Jump to content

Recommended Posts

Posted

భీమవరం: పవన్ కల్యాణ్ పరిపక్వత గల రాజకీయ నాయకుడిగా ఎదుగుతున్న క్రమంలో సొంత జిల్లా అయిన పశ్చిమ గోదావరిలో కొన్ని పాఠాలు నేర్చుకున్నారు. కొందరు స్ధానిక నాయకులు ఆంతరంగిక సమావేశంలో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో ఆయన కోపం వచ్చి తన క్యాంప్ ను మార్చుకోవలసి వచ్చింది.

తన కుటుంబానికి ఆయువుపట్టుగా ఉన్న ఈ జిల్లాలో తాను పాల్గొనే సభలు రికార్డు సృష్టిస్తాయని అంచనా వేసుకున్నారు. నిర్వాహకులు ఇదే ధీమాను వ్యక్తంచేశారు. చిరు సొంత గడ్డలో పీఆర్‌పీకి విశేష ప్రజాదరణ ఉందని ఆ మేరకు 'తమ్ముడు' సభలకు జనం నీరాజనాలు పలుకుతారన్న దిశగానే పార్టీ వర్గాలు అంచనా వేశాయి. ఆది నుంచి పార్టీ నేతల్లో సమన్వయ లోపం కాస్తా సభలపై ప్రభావం చూపింది.

నేతల అతి విశ్వాసం కూడా దీనికి తోడైంది. ఫలితంగా ఏలూరు, భీమవరంలో జరిగిన బహిరంగ సభలకు నాయకుల అంచనాలను తలకిందులు చేస్తూ హాజరైన జనం పీఆర్‌పీని దిమ్మెరపోయేలా చేసింది. ఎవరు మటుకు వారు ఈ ఇమేజ్‌పై ఆధారపడి జన సమీకరణలో చేసిన అలక్ష్యం కాస్తా పవన్‌ సభలపై పొడచూపింది. తొలిసారిగా ఈ జిల్లాలో కాలిడిన పవన్‌కు యువతరం నీరాజనాలు పలికినా పార్టీ ఆశించిన రీతిలో జన సమీకరణ లక్ష్యాలను మాత్రం చేరుకోకపోవడం అందరినీ విస్మయపరిచింది. వివిధ నియోజకవర్గాల నేతల మధ్య సమన్వయ లోపం, అవగాహన రాహిత్యం కూడా బట్టబయలైంది. ఏలూరులో జరిగిన సభకు జనం అంతంత మాత్రంగానే హాజరుకాగా, భీమవరం సభకు మాత్రం ఓ మోస్తరుగా హాజరుకావడం కూడా పీఆర్‌పీలో చర్చనీయాంశం అయింది.

యువరాజ్యం అధినేత భీమవరంలో జరిగిన సభకు రెండున్నర గంటల ఆలస్యానికి దారితీసింది. ఆయన ప్రసంగాల్లో వాడీవేడీ కార్యకర్తలను ఆకట్టుకుంది. అయితే ఈ పర్యటనలో ఆశావహుల తీరును ప్రశ్నించేదిగా మారింది. తొలిరోజు పర్యటనలో అపశృతులు దొర్లడంతో యువరాజ్యం అధినేత పవన్‌ కళ్యాణ్‌ బుధవారం రాత్రి భీమవరం నుంచి అర్ధంతరంగా నిష్క్రమించారు

×
×
  • Create New...