Jump to content

nidi andhra nadi telangana.......vidipodam


Recommended Posts

Posted

కేంద్రప్రభుత్వం సత్వరమే తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలని మాజీ హోం మంత్రి జానారెడ్డి కోరారు. తెలంగాణ సాధనలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని చెప్పారు. అంతవరకు ప్రశాంతంగా ఉద్యమం కొనసాగిస్తామని వెల్లడించారు.

తెలంగాణా ప్రజల అభీష్టాన్ని సీమ, కోస్తాంధ్ర నేతలు అర్థం చేసుకుని విడిపోవాలని జానారెడ్డి సీమాంధ్ర నాయకులకు పిలుపునిచ్చారు. తెలంగాణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రారంభమైన రిలే నిరాహార దీక్ష శిబిరంలో పాల్గొన్న జానారెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నిర్ధిష్ట కాలపరిమితో తెలంగాణ ప్రక్రియను పూర్తి చేయాలనీ, అసలు ఎప్పుడు లోపు ఇస్తుందో తేల్చి చెప్పాలని డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన కాలపరిమితిని వెల్లడించే వరకూ తెలంగాణా ప్రాంతాల్లో ఉద్యమాన్ని కొనసాగించాలని ఆయన తెలంగాణా నేతలకు పిలుపునిచ్చారు. ఇందుకుగాను పార్టీలకు అతీతంగా అన్ని రాజకీయ పక్షాలు ఏకం కావాలన్నారు. తెలంగాణా లక్ష్య సాధనలో తమకు పార్టీలకన్నా ప్రాంతమే ముఖ్యమని అందరూ చాటిచెప్పాలన్నారు.

డిసెంబరు 9న కేంద్రం తన ప్రకటనకు కట్టుబడి సాధ్యమైనంత త్వరగా ప్రక్రియను ప్రారంభించి రాష్ట్ర ఏర్పాటును మరింత వేగవంతం చేసి ముగించాలని జానారెడ్డి అన్నారు. ప్రక్రియ ముగిసే వరకూ "జై తెలంగాణా" నినాదాలతో కేంద్రం చెవులను గింగుర్లెత్తించాలని ఆయన నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

×
×
  • Create New...