satish12 Posted January 12, 2010 Report Posted January 12, 2010 [img]http://teluguone.com/news/wp-content/uploads/2010/01/Junior-NTR.jpg[/img]తిరుపతి: జూనియర్ ఎన్టీఆర్ మంగళవారం తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. ఎన్టీఆర్ సాంప్రదాయబద్ధంగా పంచెకట్టు, నుదుటన తిరుచూర్ణం ధరించి వెంకన్నను దర్శించుకున్నారు. ఏ ప్రాంతానికీ తాను వ్యతిరేకం కాదనీ, అందరి ప్రేమ, వాత్సల్యం, అభిమానంతోనే ఈ స్థాయికి వచ్చాననీ, తన తాజా చిత్రం విడుదలను అడ్డుకోకుండా ఆదరించాలనీ తెలంగాణ వాదులకు విన్నవించిన జూనియర్ ఎన్టీఆర్ మంగళవారంనాడు తిరుమలలోని శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ‘అదుర్స్’ చిత్రాన్ని అడనివ్వమంటూ హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో ఎన్టీఆర్ తెల్లవారుజామున మూడు గంటలకు శ్రీవారిని దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. సంక్రాంతికి విడుదలవుతున్న తన సినిమాకు ఎలాంటి అడ్డంకులు ఎదురుకాకుండా చూసి విజయవంతం చేయాలని ఎన్టీఆర్ శ్రీవారికి విన్నవించుకున్నారు. ఎన్టీఆర్ వెంట ఆయన స్నేహితులు కూడా వున్నారు. ఎన్టీఆర్ తో ఆశ్వనీదత్ నిర్మించనున్న ‘శక్తి’ చిత్రం స్క్రిప్టును చిత్ర దర్శకుడు మెహర్ రమేష్ స్వామి పాదాల ముందు ఉంచి పూజలు జరిపించారు.
Recommended Posts