Jump to content

Recommended Posts

Posted

ప్రజారాజ్యం పార్టీలో అసలేం జరుగుతోంది? ఆ పార్టీ పయనమెటు? ఏమౌతోంది? ఆ పార్టీ పరిణామాలు పత్రికలకెక్కుతున్న తీరును చూసిన వారిలో వేధిస్తున్న ప్రశ్నలు.

మొదట సామాన్య నటుడుగాఉన్న చిరంజీవికి తమ అభిమానాన్నే ఉక్కు కవచంగా మలిచి 30 ఏళ్లలో మెగా స్టార్‌ స్థాయికి పెంచిన చిరంజీవి అభిమాన సంఘాలకు పార్టీ టికెట్ల పంపిణీలో గుండుసున్నా చుట్టారు. మెగాస్టార్‌ చిరంజీవి ఆహ్వాన సంఘాల రాష్ర్ట అధ్యక్షుడు వెంకటేశ్వర రావుకు మొండిచేయి చూపారు. ఆవేదన నిండిన హృద యంతో వెంకటేశ్వరరావుతోపాటు కార్యదర్శి గణపతి కూడా తాజాగా ప్రజారాజ్యంపై దుమ్మెత్తి పోస్తూ అంతే వేగంతో కాంగ్రెస్‌ పార్టీలో చేరిపోయారు.అభిమానులకు మొండిచేయి చూపారని కుటుంబ పెత్తనం ఎక్కువై ఆది నుంచి చిరును అంటిపెట్టుకున్న అభిమానులను పక్కకుపెట్టి టికెట్లు అమ్ముకున్నారంటూ ధ్వజమెత్తారు. పార్టీలో అభిమానులకు జరిగిన మోసాన్ని వివరించేందుకు ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్త పర్యటన లకు వెళుతున్నట్లు ప్రకటించడం చిరంజీవి ఇమేజిని పూర్తిగా డామేజీ చేయడమే కాకుండా పార్టీని పూర్తిగా భ్రష్టుపట్టించేలా ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ హఠాత్‌ పరిణామాలు చిరు అభిమానులను రాజ్యం నుంచి పూర్తిగా దూరం చేసేవేనన్న వ్యాఖ్యలు వినిపిస్తు న్నాయి. రాజకీయ వ్యూహరచయితగా పేరొందిన సీని యర్‌ నేత పర్వతనేని ఉపేంద్ర శివశంకర్‌కు ప్రాధాన్యం తగ్గించి టికెట్ల పంపిణీలో పక్కన పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్న వాసిరెడ్డి పద్మ తనకు జరిగిన అన్యాయానికి ఆవేదనతో రగిలి పోతున్నారు. కేశినేని నాని కటారి ఈశ్వరకుమార్‌ జుగల్‌ కిషోర్‌ కొడిత్యాల లక్ష్మణరావు వంటి వారు ఇప్పటికే పార్టీలో పెత్తనం సాగిస్తూ వచ్చిన అల్లు అర వింద్‌పై టికెట్లు అమ్ముకుంటున్నారన్న ఆరోపణలతో పార్టీని విడిచి వెళ్లారు. ప్రముఖ వైద్యుడిగా గుర్తింపు తెచ్చు కున్న డాక్టర్‌ సమరం కూడా తీవ్ర మనస్తాపానికి లోన య్యారు. ఆయన కూడా తాజాగా అసమ్మతి స్వరం వినిపించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐపిఎస్‌ అధికారి ఆంజనేయరెడ్డి శనివారం పార్టీకి రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. చిరు పర్యటన రూట్‌ మ్యాప్‌ రక్షణ వ్యవహారాలు చూసే ఆయన గాడి తప్పు తున్న పార్టీ వ్యవహారాలు అధినేత ఆయన బంధువుల తీరుపై అసంతృప్తితో పార్టీ నుంచి వెళుతున్నట్లు ప్రకటించారు.పార్టీకి నిస్వార్ధంగా సేవలందించిన మిత్రా పరకాల ప్రభాకర్‌ దారి ఎటు అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అభ్యర్థుల ఎంపికలో వారిద్ద రినీ పక్కకుపెట్టి కేవలం టికెట్లు రాని వారిని బుజ్జగించే బాధ్యతలు మాత్రమే అప్పగించడంపై అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. వీరిద్దరూ బహుశా ఈ వారంలో ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

. పార్టీకి మహిళా విభాగం అధ్యక్షులుగానే కాకుండా ప్రత్యర్థి పార్టీలను సమర్థవంతంగా ఎదుర్కొనే ధీరోదాత్తత ప్రదర్శించిన శోభారాణిని సైతం పార్టీ అధిష్ఠానం టిక్కెట్ల పంపిణీలో పక్కన పెట్టింది.ఇక మిగిలిన వారి సంగతి సరేసరి. జనాభాలో సగం ఉన్న మహిళలే ప్రజారాజ్యం పార్టీకి ప్రాణం అంటూ పదే పదే చెబుతూ వచ్చిన చిరంజీవి చివరకు మహిళలకు కేటాయించిన సీట్లు 10శాతం లోపే.

Posted

chivariki migiledi sirio gaadu okkade suicide chesukopoteeee............. ^^" ~"!

×
×
  • Create New...