్యమేస్తుంది. కానీ ఇది నిజమే. అమీర్ ఖాన్, కరీనా కపూర్, షర్మాన్ జోషి, మాధవన్ ప్రథాన పాత్రలు పోషించగా,రాజ్ కుమార్ హర్మానీ దర్శకత్వంలో విధు వినోద్ చోప్రా నిర్మించిన చిత్రం "3 ఇడియట్స్".ఈ చిత్రాన్ని విడుదలైన 12 వారాల తర్వాత యూ ట్యూబ్ నుండి ఫ్రీగా డౌన్ లోడ్ చేసుకోవచ్చని నిర్మాతే తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఆన్ లైన్ పైరసీని ఆపొచ్చని ఆయన ఊహ కావచ్చు.

×
×
  • Create New...