pacchipulusu Posted April 10, 2012 Report Posted April 10, 2012 హెచ్చరిక : మీరు గుండె జబ్బులు ఉన్నవారైతే , మీకు నరాల బలహీనత ఉన్నట్లయితే , మీరు గర్భంతో ఉన్నా మీరు బలహీన మనస్కులైనా , ఈ సినిమా చూడవద్దు . అభ్యర్ధన : మీరు మెగా ఫ్యామిలీ ను , వారి వంశాన్ని ( దీనెమ్మ జీవితం .. ఇది నా మనసులో అనుకుంటున్నాను అని మీరు అర్ధం చెసుకొనగలరు ) ప్రేమించే , అభిమానించే వారైతే దయచేసి ఈ రివ్యూ చదివి నన్ను బూతులు తిట్టడం కాని , పరువు నష్టం దావా వెయ్యటం కాని చెయ్యవద్దని నా ప్రార్ధన . సంపత్ నంది డైరెక్టర్ గా తీసిన ఈ చిత్ర రాజము , ఒక కలికితు రాయి . ఆడియో ఫంక్షన్ చూసి ఇదేదో యాక్షన్ సినిమా అని వెళ్తే ..ఆశ్చర్య కరముగా ఇది కొన్ని పాత సినిమాలు కలిపి తీసిన కలగూర గంప కధను కలిగిఉన్న ఒక భయానక చిత్రము . ( హార్రర్ మూవీ ). ఇక కధ ను అవలోకించి నట్లైన చో : రాం చరణ్ తేజ అనబడు ఒక బస్తీ కుర్రవాడు , తన పేదరికము వలన ఎల్లప్పుడూ pepe jeans , Lee , UCB బట్టలు వేసుకుంటూ , మంచి మంచి విదేశీ బైకుల పైన తిరుగుతూ , వాళ్ళ పెంపుడు తల్లి తండ్రితో , ఒక విశాలమైన cane furniture గల ఒక బీద ఇంట్లో నివసిస్తూ ఉంటాడు . ఇతను మొత్తం సిటీ లో జరిగే ఎలాంటి పందెము నైనను జయించగల సమర్ధుడు . 10 ,000 కోట్ల ఆస్తికి వారసురాలైన తమన్నా గారిని ఈయన గారు ప్రేమించి , వలలో పడేస్తే 20 లక్షల బెట్టింగ్ డబ్బులు వస్తాయి . దానితో తన పెంపుడు తండ్రి ఆరోగ్యాన్ని బాగుచేయించి చరిత్ర పుటలో స్థానం సంపాదించాలని అనుకుంటాడు . నాకు అర్ధం కానిదేమిటంటే నిజంగా ప్రేమించి అలాంటి పిల్లను పడేస్తే ముష్టి 20 లక్షలు ఎందుకు దర్జాగా 10000 కోట్లు ఇతనివే అవుతాయి కదా ... మరి శ్రీ సంపత్ నంది గారు గాని, శ్రీ చిరంజీవి గారు గాని కధా చర్చలలో ఈ విషయాన్ని ఎందుకు మర్చిపోయారు ? అలాగే శ్రీ సంపత్ నంది గారు .. బస్తీ కుర్రవాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీరు కొంచం మీ దగ్గరలో ఉన్న బస్తీలకు వెళ్ళండి సార్ .. ఇంత ఖరీదైన బస్తీ కుర్రవాళ్లను మేము తట్టుకోలేకపోతున్నాము . సదరు తమన్నా గారు కూడా పెంపుడు కూతురు . ఆమె ఆస్తి ని కొట్టేయ్యాలని ముకేష్ రుషి గారు జాగ్రతగా ఆమెను 18 ఏళ్ళు కాపాడితే మన హీరో గారు ఆమెను వీజీగా లైన్ లో పడేసి 20 లక్షలు పట్టుకెళ్ళి పోదామని మంచి క్యారీ బాగ్ ను రెడీ చేసుకుంటారు . ఈలోగా హీరోయిన్ గారు , ఇదంతా తూచ్ ... నేనే కావాలని నీ ప్రేమలో పడిపోయాను అని చెప్తారు . తరువాత చూస్తే హీరో కు హీరోయిన్ కు ఒకరే అన్యాయం చేసారన్న నిజం తెలుస్తుంది . ఇక హీరో గారు అందరిని చంపి ప్రతీకారం తీర్చుకుంటారు . అదే ఈ చిత్ర రాజము యొక్క చారిత్రాత్మకమైన కధ. మొత్తం సినిమా అంతా పాత చిరంజీవి సినిమాలు అంటే 80 , 90 లలో వచ్చినవి చూసినట్లే ఉంది . అయ్యా పరుచూరి బ్రదర్సూ , ఇంకా డబుల్ మీనింగ్ సంభాషణలు , హీరో విలన్లు ఒకరికి ఒకరు సవాళ్లు విసురుకోవటం , వంశాల కోసం , ఫ్యామిలీ ల కోసం , వాళ్ళు మమ్మల్ని ఉద్దరించిన విషయాల కోసం మీరు రాయటం ఆపేసి దయచేసి ఏదైనా పార్టీ లో జాయిన్ అయిపోండి సార్... ఈ హింస భరించ లేకపోతున్నాం . సినిమా లో పాటలు ఎందుకు వస్తున్నాయో ఎవడికి అర్ధం కావటం లేదు . సినిమా మొత్తం రామ్ చరణ్ గారు మెడలో వేసుకున్న ఆంజనేయుడి లాకెట్ తమన్నా గారికి కనపడదు .. అవసరమైనప్పుడే అది కనిపిస్తుంది ... ఇక హీరో గారు అందంగా ఉన్నారని సినిమా లో ఉన్న అన్ని పాత్రలతో చెప్పించి, అది చాలదన్నట్లు ఆడియో ఫంక్షన్ లలో, టీవీ ప్రోమో లలో కూడా చెప్పించారు . ఇదంతా అతను అందముగా ఉన్నారని మనల్ని ఒప్పుకోమని మెంటల్ గా ట్యూన్ చేస్తున్నట్లా? లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లా ? అయ్యా ? తెలుగు ప్రేక్షకులు బాగా విశాల హృదయులు . ఎలాంటి వారైన వారసులు అయితే ఒప్పుకుంటారు ... మా తల రాత అలా ఉన్నప్పుడు మీరు కష్టపడటం దేనికి ? మేము ఒప్పుకున్తున్నాం ..రామ్ చరణ్ గారు చాల అందముగా ఉన్నారు . ఇక చివరిగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లు తిరగ రాసిందనీ , అత్యదిక వసూళ్లు చేసిందనీ , సూపర్ డూపర్ హిట్ అనీ టీవీ లలో చెప్తుంటీ చూసాను . . ఇలాంటి చిత్ర విచిత్రాలు మా జీవితాలలో అలవాటైపోయినందున , దీనిని సీరియస్ గా తీసుకుని ఈ రికార్డులు అన్ని కరెక్టేనా కాదా అని వాకబు చేసే తీరుబడి ఎవరికీ లేదు . మేమంతా ఆధార కార్డ్లు రాలేదనీ , గ్యాస్, పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయో అన్న భయంతో చస్తున్నాం . సో మీరు హ్యాపీ గా ఇలాంటి సినిమాలు తీసి మా పైన వదలండి . రికార్డులు బద్దలు గొట్టండి . మేము చూసి తరిస్తుంటాం సర్వేజనా సుఖినోభవంతు .. P .S : పైన పేర్కొన్న అభిప్రాయము నా వ్యక్తిగతమైనది . ఎవరిని కించపరచాలని గాని, వెక్కిరించాలని కాని రాసినది కాదు . రాజ్యాంగము నాకు ప్రసాదించిన భావ ప్రకటన హక్కు ను వాడుకుని , నా భావమును ప్రకటించ డమైనది . నమస్కారం
MEGA POWER STAR Posted April 10, 2012 Report Posted April 10, 2012 [img]http://4.bp.blogspot.com/-Dgwgg0TbUvw/T1j55XhH7oI/AAAAAAAACBU/gbeOm_5Lfvc/s1600/brahmanandam+gif.gif[/img]
budankay_balaraju Posted April 10, 2012 Report Posted April 10, 2012 [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img][img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img]
balu_gani Posted April 10, 2012 Report Posted April 10, 2012 [b]ఇక హీరో గారు అందంగా ఉన్నారని సినిమా లో ఉన్న అన్ని పాత్రలతో చెప్పించి, అది చాలదన్నట్లు ఆడియో ఫంక్షన్ లలో, టీవీ ప్రోమో లలో కూడా చెప్పించారు . ఇదంతా అతను అందముగా ఉన్నారని మనల్ని ఒప్పుకోమని మెంటల్ గా ట్యూన్ చేస్తున్నట్లా? లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లా ? అయ్యా ? తెలుగు ప్రేక్షకులు బాగా విశాల హృదయులు . ఎలాంటి వారైన వారసులు అయితే ఒప్పుకుంటారు ... మా తల రాత అలా ఉన్నప్పుడు మీరు కష్టపడటం దేనికి ? మేము ఒప్పుకున్తున్నాం ..రామ్ చరణ్ గారు చాల అందముగా ఉన్నారు .[/b]
tom bhayya Posted April 10, 2012 Report Posted April 10, 2012 [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img] GP
CHANAKYA Posted April 10, 2012 Report Posted April 10, 2012 evadi kaani, antha kasta fadi 10gi vadilaadu gaaa [img]http://gifsoup.com/view3/3599968/google2012-o.gif[/img]
budankay_balaraju Posted April 10, 2012 Report Posted April 10, 2012 [quote name='CHANAKYA' timestamp='1334076105' post='1301619963'] evadi kaani, antha kasta fadi 10gi vadilaadu gaaa [img]http://gifsoup.com/view3/3599968/google2012-o.gif[/img] [/quote] yendhi video lo fafani thokkesaru .. coverage ivvaledu assalu[img]http://3.bp.blogspot.com/-aXFrEMsP9-s/T4HOsOvLBHI/AAAAAAAAC8Y/TaFI1LZb8TI/s1600/brahmi+hurted.gif[/img]
dooda Posted April 10, 2012 Report Posted April 10, 2012 [b][color=#282828][font=helvetica, arial, sans-serif]ఇక కధ ను అవలోకించి నట్లైన చో : రాం చరణ్ తేజ అనబడు ఒక బస్తీ కుర్రవాడు , తన పేదరికము వలన ఎల్లప్పుడూ pepe jeans , Lee , UCB బట్టలు వేసుకుంటూ , మంచి మంచి విదేశీ బైకుల పైన తిరుగుతూ , వాళ్ళ పెంపుడు తల్లి తండ్రితో , ఒక విశాలమైన cane furniture గల ఒక బీద ఇంట్లో నివసిస్తూ ఉంటాడు[/font][/color][/b]
dooda Posted April 10, 2012 Report Posted April 10, 2012 [b][color=#282828][font=helvetica, arial, sans-serif]బస్తీ కుర్రవాళ్ళు ఎలా ఉంటారో తెలుసుకోవాలంటే మీరు కొంచం మీ దగ్గరలో ఉన్న బస్తీలకు వెళ్ళండి సార్ .. ఇంత ఖరీదైన బస్తీ కుర్రవాళ్లను మేము తట్టుకోలేకపోతున్నాము .[/font][/color][/b]
dooda Posted April 10, 2012 Report Posted April 10, 2012 [b][color=#282828][font=helvetica, arial, sans-serif]ఇక హీరో గారు అందంగా ఉన్నారని సినిమా లో ఉన్న అన్ని పాత్రలతో చెప్పించి, అది చాలదన్నట్లు ఆడియో ఫంక్షన్ లలో, టీవీ ప్రోమో లలో కూడా చెప్పించారు . ఇదంతా అతను అందముగా ఉన్నారని మనల్ని ఒప్పుకోమని మెంటల్ గా ట్యూన్ చేస్తున్నట్లా? లేక బ్లాక్ మెయిల్ చేస్తున్నట్లా ? అయ్యా ? తెలుగు ప్రేక్షకులు బాగా విశాల హృదయులు . ఎలాంటి వారైన వారసులు అయితే ఒప్పుకుంటారు ... మా తల రాత అలా ఉన్నప్పుడు మీరు కష్టపడటం దేనికి ? మేము ఒప్పుకున్తున్నాం ..రామ్ చరణ్ గారు చాల అందముగా ఉన్నారు .[/font][/color][/b]
Sastrygaru Posted April 10, 2012 Report Posted April 10, 2012 [img]http://lh3.ggpht.com/_KVkPY2XIbRQ/TWAgXprYLuI/AAAAAAAABCo/VzL0ae41lc4/brahmilaugh.gif[/img]
dooda Posted April 10, 2012 Report Posted April 10, 2012 [b][color=#282828][font=helvetica, arial, sans-serif]ఇక చివరిగా ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్లు తిరగ రాసిందనీ , అత్యదిక వసూళ్లు చేసిందనీ , సూపర్ డూపర్ హిట్ అనీ టీవీ లలో చెప్తుంటీ చూసాను . . ఇలాంటి చిత్ర విచిత్రాలు మా జీవితాలలో అలవాటైపోయినందున , దీనిని సీరియస్ గా తీసుకుని ఈ రికార్డులు అన్ని కరెక్టేనా కాదా అని వాకబు చేసే తీరుబడి ఎవరికీ లేదు . మేమంతా ఆధార కార్డ్లు రాలేదనీ , గ్యాస్, పెట్రోల్ ధరలు ఎంత పెరుగుతాయో అన్న భయంతో చస్తున్నాం . సో మీరు హ్యాపీ గా ఇలాంటి సినిమాలు తీసి మా పైన వదలండి . రికార్డులు బద్దలు గొట్టండి . మేము చూసి తరిస్తుంటాం[/font][/color][/b] ee last 2 lines highlight mama..
Recommended Posts