Jump to content

KCR Intlo racha start ayyindi


Recommended Posts

Posted

హైదరాబాద్ : రాజకీయ భవితవ్యం కోసం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు కుటంబ సభ్యుల నడుమ ఆధిపత్యపోరు సాగుతోందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ రాజకీయ తెరపైకి రాని కవిత ఇపుడు కీలకంగా వ్యవహరించేందుకు ఉవ్విళ్లూరుతుండటం ఇందులో భాగమేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తన అన్న కె టి రామారావును కిందకు నెట్టి తాను రాజకీయ తెరపైకి వచ్చేందుకు కవిత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఆమె అదుర్స్ సినిమా అంశాన్ని అందిపుచ్చుకున్నారని ఉదహరిస్తున్నారు. గతంలో సిరిసిల్ల ఎమ్మెల్యే టికెట్ ను తృటిలో కోల్పోయినందున వచ్చే ఎన్నికల్లోనైనా రాబట్టుకోవాలన్న సంకల్పంతో ఆమె వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నట్లు గుర్తు చేస్తున్నారు. రాజకీయంగా క్రియాశీలకంగా నిలవాలన్న దీర్ఘకాల ప్రణాళికతోనే ఆమె అనూహ్యంగా రాజకీయ తెరపైకి వచ్చి బహిరంగ ప్రకటనలు చేస్తున్నారని అభిప్రాయపడుతున్నారు.

కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని చాలా కాలంగా నడుపుతున్నప్పటికీ ఆయన కుమార్తె మాత్రం ఎప్పుడూ రాజకీయాల్లో అంతగా శ్రద్ద చూపింది లేదు. హైదరాబాద్ లోనే విద్యాభ్యాసం పూర్తి చేసిన కవిత అమెరికన్ యూనివర్శిటీలో 2001లో మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసారు. అనంతరం మెకానికల్ ఇంజనీరింగ్ అయిన అనిల్ కుమార్ అనే వ్యాపార వేత్తతో ఆమెకు వివాహం జరిగింది. కవిత కూడా దిల్ సుఖ్ నగర్, హిమాయత్ నగర్, సైనికపూరి ప్రాంతాల్లో బ్యూటీ సెలూన్స్ ను విజయవంతంగా నడుపుతున్నారు. అయితే 2006 సంవత్సరంలోనే కవిత తెలంగాణ ఉద్యమంలోకి వచ్చారు. పార్టీ సాంస్కృతిక విభాగం తెలంగాణ జాగృతికి అధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్నారు. నల్గొండ జిల్లాలో కొన్ని గ్రామాలను దత్తత తీసుకొని వారికి ఉచితంగా విద్యను అందిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. అంతే ఆమె మళ్లీ ఉద్యమంలో ఎక్కడా కనిపించలేదు.

అయితే నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ దీక్ష లో రాజకీయ తెరపైకి వచ్చారు. విద్యార్ధులతో కలిసి ఆమె సంచలన సంఘటనలకు తెర తీశారు. తాజాగా జూనియర్ ఎన్టీఆర్ నటించిన 'అదుర్స్' సినిమాని తెలంగాణ జిల్లాల్లో ప్రదర్శించనీయబోమని మీడియా ద్వారా ప్రకటన చేసి రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించారు. కవిత చేసిన ఈ ప్రకటన రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. అదుర్స్ పై ఆమె ఇచ్చిన పిలుపు రాజకీయంగా తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంది. తెరాస లేదా దాని సృష్టి అయిన జెఎసితో ఎలాంటి సంబంధం లేకుండా అదుర్స్ పై ఆమె రేపిన వివాదం తెరాస నాయకత్వాన్ని ఇరుకున పెట్టింది. జెఎసిలో మిత్రపక్షంగా ఉంటున్న తెలుగుదేశం, కాంగ్రెస్ నాయకుల నుంచి విమర్శల వాన ప్రారంభం అయింది. అంతేకాకుండా జిల్లాల్లో సామాన్య జనం సైతం కవిత పిలుపు పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. చివరకు తెరాస నాయకులు రంగంలోకి దిగి కవిత చేసిన దుందుడుకు చర్యను చక్కదిద్దుకోడానికి నానా పాట్లూ పడ్డారు.

అయితే కవిత మాత్రం వ్యూహాత్మకంగానే అదుర్స్ ను అడ్డుకోవాలని ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో సిరిసిల్ల స్థానం నుండి ఎన్నికల బరిలో నిలవాలని కవిత తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఆమె సోదరుడు కె టి రామారావు కారణంగా తృటిలో ఆవకాశం చేజారింది. అయితే వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగాలంటే ఇప్పటి నుండే రాజకీయంగా క్రియాశీలకంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భావించిన ఆమె అదుర్స్ సినిమాను ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఇరికించారనే వాదనలు వినవస్తున్నాయి. తన అన్న కంటే రాజకీయంగా ప్రధాన స్రవంతిలో ఉంటేనే తనకు వచ్చే సారి చాన్స్ దక్కుతుందని ఆమె భావిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఉధృతంగా సాగుతున్న ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని తన లక్ష్యానికి అనుగుణంగా వినియోగించుకోవాలని ఆమె ధృడ సంకల్పంతో ఉన్నట్లు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. మొత్తానికి టీఆర్ఎస్ అధినేత ఇంట్లో రాజకీయ అధిపత్య పోరు ఆరంభమైనట్లే.

Posted

[IMG]http://i34.tinypic.com/2djca3r.jpg[/img] [IMG]http://i34.tinypic.com/2djca3r.jpg[/img]

×
×
  • Create New...