Jump to content

Rosy Caste feeling...


Recommended Posts

Posted

రాష్ట్రంలో కుల పందేరం మరోసారి పురి విప్పింది. అత్యున్నత పదవులన్నీ ఒక్కటొక్కటిగా ఒకే సామాజిక వర్గం ఖాతాలోకి వెళ్తున్నాయన్న విమర్శలు మళ్లీ మొదలయ్యాయి. ప్రభుత్వ పెద్దగా ఎవరు ఉంటే..ఆయన వర్గానికే పదవుల్లో సింహభాగం దక్కుతున్నాయి. గతంలో వైఎస్‌ హయాంలో జరిగిన కథే తాజాగా రోశయ్య పాలన లోనూ పునరావృతం అవుతోందన్న వ్యాఖ్యలు బాహాటం గానే వినిపిస్తున్నాయి. ఈ కుల పందేరంలో అర్హతలున్న ప్పటికీ బడుగులు పోటీ పడలేకపోతున్నారు. చివరికి పల్లకీను మోసే బోూలుగానే మిగులుతున్నారు. దీనిపై అధికారపార్టీలోనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏపీఐఐసీ ఛైర్మన్‌గా శ్రీఘాకొళ్లాపు శివ సుబ్రహ్మణ్యం నియామకం సరికొత్త వివాదానికి, విమర్శలకు తెర లేపింది. ఆయన నియామకానికి సంబంధించి ముఖ్య మంత్రిపై సొంత పార్టీ నుంచే విమర్శలు రావడం కుల పందేరానికి పరాకాష్ఠ.

×
×
  • Create New...