Jump to content

Recommended Posts

Posted

3 దశాబ్దాలుగా చిరంజీవి నట జీవితంతో పెనవేసుకున్న అభిమాన సంఘాల నాయకులు చిరంజీవి .. రాజకీయాలలోకి వస్తారని తెలవడంతో వారి ఆనందం ఉరకలు వేసింది.  పార్టీ పెట్టక ముందు సంవత్సరము నుంచి అభిమాన సంఘాల నాయకులు చిరంజీవి గురించి వారి వారి ప్రాంతాలలో చిరంజీవి రాజకీయాలలోనికి వస్తారని ఉహాగానాలు రావడంతోనే, ఆయన గురించి ప్రజలలో మంచి స్పందన తెచ్చారు.  అంతకు ముందు చిరంజీవి తలపెట్టిన రక్తదాన శిబిరములు, మరీ ఇతర  కార్యక్రమాలను  దిగ్విజయంగా జరిగాయి అంటే అది అభిమాన సంఘాల నాయకుల కృషి ఫలితమే అని ఎన్నో సంధర్భాలలో చిరంజీవి కూడా ఒప్పుకోవటం జరిగింది.

  చిరంజీవి రాజకీయాలలోకి వచ్చిన తరువాత అభిమానులకి చిరంజీవికి మధ్య దూరము పెరుగుతూ పోయింది.  ఎన్నికలు సమీపిస్తున్న తరుణములో ఆ దూరము ఇంకా ఎక్కువైంది.  ఈ దూరము పెరగటానికి అనేక కారణాలు ఉన్నాయి.  కొన్ని కారణాలు రాజకీయ సమీకరణాల వలన, మరికొన్ని చిరంజీవి పూర్తిగా రాజకీయాలలో నిమగ్నమై అభిమానులతో సంభంధాలు తగ్గించుకోవటము వలన దూరము పెరిగింది.  ముఖ్యముగా ఎన్నికల  జాబితాలో అభిమాన సంఘాల నాయకులలో సీట్లు రాకపోవటానికి చిరంజివీపై ద్వేషము లేకపోయినా అల్లు అరవింద్ పై పూర్తి ద్వేషము ఉంది.  చిరంజీవి అభిమానులమైన తమకు అల్లు అరవింద్ సీట్లు రాకుండా అడ్డుకున్నారని, సీట్లు డబ్బులు ఉన్నవారికి అమ్ముకున్నారని వారు ఆరోపణలు చేస్తున్నారు.  ఏ ఇద్దరు ముగ్గురు నాయకులు ఈ ఆరోపణలు చేస్తే సీట్లు రాక ఆరోపణలు చేస్తున్నారని సరిపెట్టుకోవచ్చు.  కానీ పార్టీ నుంచి బయటికి వచ్చిన ప్రతి నాయకులు ఇవే ఆరోపణలు చేస్తుంటే కొంతైనా నిజం ఉండి ఉండే అవకాశం ఉండదా? అని అభిమానులు అంటున్నారు.  ఇప్పుడు విడుదల చేసిన జాబితాలో అభిమాన సంఘాల నాయకులకి అల్లు అరవింద్ మొండిచేయి చూపించారని ఆ నాయకులు ఆరోపిస్తున్నారు.

    వారికి ఇప్పుడు చిరంజివీపై అభిమానము ఉన్న తమకు అన్యాయం చేసి ఇతరులకి సీట్లు అమ్ముకున్న అల్లు అరవింద్ కి సిగ్గు వచ్చే విధంగా ఇండిపెండెంటుగా అభిమాన సంఘాల నాయకులంతా బరిలోకి దిగి అల్లు అరవింద్ సీట్లు ఇచ్చిన వారిని ఓడించడానికి  కంకణం కట్టుకున్నారు.  వీరికి  తోడు పార్టీ పెట్టినప్పటినుంచీ తమ ప్రాంతాలలో పార్టీకి  విశిష్టతమైన కృషి చేసిన వారిని లెక్కలోనికి తీసుకోకుండా నిన్న కాక మొన్న వేరే పార్టీలోంచి బయటికి వచ్చిన నాయకులకి సీట్లు ఇచ్చి తమకు అన్యాయం చేస్తున్నారని విమర్శించిన వారు కూడా ఎన్నికలలో  ఇండిపెండెంటుగా పోటీచేసి అల్లు అరవింద్ సీట్లు ఇచ్చిన అభ్యర్ధులను ఓడించడానికి సిద్దపడుతున్నారు.

  చివరకు అల్లు అరవింద్ ఎక్కడ పోటీ చేసిన ఓడిస్తామని బాహాటంగానే చెబుతున్నారు.  చిరంజీవి  అభిమానులు ఎంతోమంది ప్రమాదాలలో అసువులు బాసారు.  అభిమానులకి చిరంజీవిని  కలిసే అవకాశము కూడా ఇవ్వటం లేదని  అభిమానులు వాపోతున్నారు.  అభిమానులు ఎదురు తిరిగితే అధికారిక అభ్యర్ధుల అపజయానికి కృషి చేస్తారని పరిశీలకులు భావిస్తున్నారు.  ఏది  ఏమైన చిరంజీవి పార్టీలో అభిమానులని చిన్న చూపు చూస్తున్నారని అంటున్నారు

Posted

siru gaduuu mental fans fools ni chesaduu.....

Posted

vallu ippudu kothaga fools ayyedhi enti 25 years nunchi fools gane vunnaru gaaaa.  h!~ h!~ h!~ h!~ h!~ h!~ h!~

×
×
  • Create New...