Jump to content

Read This......magsaysay Award


Recommended Posts

Posted

[img]http://www.sakshi.com/newsimages/contentimages/26072012/KULANDEI-FRANCIS26-7-12-6563.jpg[/img]

[color=#414141][font=Georgia, Arial][size=4][left]ప్రతిష్టాత్మక మెగసేసే పురస్కారానికి ఈ ఏడాది ఓ భారతీయుడు ఎంపికయ్యారు. తమిళనాడులోని పల్లె సీమల్లో పేదరిక నిర్మూలనకు, మహిళా సాధికరతకు అలుపెరుగని కృషి చేస్తున్న కుళందై ఫ్రాన్సిస్‌ (65)ను పురస్కారానికి ఎంపిక చేసినట్లు మెగసేసే ఫౌండేషన్‌ ప్రకటించింది. ఈయనతోపాటు తైవాన్‌, ఫిలిప్పీన్స్‌, కంబోడియా, బంగ్లాదేశ్‌, ఇండోనేషియాలకు చెందిన వారు పురస్కారానికి ఎంపికయ్యారు. కుళందై ఫ్రాన్సిస్‌ తమిళనాడులోని కృష్ణగిరిలో ఇంటిగ్రేటెడ్‌ విలేజ్‌ డెవెలప్‌మెంట్‌ ప్రాజెక్టు (ఐవిడిపి) ఏర్పాటు చేసి దాని ద్వారా వేలాది మంది పేద మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. సూక్ష్మ రుణాలు, ఇతర సామాజిక కార్యక్రమాల ద్వారా పేదరికంలో మగ్గుతున్న అనేకమంది మహిళల జీవితాల్లో ఫ్రాన్సిస్‌ మార్పు తెచ్చారని మెగసేసే ఫౌండేష్‌ పేర్కొంది. అణ్ణామలై విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడైన ఫ్రాన్సిస్‌ 1979లో ఐవిడిపి ప్రారంభించారు. స్వయంసహాయక సంఘాలు, సామూహిక కార్యక్రమాలు, సూక్ష్మ రుణాలు, పొదుపు ఖాతాలు....మొదలైన పలు చర్యల ద్వారా గ్రామీణ మహిళల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. కృష్ణగిరి, ధర్మపురి, వెల్లూరు జిల్లాల్లో ప్రస్తుతం ఎనిమిది వేలకు పైగా స్వయంసహాయక సంఘాలు పనిచేస్తున్నాయి. ఫ్రాన్సిస్‌కు తోడుగా ఆయన భార్య, కుమార్తె కూడా కార్యకలాపాల్లో పాలు పంచుకుంటున్నారు. [/left][/size][/font][/color]

×
×
  • Create New...