Jump to content

Recommended Posts

Posted

భీమవరం: పశ్చిమ గోదావరి జిల్లాలో తొలి ప్రజారాజ్యం టిక్కెట్‌ ఆయనకే వస్తుందని అంతా ఆశించారు. చిరంజీవి మిత్రుడే కదా సత్యప్రసాద్‌కు గ్యారంటీ అని అనుకున్న అందరి అంచనాలకు స్వయంగా చిరంజీవే బ్రేక్ వేశారు. నా మిత్రుడు సేవ చేయడానికే వచ్చాడు. ఆయనకు టిక్కెట్‌ ఇవ్వను, అధికారంలోకి వచ్చాక మరో విధంగా గౌరవిస్తాం అంటూ స్వయంగా చిరంజీవి ప్రకటించడంతో డాక్టర్‌ సత్యప్రసాద్‌ అభ్యర్థిత్వం తెర వెనక్కు వెళ్ళిపోయింది.

చిరంజీవి మిత్రుడు డాక్టర్‌ సత్యప్రసాద్‌ జిల్లా పార్టీ కన్వీనర్‌గా ఎన్నికైనప్పుడు అంతా టిక్కెట్‌ ఆయనకే అని భావించారు. చివరి వరకు ఆయన భీమవరం బరిలో ఉన్నారు. ఆయన కాకపోతే ఆయన భార్యకు కూడా ఇవ్వవచ్చని అంచనా వేశారు. మరో 24 గంటల్లో నామినేషన్‌ గడువు ఉందనగా తన మిత్రుడికి టిక్కెట్‌ ఇవ్వనని చిరంజీవి చేసిన ప్రకటనతో సస్పెన్స్‌ వీడిపోయింది.

×
×
  • Create New...