perk Posted January 17, 2010 Report Posted January 17, 2010 ప్రత్యేక రాష్ట్ర సాధనకు తెలంగాణాలో అన్ని రాజకీయ పార్టీలు కలిసి మూకుమ్మడి రాజీనామాలు చేయడమే కాక వాటిని ఆమోదింపజేసేందుకు స్పీకర్‌పై ఒత్తిడి తీసుకవచ్చి తద్వారా రాజకీయ సంక్షోభం సృష్టించాలని తెలంగాణా జేఏసి కన్వీనర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. అయితే ఆయన పిలుపుపై కాంగ్రెస్, తెదేపాలు ఆచితూచి స్పందిస్తున్నాయి.కాంగ్రెస్ పార్టీలోని నాయకులు తమ పార్టీ పదవులకు రాజీనామా చేస్తే మొదటికే మోసం వస్తుందని, రాష్ట్రపతి పాలన వస్తే తాము చేసేదేమీ ఉండదని తలపోస్తున్నారు. [color=green] తాడు... బొంగరం లేని తెరాస వంటి పార్టీ నిర్దేశించిన మాటలను[/color] ఒక జాతీయ పార్టీ హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు అనుసరించడం వల్ల భవిష్యత్‌లో చిక్కులు ఎదుర్కొన వలసి వస్తుందని కొందరు నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.పదవుల్లో ఉంటూనే జాతీయ నాయకత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రాన్ని సాధించుకోవాలని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ పార్టీ నాయకులు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే కేంద్రం తమకు ఓ స్పష్టమైన హామీ ఇచ్చినందున కేంద్రం మాట మీరి ప్రవర్తిస్తే మొదటికే మోసం వస్తుందని వారు అభిప్రాయపడుతున్నట్లు భోగట్టా.ఇక తెలుగుదేశం పార్టీ ఆలోచన మరోలా ఉంది. రాజీనామాల వ్యవహారంపై తమ పార్టీ ముందుగా తొందరపడకూడదని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. తెరాస, కాంగ్రెస్ పార్టీలు పూర్తిగా తమ పదవులకు రాజీనామాలు చేసిన తర్వాతే తెలంగాణా తెలుగుదేశం నాయకులు రాజీనామాలపై ఒత్తిడి చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద రాజీనామాల వ్యవహారం రాజకీయ సంక్షోభం సంగతేమోగానీ తెలంగాణాలోని రాజకీయ పార్టీల మధ్య సంక్షోభాన్ని కలిగించే దిశగా సాగుతోంది.
Puli-hora Posted January 17, 2010 Report Posted January 17, 2010 hey perk...title exact ga set ayndi...nijama ga oka objective ledu...oka capable leader ledu....
Recommended Posts