Jump to content

Water adigina Savam....


Recommended Posts

Posted

చిన్సూరా(పశ్చిమ బెంగాల్) : పాడే మీద మోసుకుపోతున్న శవం... మోస్తున్న నలుగురికీ 'ఒరే మంచినీళ్ళు ఇవ్వండిరా' అన్న కేక వినపడింది. అడిగింది ఎవరా అని ఆరా తీసిన వారికి ఒక్కసారిగా వణుకు మొదలైంది. ఎందుకంటే పాడె మీద శవమే మంచినీళ్లు అడుగుతోంది. ఒక్కసారిగా ఉలిక్కిపడిన బంధువులు భయంతో పరుగులు తీశారు. ఈ ఉదంతం హుగ్లీ జిల్లాలోని మాన్కుందు లో ఆదివారం చోటు చేసుకుంది.

మానసిక వైకల్యంతో బాధపడుతున్న అపూర్వ చక్రవర్తి(60) అనే వృద్ధుడు మరణించాడని మాన్కుందు లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రి ప్రకటించింది. స్పృహ లేకుండా పడి ఉన్న అపూర్వ చక్రవర్తి చనిపోయాడని ఏకంగా ధృవపత్రాన్ని కూడా ఇచ్చింది. దాంతో బంధువులు శవయాత్ర ప్రారంభించారు. అందరూ మౌనంగా యాత్ర నిర్వహిస్తుండగా అపూర్వ చక్రవర్తి లేచి మంచినీళ్ళు అడగడంతో తామంతా షాక్ తిన్నామని, వెంటనే అపూర్వను ఆసుపత్రికి తీసుకువచ్చామని అతని సోదరుడు సుభాష్ చెప్పారు. మొత్తానికి ఆసుపత్రిపై చర్యతీసుకుంటామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.

×
×
  • Create New...