Jump to content

Recommended Posts

Posted

రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతున్న ఐదో సినిమా ‘దేవుడు చేసిన మనుషులు’. ఈచిత్రం టైటిల్‌కు తగిన విధంగానే సినిమా స్టోరీ ఉందని స్పష్టం అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే...ఈ చిత్రంలో బ్రహ్మానందం, కోవై సరళ దేవుళ్లుగా విష్ణుమూర్తి, లక్ష్మి దేవి పాత్రల్లో కనిపిస్తారని తెలుస్తోంది.

ఒక రోజు లక్ష్మిదేవి తెలుగు సినిమా చూడాలనికుటుంది. అయితే అది రీల్‌లో కాకుండా రియల్ లైఫ్‌లో విష్ణుమూర్తి సృష్టించిన పాత్రలతో చూడాలనుకుంటుంది. తొలుత విష్ణుమూర్తి ఇందుకు ఒప్పుకోక పోయినా....నారదుడు(జూనియర్ రేలంగి) కల్పించుకుని విష్ణుమూర్తిని ఒప్పిస్తాడు.

ఈ మేరకు పాత్రల రూపకల్పన చేసిన విష్ణుమూర్తి....రవితేజను ఇండియాలో, ఇలియానాను బ్యాంకాక్‌లో పుట్టిస్తాడు. ఈ రియల్ లైఫ్ సినిమాలో లక్ష్మి దేవి నవరసాలైన రొమాన్స్, కామెడీ, యాక్షన్, సెంటిమెట్ ఇలా అన్నీ ఉండాలని కోరుకుంటుంది. ఈ క్రమంలో లార్డ్ విష్ణు ఇవన్నీ ఆయా పాత్రలకు యాడ్ చేస్తూ ఉంటాడు. ఇలా పలు రకాల ట్విస్టులతో సినిమా సాగుతూ ఉంటుందట.

×
×
  • Create New...