Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిందే సామాజిక న్యాయం అనే నినాదంతో అనేది రాష్ట్రంలో ప్రజలందరికీ ..

తెలిసిన విషయము అయితే సామాజిక న్యాయము ప్రజారాజ్యములో లేదని పార్టీలో అసంతృప్తికి గురి అయిన నేతలు ఇదే విమర్శ చేసి బయటికి వెళ్ళిపోతున్నారు.  ఈ విమర్శలో ఎంతవరకు వాస్తవం ఉందని ప్రతిఒక్కరి మదిని తొలుస్తున్న ప్రశ్న.

  నిజంగానే సామాజిక న్యాయము లేదు అని ప్రతిపక్ష నాయకులు చెబుతున్నారు.  వారు చెబుతున్న కారణాలు నిజంగానే సామాజిక న్యాయము లేదా అనేందుకు ఆధారాలు కనబడుతున్నాయి. పార్టీలో ఎక్కువ పదవులు చిరంజీవి బందువులే అనుభవిస్తున్నారు.  మిగిలిన ప్రధాన పార్టీలు అయిన కాంగ్రెస్ తెలుగుదేశంలలో ఈ విధముగా పార్టీ అధినేత బంధువులు పదవులలో లేకపోవడంతో ప్ర రా పా పై వేలెత్తి చూపించడానికి ఆస్కారము దొరుకుతోంది.

  అధికారములో ఉండగా తెలుగుదేశం అధినేత చుట్టాలు, బంధువులను దూరముగా ఉంచి, స్వంత సోదరుడుతో కూడా విరోధము తెచ్చుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వై యస్ కూడా నేరుగా ఎవరిని పార్టీ పదవులలో కూర్చో బెట్టిన ధాఖలాలు లేవు.  కానీ ప్రజారాజ్యములో మాత్రము అన్ని పదవులు చిరంజీవి  బంధువులు ఆక్రమించారని ప్రతి ఒక్కరూ వేలెత్తి చూపిస్తున్నారు. 

  ప్రజారాజ్యం అధ్యక్షుడిగా చిరంజీవి, యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాణ్, ప్రధాన కార్యదర్శిగా అల్లు అరవింద్, కార్యదర్శిగా బడే రవి, ఇంకా కొన్ని అనుబంధ సంఘాలకి అల్లు అరవింద్  బంధువులే ఉండటము వలన చిరంజీవి కొంత విమర్శలు నెదుర్కోవలసి వస్తుందని అంటున్నారు చిరంజీవి అభిమానులు.

  ముఖ్యముగా ప్రతిపక్షాలకి అస్త్రాలుగా ఇటువంటివి దోహదమూ చేస్తున్నాయి.  ఇటువంటి వాటికీ చిరంజీవి దగ్గర బదులు ఉండటం లేదని అంటున్నారు.  ఏదిఏమైన చిరంజీవికి ముందు ముందు ఇటువంటి విషయాలలో తలనొప్పులు కూడా రావచ్చును అని పరిశీలకులు అంటున్నారు. 

×
×
  • Create New...