Jump to content

Recommended Posts

Posted

అభిమానులే పెట్టుబడిగా స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఎనిమిది నెలల తర్వాత అదే అభిమానులు జారిపోవడంతో పట్టాలు తప్పింది. చిరంజీవి ఈ స్థాయికి రావ డానికి పునాదిరాళ్లయినprp అభిమానులు సమాధి రాళ్లుగా మిగిలిన వైనం అభిమాన సంఘాల్లో చర్చ నీయాంశమయింది. తాజాగా, లోక్‌సత్తాను కాపీ కొడుతూ చిరు కుటుంబసభ్యులు ప్రారంభించిన రైలుయాత్రకు అభిమానులు దూరంగా ఉండటం పీఆర్పీ నాయకత్వాన్ని కలవరపరుస్తోంది. విరగబడి వస్తారనుకున్న అభిమానులు రైల్వేస్టేషన్లలో భూతద్దం పెట్టి వెతికినా కనిపించకపోవడం పార్టీ వర్గాలను నిరాశకు గురిచేస్తోంది.

`రాజ్యం’ హీరోలకు స్పందన కరువు

ప్రజారైలు యాత్ర ప్రారంభం రోజునే తుస్పు మంది. ప్రజారాజ్యంపార్టీ ఎన్నికల గుర్తుగా వచ్చిన రైలు ఇంజన్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రజారైలు యాత్రకు జనం కరువ య్యారు. చిరంజీవి, ఆయన బావమరిది అల్లు అరవింద్‌ తమ పిల్లల సరదా తీర్చేందుకే వారిని ప్రజారైలు ఎక్కించారా… లేక రాంచరణ్‌ తేజ్‌ అల్లు అర్జున్‌లు ఎన్నికల్లో పాల్గొనడం లేదన్న అపవాదును పొగొట్టేందుకు ఈ యాత్ర ప్రారం భించారా అన్న సందేహాలు పుట్టుకొస్తున్నాయి. మొత్తం మీద `రాజ్యం’ హీరోలకు ఆశించిన ప్రజాభిమానం దక్క లేదు. సికింద్రాబాద్‌ నుంచి రేణిగుంటదాకా మూడు రోజులపాటు సాగే ప్రజారైలు శనివారం బయలుదేరింది. సికింద్రాబాద్‌ స్టేషన్‌లో ఉదయం 7.30 గంటలకు ప్రారం భం కావాల్సిన రైలుయాత్రకు జనం ఎవరూ రాకపోవ డంతో గంటన్నరకు పైగా వేచిచూడాల్సి వచ్చింది.

నిత్యం వేలాది మందితో కిటకిటలాడే సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లోనే ఈ పరిస్థితి ఎదురైతే… పోను, పోను స్పందన ఎలా ఉంటుందాన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ అధ్యక్షుడు చిరంజీవి రైలు ఇంజను ముందుభాగం పైకి ఎక్కి, ఇరువైపుల తనయుడు రాంచరణ్‌, మేనల్లుడు అల్లు అర్జున్‌ను పక్కన పెట్టుకుని ప్రజారైలుకు జండా ఊపారు. అనంతరం రైలు ఇంజన్‌లోకి వెళ్లి చిరంజీవి స్వయంగా డ్రైవర్‌గామారి ఇంజన్‌ స్టార్‌చేశారు. కొన్ని గజాలు ముందుకు కదలగానే ఇంజన్‌దిగి అభివాదం చేస్తూ అక్కడ నుంచి ని్ర„ష్కమించారు. రాంచరణ్‌, ఆయన సోదరి సుస్మిత, అల్లు అర్జున్‌, నాగబాబు తనయుడు ప్రజారైలు యాత్రలో పాల్గొన్నారు. కుటుంబ యాత్రగా సాగిన ఈ యాత్రలో వీరికోసం ఒక ప్రత్యేక ఏసీ బోగీ, మీడియాకోసం మరో బోగీని కేటాయించారు.

ఇక మిగిలిన బోగీలన్నీ జనంలేక ఖాళీగా కన్పించాయి. ప్రారం భంలోనే స్పందనలేక నిరుత్సాహంతో కూడిన నీరసంతో కదిలిన ప్రజారైలుకు లాలాపేట, మౌలాలి, భువనగరి, స్టేషన్‌ఘనపూర్‌, ఖాజిపేట స్టేషన్లలో పెద్దగా ఆశించిన స్పందన రాలేదు. 11.30 వరంగల్‌కు చేరుకున్న రైలుకు అక్కడ గుమిగూడిన కొంతమంది యువకులను చూశాక అడుగంటిన ఉత్సాహం మళ్లీ ఉబికి వచ్చింది. రాంచరణ్‌, అల్లు అర్జున్‌లు రైలు దిగకుండానే బోగీ తలుపులవద్ద నిలబడి అభివాదం చేస్తూ రైలు ఇంజన్‌ గుర్తును చూపుతూ గడిపారు. పదే, పదే ఆవే సీన్లు జనానికి బోర్‌ కొట్టాయో లేక చరణ్‌, అర్జున్‌లకే విసుగన్పించిందోగాని వెంటనే బోగీ లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. ప్రజారైలు యాత్రలో తమ అభిమాన యువహీరోలకు ఆహ్వానం పలికేందుకు ఆయా నియోజకవర్గాలోనున్న నాయకులు, అభిమానులు కూడా అంత ఉత్సాహం చూపలేదు. ఎన్నికల ప్రచారంలో తాము ఇలా రావడం సమయం వృధా అని వరంగల్‌జిల్లా ప్రజారాజ్యం పార్టీ ముఖ్యుడొకరు వ్యాఖ్యానించారు.

Posted

jananni vadi fans ni assam teesukelatam ani... rail kinda veesi tokkesaruuu ................ dancegdb

Posted

ee 0.5 la nu choodaaniki kaneesam aa jathi vaallu kooda raledannamaata...

  • 6 months later...
Posted

anduke mama okka bhogi matrame party kosam book chesukovaliii......mamulu janalu alago reservation chepinchukuntaru ga tirupatiki,,,so no problemm.... railuku railu,, janalaku janalu  fuullllllluuuuuuuuuuuuu sanadadi... monkeydanceds

Posted

Kingmakers mama nee pani out... ippudu kontha mandhi( So called people) vachii ninnu kumutaruu suduu...

×
×
  • Create New...