wolverine Posted December 7, 2011 Report Posted December 7, 2011 [b]* 2001లో కేసీఆర్ రాజీనామాతో సిద్దిపేటలో ఉప ఎన్నిక * 2004లో సాధారణ ఎన్నికలు * 2004లో కేసీఆర్ రాజీనామాతో సిద్దిపేటలో ఉప ఎన్నిక * 2006లో కేసీఆర్ రాజీనామాతో కరీంనగర్ లో ఉప ఎన్నిక * 2008లో టిఆర్‌ఎస్ రాజీనామాలతో 4 ఎంపీ, 16 ఎమ్మెల్యే స్థానాల్లో ఉప ఎన్నికలు * 2010లో టి -రాజీనామాలతో 12 స్థానాల్లో ఉప ఎన్నికలు * 2011లో పోచారం రాజీనామాతో బాన్సువాడ ఉప ఎన్నిక * 2012లో ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలు ? * పదేళ్లలో తొమ్మిదోసారి ఉప ఎన్నికలు * టి -రాజీనామాలతో ఐదు స్థానాలు ఖాళీ * ఎమ్మెల్యే మరణంతో మహబూబ్‌నగర్‌లో అనివార్యమైన ఎన్నిక * కొండా సురేఖ అవిశ్వాసంతో పరకాలలో బైపోల్ * మహబూబ్‌నగర్‌లో 3, వరంగల్‌లో 2.... * ఆదిలాబాద్ , నిజామాబాద్‌ల్లో ఒక్కో స్థానాల్లో ఉప ఎన్నిక * తెలంగాణాలో తొలిసారి రంగంలోకి దిగనున్న వైఎస్సార్ కాంగ్రెస్ * టిడిపి సిట్టింగ్-3, కాంగ్రెస్ సిట్టింగ్-౩ స్థానాలు * నాగర్ కర్నూల్‌లో నాగంకు మద్దతు * 6 స్థానాల్లో సత్తా చాటే వ్యూహంలో టిఆర్‌ఎస్ * మహబూబ్‌నగర్ స్థానంపై టిఆర్‌ఎస్, బిజెపి పోటాపోటీ * అధికార, ప్రతిపక్షాలకు జీవన్మరణం * టిఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌లకు సవాల్ [/b] తెలంగాణాలో మరోసారి ఉప ఎన్నికలకు తెరలేవనుంది. ఏడు స్థానాల్లో జరుగనున్న ఈ ఉప ఎన్నికలు కాంగ్రెస్, టిడిపిలకు జీవన్మరణ సమస్యగా మారగా... టిఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్‌కు సవాల్‌గా మారనున్నాయి. తెలంగాణాలో మరోసారి ఉప పోరుకు తెరలేవనుంది. 2001లో కేసీఆర్ రాజీనామాతో సిద్దిపేటలో తొలిసారి ఉప ఎన్నిక జరగగా...ఇక అప్పటినుండి ప్రతిసారీ తెలంగాణా కోసం జరుగుతున్న రాజీనామాస్ర్తాలతో బైపోల్స్ జరుగుతూనే ఉన్నాయి. 2004 సాధారణ ఎన్నికల తర్వాత....కేసీఆర్ రాజీనామాలతో కరీంనగర్ లోక్‌సభకే రెండు సార్లు ఉప ఎన్నికలు జరిగాయి. ఇక 2008లో టిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీల రాజీనామాలతో 16 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. తాజాగా 2010లోనూ తెలంగాణాకోసం 12 మంది ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయగా...అక్కడా మరోసారి ఎన్నికలు జరిగాయి. ఇక రెండు నెలల క్రితం టిడిపి ఎమ్మెల్యే పోచారం రాజీనామాతో బాన్సువాడలోనూ బైపోల్ జరుగగా... తాజాగా మరోసారి ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలకు రంగం సిద్దమౌతోంది. తెలంగాణాలోని ఏడు స్థానాల్లో ఉప ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్దమౌతున్నాయి. తెలంగాణ కోసం ఎమ్మెల్యేలు నాగం, జూపల్లి, గంప గోవర్ధన్, రాజయ్య, జోగు రామన్నలు రాజీనాలు చేశారు. ఇందులో నాగర్ కర్నూలు నుండి స్వతంత్రంగా రంగంలోకి దిగేందుకు నాగం జనార్ధన్‌రెడ్డి సిద్దమౌతుండగా...నాగంకు మద్దతిచ్చే యోచనలో టి జెఎసి ఉంది. దీంతో ఇక్కడి నుండి టిఆర్‌ఎస్ పోటీకి దిగే అవకాశాలు లేవు. ఇక ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డి మృతితో మహబూబ్‌నగర్ స్థానానికి కూడా ఉప ఎన్నిక జరునుంది. ఇండిపెండెంట్‌గా గెలిచిన రాజేశ్వర్‌రెడ్డి...ఆ తర్వాత కాంగ్రెస్ అనుబంద సభ్యునిగా కొనసాగుతూ వచ్చారు. అయితే గతంలో ఉన్న సంబంధాల దృష్ట్యా రాజేశ్వర్‌రెడ్డి భార్యను తమ పార్టీ తరఫున రంగంలోకి దించేందుకు బిజెపి ప్రయత్నిస్తోంది. అదే జరిగితే ఇక్కడి నుండి టిఆర్‌ఎస్ తప్పుకోక తప్పదు. రాజేశ్వర్‌రెడ్డి భార్య రంగంలోకి దిగకున్నా ఈ స్థానాన్ని తమకు కేటాయించాలని...మిగిలిన స్థానాల్లో టిఆర్‌ఎస్‌కు తాము మద్దతిస్తామని బిజెపి కోరే అవకాశాలున్నాయి. దీనిపై జెఎసి, టిఆర్‌ఎస్ స్పందనను బట్టే బిజెపి ఓ నిర్ణయానికి వచ్చే అవకాశాలున్నాయి. ఇక అవిశ్వాస తీర్మాణానికి అనుకూలంగా విప్‌ను దిక్కరించి ఓటేసిన ఎమ్మెల్యే కొండా సురేఖపై అనర్హత వేటు పడే అవకాశాలు కన్పిస్తున్నాయి. దీంతో పరకాల బరిలో తొలిసారి వైఎస్సార్ కాంగ్రెస్ రంగంలోకి దిగనుంది. అయితే తెలంగాణావాదం బలంగా ఉన్న ఈ స్థానంపైనా టిఆర్‌ఎస్ కన్నేసింది. ఇక ఏడు స్థానాల్లోనూ టిడిపి, అధికార కాంగ్రెస్‌లు రంగంలోకి దిగనున్నాయి. తెలంగాణాలో బలమైన శక్తిగా మరోసారి చాటుకునేందుకు టిఆర్‌ఎస్ సిద్దమౌతుండగా...తెలంగాణాలోనూ వైఎస్ ఇమేజీని చాటి చెప్పేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహరచన చేస్తోంది. దీంతో తెలంగాణాలో తొలిసారిగా చతుర్ముఖ పోటీ నెలకొనడం ఖాయంగా కన్పిస్తోంది. ఈ ఉప ఎన్నికలే 2014కు ట్రయల్‌గా మారనుండటంతో అన్ని పార్టీలూ సర్వశక్తులూ ఒడ్డక తప్పని పరిస్థితి ఏర్పడింది.
Recommended Posts