Jump to content

Recommended Posts

Posted

[img]https://fbcdn-sphotos-a.akamaihd.net/hphotos-ak-ash3/180212_438755199489076_714748412_n.jpg[/img]



"..తరాలు మారినా
ఎందరో నేల రాలిపోయినా
ఇంకా ..ఇంకా
వెండితెర మీద ప్రేమతనపు
గొప్పదనాన్నిచాటి చెప్పిన
వైనం ..పది కాలాలపాటు
దాచుకోవాల్సిన సన్నివేశం
అప్పుడెప్పుడో అగుపించిన
ఆ అరుదైన చిత్రం చేసిన
సందడి అంతా ఇంతా కాదు
ఓ గొప్పనైన ..ఓ చారిత్రాత్మకమైన చరిత్ర అది ..
ప్రేమంటే కోరుకోవటం కాదని
అంతకంటే అర్పించుకోవటం అని
జీవితాన్ని త్యాగం చేయటమని
చెప్పిన సందేశాత్మక చిత్రం
కళ్ళు మూసుకున్నా..ఆ సన్నివేశాలు
మళ్ళీ మళ్ళీ కదలాడుతూనే ఉంటాయి
మనల్ని అల్లకల్లోలంలోకి నెట్టి వేస్తాయి
చరిత్ర సృష్టించాలంటే ప్రేమించాలా ?
అవునవును అనే వాళ్ళు ..కాదనుకునే వాళ్ళు
ఎవరి లోకంలో వాళ్ళే ..
కానీ మరోచరిత్ర ..అజరామరం ..
భారతీయపు తెరమీద
చెరపలేని సంతకం .."

Posted

Ee cinema title mean emiti? enduku ala pettaru?

×
×
  • Create New...