kingmakers Posted April 13, 2009 Report Posted April 13, 2009 జూనియర్ ఎన్. టి. ఆర్. తన ప్రసంగం తో ఆదరగొట్టాడు. అతని ప్రసంగంలో అదే వాడి వేడి కనిపించింది. తన 12 రోజుల ఎన్నికల ప్రచారంలో ఎలాంటి ప్రసంగాలు చేసి ప్రజలను ఆకర్షించాడో ఇపుడు ప్రమాదం తరువాత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ చేసిన ప్రసంగం కూడా అదే స్థాయిలో సాగింది. ఒకటి రెండు చోట్ల కొంచెం మాటలు తడబడినా అతని ప్రసంగం ఉద్వేగం తగ్గలేదు. వ్యాంగొక్తులకు కొదవ లేదు. ముఖ కావళిక ల్లో మార్పు రాలేదు. అదే హావబావాలు వ్యక్తం చేశాడు. తెలుగు దేశం పార్టీ మ్యాని ఫెస్టో లోని పథకాలను గురించి వివరించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్నపుడు ఉచిత విద్యుత్ ను వ్యతిరేకించిన మాట వాస్తవమే అయితే అప్పట్లో రాష్ట్ర వార్షిక ఆదాయం ఎనిమిది వేల కోట్ల రూపాయల రూపాయలు మాత్రమే. తరువాత సంపదను సృస్టించి రాష్ట్ర వార్షిక ఆదాయాన్ని పెంచడానికి ఎంతో కృషి చేస్తే ఇపుడు ఆదాయం 80 వేల కోట్ల రూపాయలకు పెరిగిందని గుర్తు చేశారు. సమపద విత్తానాన్ని నాటి మొక్క స్థాయి నుంచి ఫలాలను అందించే చెట్టు గా పెంచిన వారిని తప్పించిలని చూస్తున్నారని కాంగ్రెస్ పార్టీని పరోక్షంగా విమర్శించారు. రాష్ట్ర ఆదాయాన్ని సక్రమంగా వినియోగించి రాష్ట్ర ప్రజల సంక్షేమానికి కృషి చేసే తెలుగుదేశం పార్టీని ఆదరించి గెలిపించాలని కోరారు. బెడ్ పై నుంచి జూనియర్ ఎన్. టి. ఆర్. తన ప్రసంగం తో గర్జించారు.
GangLeader Posted April 13, 2009 Report Posted April 13, 2009 NTR you rock you rock you rock you rock you rock *=: *=: *=:
Recommended Posts