Jump to content

malli title missaina mahesh


Recommended Posts

Posted

అతడు" చిత్రం తర్వాత మహేష్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో వస్తున్న తాజా చిత్రానికి టైటిల్ విషయంలో ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. ఈ చిత్రానికి మొదటనుండి అనుకుంటున్న "వరుడు" చిత్రం అల్లు అర్జున్, గుణశేఖర్ చిత్రానికి టైటిల్ గా మారింది. అభిమానులంతా కొంత నిరాశ చెందారు. ఓ మంచి టైటిల్ మిస్సయ్యిందని. ఆ తరువాత వినిపించిన "కిలాడీ" కూడా మహేష్ ని మిస్సవుతున్నట్టే. ఎందుకంటే ఈ టైటిల్ ని విశాల్ అనువాద చిత్రానికి దాదాపుగా ఖరారు చేసుకున్నారు. ఇలా రెండు టైటిల్స్ మహేష్ చిత్రాన్ని మిస్సయ్యాయి. మహేష్ చిత్రానికి ఇంకా వినిపిస్తున్న మరోటైటిల్ "ఖలేజా". ఈ టైటిల్ అయినా మహేష్ ని అంటిపెట్టుకొనివుంటుందో లేక మిస్సవుతుందో మరి. అన్నట్టు త్రివిక్రమ్ కున్న సెంటిమెంట్ ప్రకారం ఈ చిత్రానికి ఏకాక్షర టైటిల్ ని కూడా యోచిస్తున్నట్టు తెలిసింది.
[img]http://teluguone.com/cms/cinema/extraContent/image2/imageArchives/1263631303880mahesh.jpg[/img]

×
×
  • Create New...